చిత్రలేఖనం

వికీపీడియా నుండి
(పెయింటింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.

దృశ్యకళ (Visual Arts) లో చిత్రలేఖనానికి తగు ప్రాముఖ్యత ఉన్నది. చిత్రపటాన్ని గీయటం, కూర్పు లే కాకుండా, సంజ్ఞ, కథనం మరియు నైరూప్యం చిత్రలేఖనం లో కీలక పాత్రలు పోషిస్తాయి. సహజత్వం, ప్రాతినిధ్యం, ఛాయాచిత్రం, నైరూప్యం, కథనం, ప్రతీకాత్మకం, భావోద్రిక్తం లేదా రాజకీయం: చిత్రలేఖనం లో ప్రధాన వర్గాలు.

చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (painting) ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.

చరిత్ర[మార్చు]


2018 నాటికి అతి పురాతనమైన చిత్రలేఖనాలు ఫ్రాన్స్ కి చెందిన గ్రట్ షావే ప్రాంతంలో 32,000 సంవత్సరాల క్రితానివి. గుర్రాలు, ఖడ్గమృగాలు, సింహాలు, బర్రె, ఏనుగు, మనుషులు మరియు ఇతర నైరుప్య చిత్రాలను ఈ చిత్రపటంలో చిత్రీకరించారు. ఇండోనేషియా లోని లుబాంగ్ జేర్జి సాలెహ్ గుహలలో 40,000 సంవత్సరాల క్రితం గీయబడిన కేవ్ పెయింటింగ్స్ కనుగొనబడ్డాయి. ఉత్తర ఆస్ట్రేలియా లో ని ఆర్న్ హెం ల్యాండ్]] లో 60,000 సంవత్సరాల క్రితం వేసిన చిత్రపటాలు ఉన్నవి. కేవ్ పెయింటింగ్స్ ఆనవాళ్ళు ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, చైనా, మెక్సికో ల లో కలవు. పాశ్చాత్య దేశాలలో జలవర్ణ/తైలవర్ణ చిత్రాలు రాజ్యాలు ఏలితే, తూర్పు దేశాలలో వివిధ రంగుల్లో ఉన్న సిరా తో వేసిన చిత్రాలు అంతే సంపన్నం అయ్యాయి.


ఫోటోగ్రఫీ చిత్రలేఖనం పై ప్రభావం చూపింది. 1829 లో మొదటి ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత ఆ రంగంలో ప్రక్రియలు, దినదినాభివృద్ధి చెందుతూ ఉండటం వలన ఫోటోగ్రఫీ విస్తరించింది. దీనితో అప్పటి వరకు కంటికి కనపడే ప్రపంచాన్ని చిత్రపటాలలో ఆవిష్కరించే ఈ కళ యొక్క పరమార్థం కొద్దిగా కుంటు పడింది. 19/20వ శతాబ్దాలలో వరుసగా ఇంప్రెషనిజం, పోస్ట్ ఇంప్రెషనిజం, ఫావిజం, ఎక్స్ప్రెషనిజం, క్యూబిజం మరియు దాదాయిజం వంటి కళా ఉద్యమాలు ఏర్పడ్డటం, అప్పటి వరకు చిత్రకళ లో వేళ్ళూనుకొన్న రినైసెన్స్ ను కుదిపేసింది. అయినప్పటికీ తూర్పు దేశాలు, ఆఫ్రికా ఖండం లోని చిత్రకళలు మాత్రం చిత్రకళలోని ఈ మార్పుకు ప్రభావితం అవ్వలేదు.

చారిత్రకంగా పెద్ద పీట వేయబడిన నైపుణ్యానికి బదులుగా అధునాతన, సమకాలీన చిత్రకళలు భావన కి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలు పెట్టాయి. 21వ శతాబ్దపు చిత్రలేఖనాలు కీలక/బహుముఖ తత్వాలతో కళకి సంబంధించిన అదివరకటి వాంగ్మూలాలకు సవాళ్ళను విసిరింది. ప్లూరలిజం లక్షణం గా అలవర్చుకొన్న యుగంలో కాలాన్ని ప్రతిబింబించటం పై ఏకాభిప్రాయం లేదు. వివిధ శైలులలో కళాకారులు తమ చిత్రకళకు సొబగులు అద్దుకొంటూ పోతూ ఉండగా, వాటి లాభనష్టాలు సాధారణ ప్రజానీకం మరియు కళా విపణల యొక్క విచక్షణకు వదిలి వేయబడ్డాయి.

