ఎం.ఎఫ్. హుసేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎఫ్. హుసేన్

జననం సెప్టెంబరు 17 1915
పంఢర్‌పూర్, భారత్
మరణం జూన్ 9, 2011
జాతీయత భారతీయుడు
రంగం పెయింటింగ్, చిత్రలేఖనం
శిక్షణ సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్
పిల్లలు శంషాద్ హుస్సేన్

మక్బూల్ ఫిదా హుసేన్ (సెప్టెంబరు 17 1915 - జూన్ 9, 2011) (జననం: 1915, పంఢర్‌పూర్, మహారాష్ట్ర) ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి.

ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ పికాసో".[1] తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం.[2][3] ఇతను జూన్ 9 2011లండన్లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 ని.కు) అనారోగ్యంతో మరణించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వాడు. ఇతడి తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని ఇండోర్ వెళ్ళిపోయాడు. 1935లో హుసేన్ ముంబాయి లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ జూన్ 9 (8) 2011లండన్లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30ని|| కు) అనారొగ్యంతో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో అతను తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.

అభిప్రాయాలు

[మార్చు]
  • మతపరమైన విషయాల్లో హుస్సేన్‌ సృజనాత్మక చిత్రకళా భాష ప్రజలకు అర్థం కాకపోవటమే దీనంతటికీ మూలం --షిరిన్‌ గంగూలీ
  • ఆయన మరణం ఆధునిక కళకు నష్టం .హిందూ దేవతల చిత్రాలు గీసే సమయంలో హుస్సేన్‌ పొరపాటు పడ్డారు. ఆయన ఆత్మకుఅల్లా శాంతి చేకూర్చుగాక' -- బాల్‌థాకరే ..శివసేన అధినేత
  • నేను నా సొంత గడ్డ మీద కాలు మోపలేకపోతుండటం బాధాకరంగానే ఉంది. దీనికి కేవలం కొద్దిమందే కారకులు. నేనొక జానపద చిత్రకారుడిలాంటి వాణ్ణి! ప్రపంచంలో నాకంటూ ఎక్కడా స్టూడియో లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాన్వాస్‌ పెట్టుకోవటం.. బొమ్మలేసుకోవటం.. వెళ్లిపోవటం.. అంతే!

నేనే నేరమూ చెయ్యలేదు. నన్ను వ్యతిరేకించే వాళ్లు చాలా కొద్దిమందే.. నేను ఎందుకు తిరిగి రాలేనో వాళ్లకు తెలుసు.. నేనేమీ రాజకీయ నాయకుడినో, సామాజిక ఉద్యమకారుడినో కాదు. నేనో కళాకారుడిని. నేను చేసే ప్రతి పనీ ఓ కళాత్మకమైన వ్యక్తీకరణే! కళాకారుడి ప్రకటనే. దేశవ్యాప్తంగా నా మీద దాదాపు 900 కేసులున్నాయి. ఇంత పెద్ద వయసులో ఎక్కడెక్కడో కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాను? గత 12 ఏళ్లుగా మా లాయర్‌కు నెలనెలా 60-70 వేలు కడుతూనే ఉన్నా.నేను భారత్‌కు దూరం కాలేదు.. కాలేను__ హుస్సేన్

  • ఆయన శాశ్వతంగా వెళ్లిపోక మునుపే పంపించేశాం, తరిమేశాం... భయపెట్టి, బెదిరించి, మెడమీద కత్తిపెట్టి. ఒక కళాతపస్విని పొలిమేరలు దాటేదాకా తరిమితరిమి కొట్టాం.ఆయన జీవిత చరమాంకంలో ఊపిరి సలుపుకోలేనన్ని కేసులు. బతుకు భయం. దిక్కు వెదుక్కొని పారిపోవాల్సిన పరిస్థితి...!

చంపేస్తామని బెదిరించారు. చనిపోయాడుగా... ఇప్పుడేం చేస్తాం? ఆయన బొమ్మలూ శైలీ, రీతులూ, మార్గం- అజంతా ఎల్లోరాల్లా చిరాయువులు. అవి ఈ దేశ సంపద. హుసేన్‌ చిరాయువు. -- శ్రీధర్‌ కార్టూనిస్టు

  • ఆయన ఇండియాలోనే ఉంటే, ఉండనిస్తే ఇంకా కొంత కాలం హాయిగా బతికేవారు. మనం ఇచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్. పద్మవిభూ షణ్‌లు ఆయనకు తక్కువే. ఆధునిక భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన హుస్సేన్‌ను ‘భారతరత్న’తో సత్కరిస్తే, మన సమాజం తనను తాను సంస్కరించుకున్నట్లే!--- శంకర్ కార్టూనిస్టు

ప్రస్థానం

[మార్చు]

1940 ఆఖరులో హుసేన్ ప్రసిద్ధి చెందాడు. ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా స్థాపించిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపులో 1947 లో, చేరాడు. 1952 లో, ఇతడి మొదటి ప్రదర్శన జ్యూరిచ్ నగరంలో జరిగినది, , తరువాతి సంవత్సరాలలో యూరప్ , అమెరికాలో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 1955 లో, ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించినది.[4]

1967లో త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ అనే సినిమా నిర్మించాడు. దీనికి బెర్లిన్ సినిమా ఉత్సవం లో బంగారు ఎలుగుబంటు (అవార్డు) లభించింది.[5][6]

ఎం.ఎఫ్.హుసేన్ , పబ్లో పికాసో, 1971 సావోపోలో బయెన్నియల్, లో ప్రత్యేక ఆహ్వానితుడు.[6] 1973 లో పద్మ భూషణ పురస్కారం, , 1986లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడ్డాడు.[6] 1991లో పద్మ విభూషణ పురస్కారం లభించింది.

