Jump to content

రాజా విక్రమార్క

వికీపీడియా నుండి
రాజా విక్రమార్క
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం పి.అమరనాథరెడ్డి
పి.రామచంద్రారెడ్డి
టి.ప్రభాస్ కుమార్ రెడ్డి
కథ రవిరాజా పినిశెట్టి
సత్యానంద్
తారాగణం చిరంజీవి
అమల
రాధిక
రావు గోపాలరావు
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ స్కంద ఆర్ట్స్
భాష తెలుగు

రాజా విక్రమార్క 1990లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, అమల, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] ఈ చిత్రాన్ని హిందీ లోకి దౌలత్ కి దునియా పేరుతోను తమిళం లోకి సత్యమా నాన్ కావైకారన్ గానూ అనువదించారు.[3] ఈ సినిమాను 1988 లో విడుదలైన కమింగ్ టు అమెరికా ఆధారంగా రూపొందించారు.

రాజా విక్రమార్క ( చిరంజీవి ) ఒక చిన్న రాజ్యమైన స్కంద ద్వీపపు యువరాజు. అతను యువరాజు కాబట్టి, తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి అతనికి వీలుండేది కాదు. అతని తండ్రి రాజా భూపతి ( సత్యనారాయణ ) మరొక రాజ్య యువరాణితో పెళ్ళి సంబంధం మాట్లాడుతాడు. ఆమె తనదైన మెదడూ వెన్నెముకా లేని మనిషి. విక్రమార్క తన నమ్మకమైన స్నేహితుడు జాకీ ( బ్రహ్మానందం ) తో కలిసి తన జీవితాన్ని తాను స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాన్ని విడిచిపెట్టాడు.[4] పెద్ద ఆధునిక నగరంలో, అతను ఒక స్నేహితుడిని కలిసి మెకానిక్‌గా పనిచేస్తాడు. ఈ సమయంలో అతను రేఖ ( అమలా ) పై జరిగిన రెండు హత్యా ప్రయత్నాల నుండి ఆమెను రక్షిస్తాడు. ఆమె మామ విశ్వనాథం ( రాగోపాల్ రావు ) అతన్ని ఆమెకు బాడీగార్డ్ గా నియమిస్తాడు. వాస్తవానికి తానే డబ్బు కోసం ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నానని విశ్వనాథం అతడికి వెల్లడిస్తాడు. అతడి కోసం ఈ హత్య చేసేందుకు విక్రమార్క అంగీకరిస్తాడు. అదే సమయంలో ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఇంటి నుండి గెంటివేసిన తరువాత విశ్వనాథం, కనకారావు (గొల్లపుడి మారుతి రావు ), రాజా కోటప్ప ( కోట శ్రీనివాసరావు ) తో కలిసి విక్రమార్కనూ అతని తల్లిదండ్రులనూ చంపడానికి ప్రయత్నిస్తారు. విక్రమార్క వాళ్ళను అడ్డుకుని తన రాజ్యానికి రాజుగా పాలిస్తాడు.

తారాగణం

[మార్చు]
  • చిరంజీవి
  • అమల
  • రాధిక
  • రావు గోపలరావు
  • కైకాల సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • గొల్లపూడి మారుతీరావు
  • బ్రహ్మానందం
  • సుధాకర్
  • కె.అర్. విజయ
  • శ్రీలక్ష్మి
  • ప్రసాద్ బాబు
  • అన్నపూర్ణ
  • కింగ్ కాంగ్
  • శ్రీలత
  • సంధ్య
  • నారాయణ రావు
  • హరిప్రసాద్
  • మాణిక్ ఇరాని
  • నళినీ కాంత్
  • అరుణ్ కుమార్
  • విజయ్ కుమార్
  • జగ్గారావు
  • అశోక్ కుమార్
  • ఆంజనేయులు
  • శేషగిరిరావు
  • మాధవరావు.

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఏర్ రోయ్"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:48
2. "ఎల్లే లో"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 5:05
3. "గగన కిరణ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఎస్. జానకి 6:04
4. "ఆనతి నుండి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:52
5. "నాగినివో"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 5:27
6. "భళా చాంగు భళా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 6:35
31:35

మూలాలు

[మార్చు]
  1. Venkateswaran, Anand (2013-02-10). "Rahman versus Ilaiyaraja". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-10-07.
  2. "Chiranjeevi Zindabad! Happy 63rd Birthday To The Superstar".
  3. https://www.youtube.com/watch?v=xhbxmrs-T_E
  4. "Birthday Special! Brahmanandam: Tracing the journey of the popular comedian in Tollywood so far" (in ఇంగ్లీష్). 2019-02-01.