సిద్ధాంతం[మార్చు]

18/19వ శతాబ్దానికి చెందిన తత్వవేత్తలు ఇమ్యానువల్ క్యాంట్ మరియు హెగెల్, చిత్రలేఖనంలో సౌందర్యాని పై స్పందించవలసిన, చిత్రలేఖనానికి సిద్ధాంతాలు ఆపాదించవలసిన అవసరం వచ్చింది. ప్లేటో మరియు అరిస్టాటిల్ లు కూడా చిత్రకళ పై సిద్ధాంతాలు తీశారు. చిత్రలేఖనం (మరియు శిల్పకళ) సత్యాన్ని సాక్షాత్కరించలేవని, సత్యం యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే అవిష్కరించగలవని; కావున ఈ రెండు రంగాలు కళల కంటే (పాదరక్షల తయారీ, లేదా ఇనుప పనిముట్ల తయారీ వలె, కేవలం) నైపుణ్యం గానే పరిగణించబడగలవని తెలిపాడు. కానీ లియొనార్డో డా విన్సీ కాలానికి పురాతన గ్రీసు చిత్రకళకు భిన్నంగా చిత్రకళ వాస్తవానికి దగ్గరగా వచ్చింది. లియొనార్డో ప్రకారం, చిత్రకళ: ఒక మానసిక స్థితి (Painting is a thing of mind).

చిత్రకళ సౌందర్యానికి సార్వత్రికత తేలేకపోవటం ఈ కళ యొక్క లోపంగా ఎత్తి చూపాడు. కవిత్వం మరియు సంగీతం రంగాలు ప్రతీకాత్మకంగా, మేధస్సును ఉపయోగించేవి కావున చిత్రకళ కూడా వీటి వలె ఒక రొమాంటిక కళగా గుర్తించాడు. వాస్సిలీ క్యాండిన్స్కీ, పాల్ క్లీ వంటి చిత్రకారులు కూడా వారివారి సిద్ధాంతాలు చేశారు. గొయ్థె అప్పటికే ఆ దిశగా చేసిన సిద్ధాంతం: చిత్రకళకు ఆధ్యాత్మిక విలువ కలదని, ప్రాథమిక వర్ణాలే ముఖ్యమైన భావనలు లేదా అంశాలు. దీనినే క్యాండిన్స్కీ మరింత ముందుకు తీసుకెళ్ళాడు.

ఐకానోగ్రఫీ చిత్రలేఖనం శైలి ని గమనించటానికి బదులుగా అందులో ఉన్న అంశాలను అధ్యయనం చేస్తుంది. ఎర్విన్ పానోఫ్స్కీ వంటి చరిత్రకారులు మొదట చిత్రీకరించిన అంశాలను అధ్యయనం చేసి ఆ తర్వాత అవి వీక్షకునికి ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకొని చివరగా వాటిలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మరియు సాంఘిక అంశాలకు భాష్యం చెబుతారు.

1890 లో ప్యారిస్ కు చెందిన చిత్రకళాకారుడు మారిస్ డెనిస్: "చిత్రలేఖనం గురించి జ్ణాపకం ఉంచుకొనవలసిన విషయం - యుద్ధానికి సిద్ధం అయిన గుర్రం అయినా, వివస్త్ర అయిన స్త్రీ అయినా, ఒక కథ కాకపోతే మరొకటి అయినా, చిత్రీకరించే ముందు ఇవన్నీ ఒక చదునైన ఉపరితలం పైన ఒక క్రమంలో పేర్చే రంగులే." అది వరకు ప్రకృతి మాత్రమే చిత్రకళ లో ప్రాధానాంశం కాగా, 20వ శతాబ్దం లో చిత్రకళలో వనరుల ప్రతిబింబాల వంటి క్యూబిజం వంటి కళా ఉద్యమాలు పుట్టుకు రావటానికి కారణం ఇదే అయ్యి ఉండవచ్చును. జూలియన్ బెల్ అనే చిత్రకారుడు/రచయిత, What is Painting? అనే తన పుస్తకంలో ఈ క్రింది విధంగా రాశాడు:

కళ లోని పనితనం మీ దృష్టిని ఆకర్షించి మీ చూపును ప్రక్కకి తిప్పకుండా చేస్తుంది: కళ యొక్క చరిత్ర, అక్కడి నుండి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఊహలు అనే ఇళ్ళను కూలుస్తూ రహదారిని నిర్మిస్తుంది.