1990-నేటివరకు

[మార్చు]

భారత్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న కళాకారుడిగా పేరుగాంచాడు. ఈ మధ్యన జరిగిన క్రిస్టీ యొక్క వేలంలో 20 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి.[7]

ఇతను కొన్ని సినిమాలనూ నిర్మించాడు, గజ గామిని (మాధురీ దీక్షిత్ (నటి)).[8] మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీజ్ (తాబు (నటి)). ఇతడి "స్వీయచరిత్ర" (autobiography) "ద మేకింగ్ ఆఫ్ ద పెయింటర్".[9]

పీబాడి ఎస్సెక్స్ మ్యూజియం (PEM) (అ.సం.రా. మసాచుసెట్స్) లో, 2006 నవంబరు 4 నుండి 2007 జూన్ 3 వరకు, హుసేన్ "మహాభారత" పై గీచిన పెయింటింగ్ లు ప్రదర్శింపబడ్డాయి.

92 సం. వయస్సులో ఇతనికి రాజా రవివర్మ పురస్కారం, కేరళ ప్రభుత్వంచే ఇవ్వబడింది.[10] ఈ అవార్డుకు వ్యతిరేకంగా కేరళలో సంఘ్ పరివార్ సంస్థలు గళం విప్పాయి, కేరళ కోర్టులో కేసులు కూడా వేసారు. కేరళ కోర్టు, తుది తీర్పు విడుదలయ్యేంత వరకూ, ఈ అవార్డు పై స్టే విధించింది.[11]

వివాదాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

1990లో హుసేన్ చిత్రాలు పలు వివాదాలు సృష్టించాయి.హిందూ దేవతా చిత్రాలను అర్ధనగ్నంగాను అసభ్యంగాను చిత్రించాడని అభియోగం.[12]

ఈ చిత్రాలను హుసేన్ 1970లో చిత్రించాడు, కానీ 1996లో ఈ చిత్రాలు విచార మీమాంస అనే హిందీ పత్రికలో ముద్రితమైన తరువాత వివాదం దాల్చుకున్నాయి. ఈ వివాదపు ఫిర్యాదును 2004 లో, ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.[13][14]

1998లో 'బజ్‌రంగ్ దళ్' సభ్యులు హుసేన్ ఇంటిపై దాడికి దిగారు, 26 మంది దుండగులను పోలీసులు అరెస్టు చేసారు. శివసేన ఈ దాడిని సమర్థించింది.[15]

ఫిబ్రవరి 2006 లోనూ, ఇలాంటి అపవాదు హుసైన్ పై వచ్చింది.[16] తాను ఎప్పటికీ కూడా భారతీయ చిత్రకారుడినే అని తన జన్మభూమి భారత్‌అనీ... స్వదేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకునే ప్రసక్తేలేదని తానెప్పటికీ కూడా భారతదేశంలో జన్మించిన వ్యక్తినేనని ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ పునరుద్ఘాటించారు.

మూలాలు

[మార్చు]
  1. "The Picasso of India. The 2006 Collectors Guide. Forbes Magazine". Archived from the original on 2009-05-01. Retrieved 2009-05-07.
  2. Indian painter in court reprieve
  3. Indian Personalities. M.F.Hussain. WebIndia 123
  4. "palette art gallery: biography of Husain". Archived from the original on 2012-03-12. Retrieved 2009-05-07.
  5. Profile of M. F. Husain at 20th Century Museum of Contemporary Indian Art web site Archived 2017-05-23 at the Wayback Machine - URL retrieved August 22, 2006
  6. 6.0 6.1 6.2 "M. F. Husain: M. F. Husain paintings, art work at Palette Art Gallery, India". Archived from the original on 2012-03-12. Retrieved 2009-05-07.
  7. [1]
  8. "santabanta.com". The work of the muse. Retrieved 12 December 2006.[permanent dead link]
  9. IndiaFM News Bureau, August 22, 2006 - 09:00 IST Archived 2007-09-30 at the Wayback Machine; Counterfeit artist Archived 2006-11-11 at the Wayback Machine
  10. "MF Hussain selected for Raja Ravi Varma award". Archived from the original on 2009-01-07. Retrieved 2009-05-07.
  11. "The Hindu, "High Court restraint on award for M.F. Husain"". Archived from the original on 2008-09-20. Retrieved 2009-05-07.
  12. "Protest against M.F. Husain's Derogatory Paintings". Archived from the original on 2009-04-26. Retrieved 2009-05-07.
  13. The Hindu online edition: Delhi High Court dismisses complaints against M.F. Husain Archived 2007-02-23 at the Wayback Machine - URL retrieved August 22, 2006
  14. Full text of the Delhi High Court Verdict in Hussain's Case, 1996 - URL retrieved March 5, 2007
  15. "Frontline, Vol. 15 :: No. 10 :: May 9 - 22, 1998". Archived from the original on 2007-08-10. Retrieved 2009-05-07.
  16. Rediff India Abroad: M F Husain booked for his paintings of nude gods - URL retrieved August 22, 2006

బయటి లింకులు

[మార్చు]