మానసీ ప్రధాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసీ ప్రధాన్
Manasi Pradhan.jpg
జననం (1962-10-04) 1962 అక్టోబరు 4 (వయస్సు: 57  సంవత్సరాలు)
బనాపూర్, ఖోర్ధా జిల్లా, ఒడిషా
జాతీయతభారతీయురాలు
చదువుఒడియా సాహిత్యంలో ఎం.ఎ, ఎల్.ఎల్.బి
విద్యాసంస్థలుఉత్కళ్ విశ్వవిద్యాలయం, జి.ఎం న్యాయవిద్యా కళాశాల, పూరి (ఒరిస్సా)
వృత్తిమహిళల హక్కుల పోరాట కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి
సంస్థనిర్భయ వాహిని, ఒ.వై.ఎస్.ఎస్ ఉమెన్, నిర్భయ సమరోహ్
పేరుతెచ్చినవిఉర్మి-ఒ-ఉచ్చ్వాస్, అక్ష దీప, స్వాగతిక
ఉద్యమంహానర్ ఫర్ ఉమెన్ నేషనల్ క్యాంపైన్
పురస్కారాలుశ్రీ శక్తి పురస్కార్(2013), ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం(2011)

మానసీ ప్రధాన్ (జననం 1962 అక్టోబరు 4), భారతీయ మహిళల హక్కుల పోరాట కార్యకర్త, స్త్రీవాద రచయిత్రి, కవయిత్రి. మహిళా హక్కుల ఉద్యమకర్తగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా హానర్ ఫర్ ఉమెన్ నేషనల్ క్యాంపైన్ పేరుతో దేశవ్యాప్త ఉద్యమం నడుపుతోంది.[1][2][3][4][5][6][7] 2014లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె, రాణీ లక్ష్మీబాయ్ స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకుంది. ఈ పురస్కారాన్ని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్త అధ్యక్షురాలు మేరీ ప్రేమా పైరిక్ తో కలసి అందుకుంది. 2011లో, ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం కూడా అందుకుంది.[8][9][10][11]

మానసీ, 21వ శతాబ్దపు ప్రపంచవ్యాప్త స్త్రీవాద ఉద్యమాలకు మార్గదర్శకురాలిగా ప్రాచుర్యం పొందింది.[12][13][14][15] ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ప్రచురించే ప్రపంచ టాప్ సామాజిక ఉద్యమ కార్యకర్తలు, రచయిత్రుల జాబితాల్లో తరచుగా ఆమె పేరు ఉంటూ ఉంటుంది. 2016లో, న్యూయార్క్ కు చెందిన బస్టల్ అనే పత్రిక ఆమె పేరును 20 అత్యంత స్ఫూర్తిదాయక స్త్రీవాదులు, ఉద్యమకారుల జాబితాలో నోబెల్ బహుమతి పొందిన షిరిన్ ఎబదీ, రిగొబెర్టా మెంచూ, మలాలా యూసఫ్‌జాయ్, బెట్టీ ఫ్రైడన్, నయోమి క్లైన్, అంగెలా డావిస్, కేట్ మిల్లెట్, గ్లోరియా స్టైనెం ల సరసన ప్రచురించింది.[16] 2017లో, లాస్ ఏంజలెస్ కు చెందిన వల్కెర్ మీడియా 12 అత్యంత శక్తివంతమైన స్త్రీవాద చేంజ్ మేకర్స్ జాబితాలో ఈమె పేరు చేర్చడం విశేషం.[17]

ఆమె నిర్భయ వాహిని, నిర్భయ సమరోహ్, ఒ.వై.ఎస్.ఎస్ ఉమెన్ వంటి సంస్థలను స్థాపించింది. [18][19] ఆమె భారత సెన్సార్ బోర్డులో కూడా పనిచేసింది. [20] జాతీయ మహిళా కమిషన్ లో విచారణ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు.[21][22][23][24]

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]

మానసీ, ఒడిషాలోని ఖోర్ధా జిల్లాలో బానాపూర్ కు చెందిన అయతాపూర్ అనే మారుమూల పల్లెటూరిలో జన్మించింది.[8] ఆమె తండ్రి గోదబరిష్ ప్రధాన్ రైతు, తల్లి హేమలత ప్రధాన్ గృహిణి. ప్రధాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. అందరికన్నా మానసీ పెద్దది.[25]

అప్పట్లో, వారి ఊరిలో ఆడపిల్లలు చదువుకోవడం నిషేధం. వారి చుట్టుపక్కల ఊర్లలో ఉన్నత పాఠశాలలో చదువుకునే ఆడపిల్లలు చాలా అరుదుగా ఉండేవారు. తన ఊరిలో మాధ్యమిక విద్య వరకూ చదువుకున్న ఆమెను పై చదువులు చదవనివ్వకూడదని చాలా ప్రయత్నాలు జరిగాయి. వారి ఊళ్ళో ఉన్నత పాఠశాల లేకపోవడమే దీనికి కారణం.[26]

రోజూ కొండ ప్రాంతాల మధ్య, చిత్తడి నేల మీదా దాదాపు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉన్నత పాఠశాల వెళ్ళి చదువుకునేది ఆమె. అది వారి ప్రాంతంలోనే ఏకైక ఉన్నత పాఠశాల. మానసీ, తన ఊరిలో ఉన్నత పాఠశాల పరీక్షలు పాసైన మొట్టమొదటి ఆడపిల్లగా చరిత్ర సృష్టించింది.[8][27]

