ఆటాడిస్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆటాడిస్తా
ఆటాడిస్తా సినిమా పోస్టర్
దర్శకత్వంరవికుమార్ చౌదరి
రచనరవికుమార్ చౌదరి
నిర్మాతసి. కళ్యాణ్, ఎస్. విజయానంద్
తారాగణంనితిన్
కాజల్ అగర్వాల్
జయసుధ
నాగబాబు
జయలలిత
ఛాయాగ్రహణంజవహర్ రెడ్డి
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
రేఖా కంబైన్స్
విడుదల తేదీ
20 మార్చి 2008 (2008-03-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆటాడిస్తా 2008, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పతాకంపై సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాణ సారథ్యంలో రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, కాజల్ అగర్వాల్, జయసుధ, నాగబాబు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[2][3] ఇది నటుడు రఘువరన్ చివరి సినిమా. 2013లో డేరింగ్ గుండారాజ్ పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.

కథా నేపథ్యం

[మార్చు]

జగన్ 'చిన్న' (నితిన్) పారిశ్రామికవేత్త లయన్ రాజేంద్ర కుమారుడు. సునంద (కాజల్ అగర్వాల్) తో ప్రేమలో పడతాడు. రాజేంద్ర ప్రత్యర్థి రఘునాథ్ వీరితో భాగస్వామ్యంలోకి రావాలనుకుంటాడు. జగన్ కు తెలియకుండా, అతని వివాహం రఘునాథ్ కుమార్తెతో నిశ్చయమవగా, ఆమె సునంద అని తెలుస్తుంది. కాని వాళ్ళ పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత కుటుంబాలు అంతగా బాగాలేవు. అపఖ్యాతి పాలైన ఎమ్మెల్యే బోనాల శంకర్ కు చెందిన పొగాకు వ్యాపారాలను రఘునాథ్ చూసుకుంటుంటాడు. తన ప్రాంతంలో పొగాకు బిజినెస్ పెట్టేందుకే రాజేంద్ర ఇష్టపడకపోవడంతో బోనాల శంకర్ వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను బెదిరిస్తాడు. దాంతో జగన్ ఆ అవినీతి రాజకీయ నాయకుడిని ఎదుర్కోని, అతడి ఆట కట్టిస్తాడు. జగన్ శంకర్ ను కొట్టాడని పుకారు వస్తుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "స్టైల్ స్టైల్"  సూరజ్ జగన్  
2. "పప్పిదే చుమ్మాదే"  దేవన్, కౌసల్య  
3. "వచ్చిందిరో సిలకా"  ఫరీద్  
4. "మిలమిల"  రవివర్మ, కౌసల్య  
5. "రేగిపోయే ఈ"  సింహ, సుచిత్ర  
6. "సారీ సారీ"  చక్రి, కౌసల్య  

మూలాలు

[మార్చు]
  1. తెలుగు వన్, సినిమాలు. "ఆటాడిస్తా". www.teluguone.com (in english). Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Aatadista". imdb.com. Retrieved 23 July 2020.
  3. తెలుగు ఫిల్మీబీట్, సినిమా. "ఆటాడిస్తా (2008)". www.telugu.filmibeat.com. Retrieved 23 July 2020.

ఇతర లంకెలు

[మార్చు]