ఎన్.కరుణాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్.కరుణాకర్ ప్రముఖ చిత్రకారుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బాపూ, బాలి తరువాత ఆ పరంపరలో కరుణాకర్ విశేష కృషి చేశారు. విశాఖపట్నంలో సూర్యప్రకాశ్, కస్తూరి దంపతులకు జన్మించారు. ఆయన అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, అనంతరం ఏపి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో చిత్రకారుడిగా పనిచేశారు. సోమాజిగూడలోని క్రాంతిశిఖర అపార్ట్‌మెంట్‌లో ఆధునిక గ్రాఫిక్స్‌ను ఆయన నడుపుతున్నారు. ఆయన నంది అవార్డు గ్రహీత.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కరుణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. 2013 సెప్టెంబరు 12 గురువారం సాయంత్రం గుండెనొప్పితో మృతి చెందారు.[2]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]