గుంజన్ సక్సేనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్లైట్ లెఫ్టినెంట్
గుంజన్ సక్సెనా
గుంజన్ సక్సెనా
స్థానిక పేరుగుంజన్
జననం1975 (age 48–49)[1]
రాజభక్తిభారతదేశం ( India)
సేవలు/శాఖఇండియన్ ఎయిర్ ఫోర్స్
సేవా కాలం1996–2004
ర్యాంకు ఫ్లైట్ లెఫ్టినెంట్
పోరాటాలు / యుద్ధాలుకార్గిల్ యుద్ధం

గుంజన్ సక్సేనా (జననం 1975) భారత వైమానిక దళం (IAF) అధికారిణి,[2] మాజీ హెలికాప్టర్ పైలట్. ఈమె 1996లో ఐఎఎఫ్ లో చేరింది. 1999లో వచ్చిన కార్గిల్ యుద్ధంలో పాల్గొంది.[3]  ఆ యుద్ధంలో కార్గిల్ నుండి క్షతగాత్రులను తరలించడం, రవాణా సామాగ్రి, నిఘాలో సహాయం చేయడం వంటి పనులు చేసింది. 2004 వరకు, ఎనిమిది సంవత్సరాలు పైలట్‌గా పనిచేసింది. అప్పట్లో మహిళలకు శాశ్వత  కమిషన్లు అందుబాటులో లేకపోవడం వలన ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది.

  • నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 2020 బాలీవుడ్ చిత్రం గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్ ఈమె నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించారు.
  • ఈమె కిరణ్ నిర్వాన్‌తో కలిసి వ్రాసిన పుస్తకం "ది కార్గిల్ గర్ల్" పెంగ్విన్ పబ్లిషర్స్ ద్వారా విడుదల అయ్యింది.[4] 2020 లో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సక్సేనా ఆర్మీ కుటుంబంలో జన్మించింది.[5] ఈమె తండ్రి, లెఫ్టినెంట్ కల్నల్ అనుప్ కుమార్ సక్సేనా, సోదరుడు లెఫ్టినెంట్ కల్నల్ అన్షుమాన్ ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. సక్సేనా న్యూ ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివింది. సక్సేనా భర్త గౌతమ్ నారాయణ్, వింగ్ కమాండర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఇతను ఐఏఎఫ్ ఎంఐ-17 (IAF Mi-17) హెలికాప్టర్‌కు పైలట్, నారాయణ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బోధకుడిగా కూడా పనిచేశాడు. ఈ అకాడమీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-సర్వీస్ అకాడమీ. ఈ దంపతులకు ప్రగ్యా అనే కుమార్తె ఉంది, ఆమె 2004లో జన్మించింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్[మార్చు]

1996లో భారత వైమానిక దళం (IAF) లో పైలట్‌లుగా చేరిన ఆరుగురు మహిళల్లో సక్సేనా ఒకరు. ఐఎఎఫ్ కోసం మహిళా ఎయిర్‌ఫోర్స్ ట్రైనీలలో ఈమెది నాల్గవ బ్యాచ్. ఈమె దుండిగల్‌ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్ గా శిక్షణ తీసుకుంది.[6] ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా 132 ఫార్వర్డ్ ఏరియా కంట్రోల్ (FAC) లో భాగంగా సక్సేనాకి మొదటి పోస్టింగ్ ఉదంపూర్‌లో ఇచ్చారు. ఫ్లయింగ్ ఆఫీసర్ గా సక్సేనా కార్గిల్ యుద్ధ సమయంలో పనిచేసేటప్పుడు ఈమెకు 24 సంవత్సరాలు. కార్గిల్ యుద్ధంలో, ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో భాగంగా, క్షతగాత్రులను తరలించడమే కాకుండా, ద్రాస్, బటాలిక్ ఫార్వర్డ్ ప్రాంతాల్లోని దళాలకు సామాగ్రిని రవాణా చేయడంలో ఈమె సహాయం చేసింది.[7] శత్రు స్థానాలను మ్యాపింగ్ చేయడం వంటి నిఘా పనులు కూడా చేసింది.

ఇది కుడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Watched 'Gunjan Saxena: The Kargil Girl'? Here's the story of the woman it is based on". Indian Express. Retrieved 2020-08-20.
  2. "Watched 'Gunjan Saxena: The Kargil Girl'? Here's the story of the woman it is based on". The Indian Express. 2020-08-27. Retrieved 2022-03-13.
  3. "Gunjan Saxena never thought in her wildest dreams she would inspire a film". The Week. Retrieved 2022-03-13.
  4. "The Kargil Girl". Penguin Random House India. Retrieved 2022-03-13.
  5. Nast, Condé (2020-06-09). "This is the real story of Gunjan Saxena, the Kargil girl who has inspired Janhvi Kapoor's next film". GQ India. Retrieved 2022-03-13.
  6. "The Kargil Girl". Penguin Random House India. Retrieved 2022-03-13.
  7. Rawat, Rachna Bisht. "Meet Flying Officer Gunjan Saxena, India's only woman warrior in the Kargil war". Scroll.in. Retrieved 2022-03-13.