భావనా ​​కాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భావనా కాంత్
భావనా కాంత్
వ్యక్తిగత వివరాలు
జననం (1992-12-01) 1992 డిసెంబరు 1 (వయసు 31)
దర్భంగా,బీహార్, భారతదేశం
జీవిత భాగస్వామిఫ్లైట్ లెఫ్టినెంట్ కన్హయ్య ఆచార్య
వృత్తిఫైటర్ పైలట్
పురస్కారాలునారీ శక్తి పురస్కారం
Military service
Allegiance భారతదేశం
Branch/serviceవైమానిక దళం, భారతదేశం
Rank ఫ్లైట్ లెఫ్టినెంట్

భారత దేశ తొలి మహిళా ఫైటర్ పైలట్‌లలో భావనా ​​కాంత్ ఒకరు.[1] మోహనా సింగ్, అవనీ చతుర్వేదితో పాటు ఈమె కూడా మొదటి ఫైటర్ పైలట్‌గా ప్రకటించబడింది.[2] భావనా, జూన్ 2016లో భారత వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్‌ లో చేరింది. జూన్ 18, 2016న దేశానికి సేవ చేసేందుకు అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారికంగా నియమించాడు.[3] ప్రయోగాత్మకంగా మహిళల కోసం భారత వైమానిక దళంలో ఫైటర్ స్ట్రీమ్‌ను ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ కార్యక్రమానికి మొదటిగా ఎంపికైన ముగ్గురు మహిళలలో ఈమె ఒకరు. మే 2019లో భారతదేశంలో పోరాట కార్యకలాపాలకు అర్హత సాధించిన మొదటి మహిళా ఫైటర్ పైలట్‌ గా గుర్తించబడింది.[4] అంతేకాకుండా మిగ్ విమానాలు నడిపిన మొదటిమహిళగా రికార్డ్ సాధించింది. 2019లో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నారీశక్తి పురస్కారం అందుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

భావనా కాంత్ బీహార్‌లోని దర్భంగాలో జన్మించింది.[5] ఈమె తండ్రి తేజ్ నారాయణ్ కాంత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, తల్లి రాధా కాంత్, గృహిణి.[6] ఈమె చిన్నప్పుడు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, పెయింటింగ్ వంటి క్రీడలను ఎక్కువగా ఇష్టపడేది,[7] కానీ ఈమె ఎక్కువగా విమానాలు నడపాలని అనుకునేది.

చదువు[మార్చు]

భావనా, బరౌని రిఫైనరీలోని డిఏవి పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది.[8] ఈమె 2014లో బెంగుళూరులోని పిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్‌ చదివింది. ఆ తరువాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యింది.[9]

కెరీర్[మార్చు]

(ఎడమ నుండి కుడికి) మోహనా సింగ్, అవని చతుర్వేది, భావన కాంత్

భావనా కాంత్ ఎప్పుడూ విమానాలు నడపాలని కలలు కనేది.[10] ఈమె ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ రాసి వైమానిక దళంలోకి ప్రవేశించడానికి ఎంపికైంది. ఈమె స్టేజ్ 1 శిక్షణలో భాగంగా, ఫైటర్ స్ట్రీమ్‌లో చేరింది. జూన్ 2016 లో, హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కాంత్ ఇంటర్మీడియట్ జెట్ నడిపేందుకు గాను ఆరు నెలల పాటు స్టేజ్-II శిక్షణ పొందింది, ఆ తర్వాత అదే సంవత్సరం దుండిగల్‌ లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ స్ప్రింగ్ టర్మ్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమించబడింది. ఈమె హాక్ అడ్వాన్స్‌డ్ జెట్లను నడిపేది. 2017 నవంబరులో ఈమెతో సహా మోహనా సింగ్, అవనీ చతుర్వేదిలు మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌ లో చేరారు. ఫ్లయింగ్ ఆఫీసర్ గా భావనా ​​కాంత్ 16 మార్చి, 2018న మిగ్-21 'బైసన్' ను అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి 1400 గంటలు ఒక్కతే నడిపింది. ఈమె కొన్ని ప్రింట్ ప్రకటనలలో కూడా నటించింది. మార్చి 9, 2020న, ఈమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది.[11] ఈమె భారత వైమానిక దళం, నంబర్ 3 స్క్వాడ్రన్ కోబ్రాస్‌లో చేరింది. ప్రస్తుతం రాజస్థాన్ లోని బికనీర్ లోని వైమానిక స్థావరంలో ఈమె విధులు నిర్వర్తిస్తుంది.[12]

2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Meet The Trio Who Will Be India's First Women Fighter Pilots". NDTV.com. Retrieved 2022-03-13.
  2. Mohammed, Syed. "For IAF's first women fighter pilots Mohana Singh, Bhawana Kanth & Avani Chaturvedi, sky is no limit". The Economic Times. Retrieved 2022-03-13.
  3. Krishnamoorthy, Suresh (2016-06-18). "First batch of three female fighter pilots commissioned". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-13.
  4. "Air Force's First 3 Women Fighter Pilots May Fly Mig-21 Bisons From November". NDTV.com. Retrieved 2022-03-13.
  5. "Flt Lt Bhawana Kanth is first woman fighter pilot to qualify for combat duty". The Indian Express. 2019-05-23. Retrieved 2022-03-13.
  6. "India's First Women Fighter Pilots Get Wings". NDTV.com. Retrieved 2022-03-13.
  7. "Supported by parents, Bhawana Kanth to script IAF history, become a fighter pilot". News18. 2016-03-16. Retrieved 2022-03-13.
  8. "Bhawana Kanth Current Affairs, GK & News - GKToday". www.gktoday.in. Retrieved 2022-03-13.
  9. "Supported by parents, Bhawana Kanth to script IAF history, become a fighter pilot". News18. 2016-03-16. Retrieved 2022-03-13.
  10. "First three women Air Force fighter pilots to be commissioned in December". Zee News. 2017-10-05. Retrieved 2022-03-13.
  11. telugu, 10tv (2021-01-20). "రిపబ్లిక్ డే విన్యాసాల్లో..'రాఫెల్'తో మొదటి మహిళా ఫైటర్ పైలట్ భావనా కాంత్.| Delhi". 10TV. Retrieved 2022-03-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  12. "తొలి మహిళా యుద్ధ పైలట్‌గా భావన". Sakshi. 2019-05-23. Retrieved 2022-03-13.