రినైజెన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైఖెలేంజిలో చే చెక్కిన డేవిడ్ శిల్పము, రినైజెన్స్ కు ఒక మచ్చుతునక.

రినైజెన్స్ (ఆంగ్లం: Renaissance) ఐరోపా చరిత్రలో 14-17వ శతాబ్దాలలో మధ్య యుగాలకు, ఆధునిక చరితకు వారధిగా నిలిచిన చిత్రకళా కాలావధి. ఇటలీ లో కళా ఉద్యమంగా సాగి తర్వాతి తరాలలో ఐరోపా ఖండం అంతటా విస్తరించినది.

శాస్త్రీయ గ్రీకు తత్త్వం నుండి రినైజెన్స్ దానికై అదే మానవతావాదం యొక్క రూపాంతరాన్ని నిర్వచించుకొన్నది. ఇదే ఈ కళ మూలస్తంభము. ఉదాహరణకు, ప్రోటాగరస్ అనే తత్త్వవేత్త మనిషే మిగతా అన్నింటికీ కొలబద్ద (Man is the measure of all things) అని చాటాడు. ఈ ఆలోచనాధోరణే కళ, నిర్మాణం, రాజకీయాలు, శాస్త్రీయ రంగం, సాహిత్యం లో కనబడసాగింది. తైలవర్ణ చిత్రాలలో దృష్టి కోణాన్ని చిత్రీకరించగలగటం, కాంక్రీటు తయారీ యొక్క జ్ఙానం దీని ఫలితాలు.

కళా ఉద్యమంగా రినైజెన్స్ ల్యాటిన్, వ్యావహారిక సాహిత్యంలో నూతన ఒరవడులను సృష్టించినది. ఫ్రాన్సిస్కో ప్రెట్రార్కా వెలికి తీసిన శాస్త్రీయ మూలాల ఆధారంగా పాండిత్యము, సరళ కోణ చిత్రీకరణ వలన వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రపటాలు, నిదానంగా అయిననూ విద్యా సంస్కరణలకు విస్తారంగా ఒనగూర్చాయి. రాజకీయాలలో దౌత్యపరమైన ఆచారవ్యవహారాలను, శాస్త్రాలలో పరిశీలన ప్రేరకతార్కికం (Inductive Reasoning)ల పై ఆధారపడేలా ప్రభావితం చేశాయి. రినైజెన్స్ పలు రంగాలలో విప్లవాలను సృష్టించిననూ, సామాజిక, రాజకీయ తిరుగుబాట్లకు దోహదపడినా బహుముఖప్రజ్ఙాశాలురైన లియొనార్డో డావిన్సి, మైఖెలేంజిలో వంటి వారిపై చూపిన కళాప్రభావానికే ఎక్కువ గుర్తింపుకు నోచుకొన్నది.

రినైజెన్స్ ఫ్లారెన్స్ లో 14వ శతాబ్దంలో ప్రారంభమైనది.