మాధ్యమాలు[మార్చు]

రంగు పెన్సిళ్ళు[మార్చు]

పేస్టెల్[మార్చు]

కొవ్వొత్తిలా ఉండే పేస్టెళ్ళ లో రంగు పొడి మరియు బైండరు ఉంటాయి.

సిరా[మార్చు]

కలం, బ్రష్ లేదా ఈకను సిరాలో ముంచి చిత్రలేఖనం చేస్తారు.

జలవర్ణ చిత్రలేఖనం (వాటర్ కలర్ పెయింటింగ్)[మార్చు]

కావలసినంత రంగును నీటిలో కరిగించి, దానిని కాగితం, వస్త్రం పై అద్దటంతో చిత్రలేఖనం చేయబడుతుంది. చైనా, జపాన్, కొరియా దేశాలలో ఇదే ప్రధాన మాధ్యమం. చేతి వ్రేళ్ళను కూడా సాధనాలుగా చేసుకొని చిత్రలేఖనం చేయవచ్చు.

ఆక్రిలిక్ పెయింటింగ్[మార్చు]

తైలవర్ణ చిత్రలేఖనం[మార్చు]

త్వరగా ఆరిపోయే గుణం ఉండే తైలాలో రంగులను కలిపి చిత్రలేఖనం లో వాడుతారు.

డిజిటల్ పెయింటింగ్[మార్చు]

చిత్రలేఖనం లో ప్రధానాంశాలు[మార్చు]

వర్ణం మరియు లక్షణం[మార్చు]

స్వరం, తీవ్రత మరియు లయ ఎలా అయితే సంగీతం లో ప్రధానాంశాలు అవుతాయో; రంగు, సంతృప్తత, మరియు విలువ రంగుని నిర్ధారిస్తాయి. వర్ణం ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక రకమైన అనుభూతి కలిగించినను, మానసికంగా ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి పాశ్చాత్య దేశాలలో నలుపు దు:ఖాన్ని సూచించగా, తూర్పు దేశాలలో తెలుపు దు:ఖాన్ని సూచిస్తుంది. జొహాన్నె వుల్ఫ్ గ్యాంగ్ గొయ్థె, వస్సిలి క్యాండిన్స్కీ, మరియు న్యూటన్ వంటి కొందరు చిత్రకారులు, సిద్ధాంతకర్తలు, రచయితలు, శాస్త్రవేత్తలు, వారి వారి వర్ణ సిద్ధాంతాలని ప్రతిపాదించారు.

భాష వర్ణానికి కొంత మేరకే భాష్యాన్ని చెప్పగలుగుతుంది. ఉదాహరణకి "ఎరుపు"అనే పదం కంటికి కనిపించే కాంతిలో ఆ రంగు యొక్క విస్తృత శ్రేణి వైవిధ్యాలను మనకి స్ఫురింప జేయగలదు. ఒక చిత్రకారునికి వర్ణం కేవలం ప్రాథమికమో లేక ఉత్పన్నమో లేక పరిపూరకమో కాకపోవచ్చును.

సాంప్రదాయేతర అంశాలు[మార్చు]

లయ[మార్చు]

తీవ్రత[మార్చు]

