వాయల్పాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాయల్పాడు
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో వాయల్పాడు మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో వాయల్పాడు మండలం యొక్క స్థానము
వాయల్పాడు is located in ఆంధ్ర ప్రదేశ్
వాయల్పాడు
ఆంధ్రప్రదేశ్ పటములో వాయల్పాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°39′00″N 78°38′00″E / 13.6500°N 78.6333°E / 13.6500; 78.6333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము వాయల్పాడు
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,725
 - పురుషులు 22,513
 - స్త్రీలు 22,212
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.67%
 - పురుషులు 78.40%
 - స్త్రీలు 54.80%
పిన్ కోడ్ {{{pincode}}}

వాయల్పాడు (Vayalpadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] తిరుపతి మదనపల్లి మార్గ మధ్యలో తిరుపతికి 90 కి.మీ. దూరంలో వాయల్పాడు ఉంది. ఈ గ్రామంలో "వావిలి" చెట్లు ఎక్కువ ఉండడంతో దీనికి వావిలిపాడూ అని పేరు, అది కాలక్రమంలో ముస్లింల పాలనలో వావిల్ కా పహాడ్, ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో వాయల్పాడూగా మారింది . ఈ పట్టణంలో ఉన్న శ్రీపట్టాభిరామాలయం చాలా ప్రసిద్ధి ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఇది పాకాల - ధర్మవరం మార్గములో ఉంది.

స్థలపురాణం[మార్చు]

పూర్వం వాల్మీకి మహర్షి ఇక్కడ నూరుకొప్పుల కొండ దరిలో ఆశ్రమం నిర్మించుకొని తపము ఆచరించాడని ప్రతితీ. అందుకే అ గ్రామానికి వాల్మీకిపురం అని పేరు కూడా ఉంది. త్రేతా యుగంలో జాంబ వంతుడు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించాడని అదే ఇప్పటి శ్రీపట్టాభి రామాలయం అని చెబుతారు.స్థలపురాణాన్నీ, సాంప్రదాయమైన పేరునీ శాశ్వతం చేసేందుకు ఈ మధ్యనే అధికారికంగా వాయల్పాడు గ్రామాన్ని ‘వాల్మీకి పురంగా’ మార్చడం జరిగింది.

ఆలయ విశేషాలు[మార్చు]

ప్రధాన ఆలయమైన పట్టభిరామలయంలోకి ప్రవేశిస్తే వరుసగా మహామంటపం, ముఖమంటపం, అంతరాలయం, గర్భగుడి వస్తాయి. ఆలయంలో విజయనగర సామ్రజ్య, చోళ రాజ్య శిల్ప కళా చాతుర్యం తేటతెల్లం అవుతాయి. మహామంటపం పైకప్పుపై అధ పద్మం ఉంటుంది. వీరాంజనేయస్వామి విగ్రహం పశ్చిమ వైపుగా ప్రతిష్ఠించబడి ఉంటుంది.gagan

దేవతా మూర్తులు[మార్చు]

  • శ్రీరాముడు ప్రధాన దైవం స్వామికి కుడి వైపు సీత, వామ భాగంలో ధనుర్బాణ్ములతో లక్ష్మణుడు ఉంటారు. వింజామరలో భరతశత్రుఘ్నులు ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తన వ్రతాన్ని చాటుతున్నట్లు కుడి చూపుదు వేలు పైకెత్తి సూచీముఖ హస్తముద్రతో శసక ముద్రతో, సంహార ముద్రతో కనిపిస్తాడు. సాధారణంగా సీతమ్మ తల్లి స్వామికి వామ భాగంలో ఉంటుది కాని ఇక్కడ కుడివైపు ఉండడం విశేషం. సీతరామభరతశత్రుఘ్నులు ప్రత్యేక విగ్రహాలైతే ఆంజనేయస్వామి వారు ముఖ మంటపంలో ప్రత్యేక మార్తిగా ఉబ్బు శిల్పంగా ఉంటారు. జాంబవంతుడు సీతారామచంద్రులను శ్రీరామపట్టాభిషేకం సమయంలో ఈ విధంగానె దర్శనం చేసుకొన్నారని చెబుతారు.
  • శ్రీరంగనాధుడు పట్టాభిరామాలయనికి పశ్చిమ దిశలో దక్షిణముఖంగా శ్రీరంగనాధుని ఆలయం ఉంది. రంగనాధుడు శ్రీదేవి,భుదేవి సమెతుడై శయనమూర్తుడై ఉంటాడు.
  • విఠలేశ్వరుడు ఆలయానికి వెలుపల పశ్చిమముఖంగా ఉంటాదు.
  • పుష్కరిణి తూర్పు దిక్కున కొద్ది దూరంలోనే ఉంది ఇక్కడే స్వామి తెప్పోత్సవాలు జరిగేవి.

పండుగలు విశేషాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 44,725 - పురుషులు 22,513 - స్త్రీలు 22,212
అక్షరాస్యత (2001) - మొత్తం 66.67% - పురుషులు 78.40% - స్త్రీలు 54.80%

బయటి లింకులు[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానములు: [1]

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=వాయల్పాడు&oldid=2006241" నుండి వెలికితీశారు