శంషాద్ హుస్సేన్
స్వరూపం
శంషాద్ హుస్సేన్ | |
---|---|
బాల్య నామం | శంషాద్ హుస్సేన్ |
జననం | 1946 ముంబై, బ్రిటిష్ ఇండియా |
మరణం | 24 అక్టోబరు 2015 న్యూఢిల్లీ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగం | చిత్రకారుడు |
శిక్షణ | రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్, లండన్ |
చేసిన పనులు | Paints people with a controlled palette |
అవార్డులు | లలిత్ కళా అకాడమీ నేషనల్ అవార్డు, 1983.[1] |
శంషాద్ హుస్సేన్ భారతీయ చిత్రకారుడు. ఈయన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు.ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శన లు నిర్వహించారు.
ప్రారంభ జీవితం
[మార్చు]శంషాద్ హుస్సేన్ 1946లో ముంబై లో జన్మించారు.[2] ఆయన బరోడా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరి చిత్రకళ యందు డిప్లొమా చేసారు.తరువాత ఆయన రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్త్శ్ లో చదివారు.[3] హైదరాబాద్‌లోనూ పదేళ్లు తన కళను కొనసాగించారు. చిత్రాల్లో పలురకాల మనస్తత్వాలను ప్రతిబింబించారు.
కెరీర్
[మార్చు]ఆయన మొట్టమొదట 1968 లో చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఆ ప్రదర్శనలో ఆయన మొదటి పెయింటింగ్ ను 50 రూపాయలకు అమ్మారు.[4]
అవార్డులు
[మార్చు]- 1983 లో ఆయనకు లలిత్ కళా అకాడమీ నేషనల్ అవార్డు వచ్చింది.[1]
- ఆల్ ఇండియా నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్ నుండి ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.[5]
అస్తమయం
[మార్చు]ఆయన కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 24 అక్టోబరు 2015న ఢిల్లీలో కన్నుమూశారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Shamshad Hussain". The South Asian. January 2001. Retrieved 20 August 2011.
- ↑ "SubcontinentArt - Artist Profile - Shamshad Husain". Archived from the original on 5 సెప్టెంబరు 2011. Retrieved 20 August 2011.
- ↑ "Our artists - Shamshad Hussain". Quartet Art. Archived from the original on 30 మార్చి 2012. Retrieved 20 August 2011.
- ↑ "Shamshad Husain's journey to fame". The Hindu. 3 March 2008. Retrieved 20 August 2011.
- ↑ "AINUC :: Awards and recognitions". All India National Unity Conference. Archived from the original on 22 ఆగస్టు 2010. Retrieved 20 August 2011.