వ్యంగ్య చిత్రం

చిత్రీకరించవలసినదాన్ని అవగతం చేసుకొనటం, దాని తీవ్రతకి ప్రాతినిధ్యం వహించటం చిత్రలేఖనాన్ని సశక్తపరుస్తాయి. విశ్వంలో ప్రతి బిందువుకి ఒక తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతని నలుపుగా గానీ, తెలుపుగా గానీ, ఈ రెంటి మధ్య వివిధ స్థాయిలలో ఉన్నా బూడిద రంగులలో వ్యక్తీకరించవచ్చును. సాధనలో చిత్రకారులు ఆకారాలని వ్యక్తీకరించటానికి వివిధ తీవ్రతలలో గల ఉపరితలాలని ఒకదాని ప్రక్కన మరొకటి చేరుస్తారు. అనగా చిత్రలేఖనం భావజాలం యొక్క మూలాల (జ్యామితీయా ఆకారాల, వివిధ దృక్కోణాల, చిహ్నాల వంటి వాటి) కి అతీతమైనది. ఉధాహరణకి, ఒక తెల్లని గోడ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులని బట్టి ఒక్కో బిందువు వద్ద వివిధ తీవ్రతలు ఉన్నట్లుగా ఒక చిత్రకారుడు గమనించగలుగుతాడు, కానీ సైద్ధాంతికంగా తెల్లని గోడ ఎక్కడైనా తెల్లగానే ఉంటుంది. సాంకేతిక పరంగా చూచినట్లయితే గీత యొక్క మందం కూడా గమనార్హం.

శైలి[మార్చు]

చిత్రకళ శైలిని రెండు విధాలుగా నిర్వచించవచ్చు. అవి:

  • చిత్రకారుడు వీక్షకుడి కంటికి ఎలాంటి విలక్షణ అంశాలను కనబడేలా చేస్తాడు, ఇందుకు చిత్రకారుడు అవలంబించే మెళకువలు, విధానాలు - అని. లేదా
  • చిత్రకారుడు ఏ కళా ఉద్యమానికి సంబంధించినవాడో దాని పై ఆధారపడి ఉండటం

పాశ్చాత్య శైలి[మార్చు]

మాడర్నిజం[మార్చు]

19వ శతాబ్దపు ద్వితీయార్థం నుండి 20వ శతాబ్దపు ప్రథమార్థం వరకు పాశ్చాత్య సంస్కృతిలో చోటు చేసుకొన్న సాంస్కృతిక ధోరణులు/ఉద్యమాలు మాడర్నిజం కు దారులు వేసాయి. సాంప్రదాయిక రియలిజం ని వ్యతిరేకిస్తూ మాడర్నిజం ఉద్భవించినది. కళ, వాస్తు, సాహిత్యం, మత విశ్వాసం, సంఘం, దైనందిన జీవితం మరియు సంస్థలలో అవలంబించే సాంప్రదాయిక పద్ధతులు, వాటి ఫలితాలు ఈ నవ శకం లోని ఆర్థిక, సాంఘిక, రాజకీయ స్థితుల, పరిపూర్ణ పారిశ్రామీకరణకు గురి అయిన ఈ ప్రపంచం ముందు పాత చింతకాయపచ్చడి వలె ఉన్నట్లు ఎత్తిచూపింది. మాడర్నిజం లో ఉన్న ప్రముఖ లక్షణం స్వీయ స్పృహ (Self Consciousness). ఈ ఆత్మచైతన్యమే చిత్రలేఖనం యొక్క రూపురేఖలను, ప్రక్రియను వాడే పదార్థాలపై దృష్టి పెట్టేలా చేయటమే కాక కళను నైరూప్య దిశగా అడుగులు వేయించింది.

ఇంప్రెషనిజం[మార్చు]

ఇంప్రెషనిజం మాడర్నిజం యొక్క మొట్టమొదటి ఉదాహరణ. అప్పటి వరకు స్టూడియోలకు మాత్రమే పరిమితం అయిన చిత్రలేఖనం ప్రక్రియ ఇంప్రెషనిజం తో స్టూడియో గడప దాటి ఆరు బయటకు కూడా వచ్చింది. మానవ నేత్రానికి అగుపించేది వస్తువులు కాదని, కాంతి పరావర్తనమే నని ఇంప్రెషనిజం చాటింది. అంతర్గతంగా అభిప్రాయభేదాలు ఉన్ననూ, కట్టుబాట్లు తెంచుకొన్న ఈ నూతన శైలికి అనుచరులు పెరగడంతో ఇంప్రెషనిజం దినదిన ప్రవర్థమానం అయ్యింది. గొప్ప సాంప్రదాయిక చిత్రకారులను సైతం ప్రభావితం చేసింది.

ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్[మార్చు]

రేఖ, రూపం మరియు రంగు లను దృశ్యమాన భాషలో తెలుపుతూ, లోకం యొక్క దృశ్యసంకేతాల కూర్పులో ఒకింత స్వతంత్ర భావనను చొప్పించటమే నైరూప్య ఛాయాచిత్రకళ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా లో భావోద్రేకాలను, జర్మను ఎక్స్ప్రెషనిస్టుల స్వీయ నిరాకరణను, ఐరోపాకు చెందిన (ఫ్యూచరిజం, బౌహాస్ మరియు క్యూబిజం ల వంటి కొన్ని) సారూప్య వ్యతిరేక ఉద్యమాలను, విప్లవాత్మక, రాచరిక వ్యతిరేక, వివేకవంతమైన, నిరాకరణ భావాలను కలగలుపుతూ ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం అవతరించింది.

చిత్రకళలో ఇతర ఆధునిక శైలులు


ఫోటో రియలిజం[మార్చు]

ఒక ఫోటోను చూస్తూ చిత్రలేఖనం వలె కాకుండా అచ్చుగుద్దినట్టు ఫోటో యే అన్నంత వాస్తవికంగా చిత్రలేఖనం చేయబడటమే ఫోటో రియలిజం. పాప్ ఆర్ట్ నుండి, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం కు వ్యతిరేకంగా 60/70 శతాబ్దాలలో అమెరికా లో ఫోటో రియలిజం ఉద్భవించింది.

ఒక హై రిజొల్యూషన్ ఫోటోగ్రాఫ్ ను చూస్తూ ఫోటో రియలిజం ను అవలంబించటమే హైపర్ రియలిజం. 2000 సంవత్సరం లో అమెరికా మరియు ఐరోపా లలో ఈ శైలి ఉద్భవించింది.

సర్రియలిజం[మార్చు]

సంభ్రమాశ్చర్యానికి లోనయ్యేలా, అర్థం కాని విధంగా, అపస్మారకతను తలపింపజేసేలా అనూహ్య రీతిలో విభిన్న ప్రతిబింబాలను కలుపుతూ క్రమం లేనిదిగా ఉండే చిత్రకళ శైలి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అవతరించిన దాదా శైలి నుండి సర్రియలిజం పుట్టింది.

తూర్పు ఆసియా[మార్చు]

ఇస్లామిక్[మార్చు]

భారతీయ చిత్రకళ[మార్చు]

ఆఫ్రికన్[మార్చు]

సమకాలీన చిత్రకళ[మార్చు]

చిత్ర కళలో రకాలు[మార్చు]

ఇతర చిత్రలేఖన పద్దతులు[మార్చు]

సమగ్ర చిత్రలేఖనం[మార్చు]

ప్రధాన వ్యాసం సమగ్ర చిత్రలేఖనం

Raevsky Battery at Borodino, a fragment of Roubaud's panoramic painting.

చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు.

ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి ఐరోపా, అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి, ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.

చిత్ర రచన[మార్చు]

ప్రధాన వ్యాసం చిత్ర రచన

శ్రీనివాసుని చిత్రాన్ని శ్రీ అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క అక్షరంతోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.

ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.

చిత్రాలను చిత్రించే వ్యక్తిని చిత్రకారుడు అంటారు. ఇతను రకరకాల రంగులను ఉపయోగించి తన కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని చూసి లేదా ఊహించి తన ప్రతిభతో చిత్రాన్ని రూపొందిస్తాడు. చిత్రకారుడు చిత్రకళపై ఉన్న అభిలాషతో లేదా సంపదపై మక్కువతో ఈ కళను ఎంచుకుంటాడు. తాను చిత్రించిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టి ప్రదర్శకులను సమ్మోహితులను చేయటం తద్వారా వాటికి ఆకర్షితులైన చిత్రకళా ప్రియుల నుండి మంచి విలువను పొందుతాడు. చిత్రకారుల వలన నాటి సంస్కృతిని, దుస్తులను, ఆచార వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోనగలుగుతున్నాడు.

ప్రఖ్యాత చిత్ర కారులు[మార్చు]

Panorama of a half section of Night Revels of Han Xizai, 12th century Song Dynasty painting.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]