Jump to content

శుభసంకల్పం

వికీపీడియా నుండి
శుభసంకల్పం
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
తారాగణం కమల్ హాసన్ ,
ఆమని,
ప్రియా రామన్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్
భాష తెలుగు

శుభసంకల్పం 1995 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కోదండపాణి ఫిల్మ్ సర్స్క్యూట్ పతాకంపై నిర్మించాడు. సహ నిర్మాత అయిన కమల్ హాసన్, కె. విశ్వనాథ్ను ఈ సినిమాలో మొదటి సారిగా నటించేందుకు ఒప్పించాడు.[1]

పాటలు

[మార్చు]

కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ, కె. ఎస్. చిత్ర, పల్లవి పాడారు. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. సీతమ్మ అందాలు అనే పాటకు శైలజకు నంది పురస్కారం లభించింది. వేటూరి సుందర్రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.

పాటల జాబితా
సం.పాటగాయకులుపాట నిడివి
1."సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ, కె. ఎస్. చిత్ర & బృందం04:59
2."మూడు ముళ్ళు వేసినాక"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ & బృందం05:06
3."హైలెస్స హైలెస్స"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, పల్లవి & బృందం04:11
4."చిరంజీవి సౌభాగ్యవతి"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర & పల్లవి02:17
5."శ్రీశైలంలో మల్లన్న"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & బృందం03:00
6."నరుడి బ్రతుక నటన"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం03:25
7."చుక్కలన్ని కలిసి"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & ఎస్. పి. శైలజ03:06
మొత్తం నిడివి:25:24

మూలాలు

[మార్చు]
  1. "The Hindu : Metro Plus Hyderabad : `There is no space for silences'". Archived from the original on 2005-02-08. Retrieved 2018-11-30.