Jump to content

ప్రియా రామన్

వికీపీడియా నుండి
ప్రియా రామన్
జననం (1974-06-18) 1974 జూన్ 18 (వయసు 50)[1]
తిరువనంతపురం
వృత్తి
  • నటి
  • టెలివిజన్ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1993 – 2008
2017 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రంజిత్
(m. 1999; div. 2014)
[2][3]
(m. 2018)

ప్రియా రామన్ (జననం 1974 జూన్ 18) భారతీయ నటి, టెలివిజన్ నిర్మాత. ఆమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. అలాగే మలయాళం, తమిళ భాషల టెలివిజన్ ధారావాహికలలో కూడా నటిస్తోంది. ఆమె మొదటి చిత్రం 1993లో రజనీకాంత్ నిర్మించిన చిత్రం వల్లి. ఆమె రెండవ చిత్రం అర్థనా, ఐ. వి. శశి దర్శకత్వం వహించి 1993లో విడుదలైంది, ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది.

కెరీర్

[మార్చు]

మలయాళ దర్శకుడు జోషి 1993లో మమ్ముట్టితో సైన్యం చిత్రంలో ఆమెను ఎయిర్‌ఫోర్స్ పైలట్‌ పాత్రకు ఎంపిక చేసాడు.[4]

ఆమె సినిమాలతో పాటు, బాలాజీ టెలిఫిల్మ్స్ స్వర్ణమయూరం, పావకూతు, ఓర్మా నిర్మించిన తమిళ సీరియల్ దుర్గ, మలయాళం టీవి సీరియల్ కావ్యాంజలి వంటి అనేక తమిళ, మలయాళ టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది. ఆమె జీ తమిళ సీరియల్, సెంబరుతిలో నటించింది. ఆమె అదే ఛానెల్‌లో జీన్స్ అనే సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షోను కూడా హోస్ట్ చేసింది.

ఆమె 1999లో సౌతేలా అనే హిందీ చిత్రంలోనూ నటించింది. కాగా తెలుగులో 1994లో మావూరి మహారాజుతో అరంగేగ్రం చేసి దేశ ద్రోహులు(1995), లీడర్, శుభసంకల్పం, దొరబాబు, శ్రీవారి ప్రియురాలు(1996), శ్రీకృష్ణార్జున విజయం, పడి పడి లేచే మనసు (2018) తదితర చిత్రాలలో నటించింది.

మూలాలు

[మార్చు]
  1. "Here's how Team Sembaruthi surprised Priya Raman on her birthday - Times of India". The Times of India.
  2. "priya raman and ranjith divorced". Chitramala (in Indian English). 12 June 2014. Retrieved 11 August 2017.
  3. V.P, Nicy. "Actress Priya Raman and Actor Ranjith Part Ways". International Business Times, India Edition (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2017. Retrieved 11 August 2017.
  4. Krishnakumar, G (14 January 2004). "Lights ready... action now!". The Hindu. Archived from the original on 1 February 2015.