గంభరిముండలోని పటిటాపబన్ ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి అయిన తరువాత, ఆమె కళాశాల చదువు కోసం వారి కుటుంబం పూరి కి మకాం మార్చింది. ఊరిలోని పొలం నుండి వచ్చే అతి తక్కువ ఆదాయంతో పూరిలో వారి కుటుంబానికి గడవడం కష్టం అయిపోయింది. దానితో వారి కుటుంబ భారం మొత్తం ఆమెపై పడింది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయిన తరువాత, తన చదువులకూ, కుటుంబాన్ని నడపడానికీ ఆమె ఉద్యోగం చేయడం ప్రారంభించింది. ఆ తరువాత పూరిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆర్థిక శాస్త్రం విభాగంలో బి.ఎ, ఉత్కళ్ విశ్వవిద్యాలయం నుంచి ఒడియా సాహిత్యంలో ఎం.ఎ పూర్తి చేసింది.[28][29][30]

మూలాలు[మార్చు]

 1. "President Confers Stree Shakti Puruskar on International Women's Day". Press Information Bureau, Government of India. 8 March 2014. Retrieved 12 March 2014. Cite web requires |website= (help)
 2. "Manasi among World's top feminists". The Pioneer. 24 November 2016. Retrieved 12 February 2018. Cite web requires |website= (help)
 3. "These women's rights activists inspire us to fight for equality". One.org, Washington, DC. Retrieved 3 June 2017. Cite web requires |website= (help)
 4. "Manasi Pradhan wins Rani Laxmibai Puraskar". మూలం నుండి 4 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 13 July 2017. Cite web requires |website= (help)
 5. "Delhi gangrape victim continues to embolden Indian women - Matters India". మూలం నుండి 13 మార్చి 2014 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 6. "At Chilika meet, rural women vow to fight against violence". Daily Pioneer. Dailypioneer.com. 2013-04-26. Retrieved 2013-06-15.
 7. Vu Thu Ha (29 September 2017). "World needs empowered women more than ever". Vietnem News. Retrieved 2018-03-14.
 8. 8.0 8.1 8.2 "Rani Laxmibai Stree Shakti Puraskar for Manasi Pradhan". Statesman. 7 March 2014. Retrieved 12 March 2014. Cite web requires |website= (help)
 9. http://unwomen-asiapacific.org/mediaclippings/myFiles/Countries/India/2012/03-March/UN-Women-and-NCW-report2.pdf
 10. "Women Reformers : Breaching Bastions". Sulabh International. 5 March 2017. Retrieved 3 June 2017. Cite web requires |website= (help)
 11. "Giving Wings to Fly". Hindustan Times. Hindustan Times Newspaper Ltd. 8 March 2018. Retrieved 2018-03-15.
 12. "Manasi Pradhan". www.womensactivism.nyc. New York City Department of Records & Information Services and New York Commission on Gender Equality, New York, United States.
 13. "These women's rights activists inspire us to fight for equality". One.org, Washington, DC. 9 February 2017. Retrieved 3 June 2017. Cite web requires |website= (help)
 14. Madeleine Dabernig (23 March 2018). "10 Women fighting for Human Rights that you should know about". TWSS Magazine. Bristol University, United Kingdom. Retrieved 2018-03-26.
 15. "Smash stereotypes to close the gender gap". The Strait Times, Singapore. 30 September 2017. Retrieved 13 October 2017. Cite news requires |newspaper= (help)
 16. Miller, E. Ce (14 November 2016). "20 Feminist Authors And Activists Who Will Inspire You To Get Out There And Fight". Bustle magazine, BDG Media Inc., New York City. Retrieved 30 December 2016. Cite web requires |website= (help)
 17. Ivashchenko, Ekaterina (6 July 2017). "Women's Power : 12 Feminists Any Changemaker Should Know". Welker Media Inc., Los Angeles. Retrieved 12 July 2017. Cite web requires |website= (help)
 18. "Stree Shakti Puraskar" (PDF) (Press release). Retrieved 13 March 2014.
 19. "Change in both men, women's mindsets needed'". Daily Pioneer. 21 April 2014. Retrieved 13 March 2014.
 20. "I & B Ministry appoints Manasi Pradhan as Censor Board advisory member - Trade News". BollywoodTrade.com. 2010-08-20. Retrieved 2013-06-15. Cite web requires |website= (help)
 21. "Women's Panel to probe teacher's murder". NDTV. 12 November 2013. Retrieved 2018-03-14. Cite news requires |newspaper= (help)
 22. "Chilika circuit not safe for women, says NCW". Times of India. 2 February 2014. Retrieved 2018-03-14. Cite news requires |newspaper= (help)
 23. "Serious loopholes in Women Security". 8 December 2013. Retrieved 2018-03-14. Cite news requires |newspaper= (help)
 24. "NCW for Judicial Probe into Woman Constable Assault". Outlook India. news.outlookindia.com. 20 September 2012. మూలం నుండి 8 నవంబర్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-06-15.
 25. "महिला हिंसा के खिलाफ आवाज़ उठाती मानसी प्रधान". Lok Bharat Media Network. మూలం నుండి 4 జనవరి 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 3 Jan 2018. Cite web requires |website= (help)
 26. "Story of Manasi Pradhan". First Stone Foundation. Retrieved 3 June 2017. Cite web requires |website= (help)
 27. "Manasi Pradhan – The Social Reformer". JanManch TV. మూలం నుండి 16 జూన్ 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 12 July 2017. Cite web requires |website= (help)
 28. "Manasi Pradhan wins Rani Laxmibai Puraskar". Orissa Post. మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-05-22. Cite web requires |website= (help)
 29. "An interview with Manasi Pradhan". The YP Foundation. Retrieved 21 June 2017. Cite web requires |website= (help)[permanent dead link]
 30. "Manasi Pradhan biography". www.notedlife.com. మూలం నుండి 4 జనవరి 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 13 July 2017. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]