పుల్లంపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పుల్లంపేట
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో పుల్లంపేట మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో పుల్లంపేట మండలం యొక్క స్థానము
పుల్లంపేట is located in ఆంధ్ర ప్రదేశ్
పుల్లంపేట
ఆంధ్రప్రదేశ్ పటములో పుల్లంపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°07′00″N 79°13′00″E / 14.1167°N 79.2167°E / 14.1167; 79.2167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము పుల్లంపేట
గ్రామాలు 29
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,754
 - పురుషులు 19,403
 - స్త్రీలు 19,351
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.83%
 - పురుషులు 71.72%
 - స్త్రీలు 45.96%
పిన్ కోడ్ {{{pincode}}}

పుల్లంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్ 516 107., యస్.టీ.డీ. 08565'. [1]

పేరెలా వచ్చింది- ?[మార్చు]

ఈ ఊరిలో పుల్లని నిమ్మ పండ్లు పండుతవి. అందుకనే ఈ వూరికి ఆ పేరు వచ్చిందని పెద్దలు అంటారు.

గ్రామ చరిత్ర[మార్చు]

బ్రిటిష్ వారి హయాంలో ఈ గ్రామం తాలూకా కేంద్రంగా ఉండి అన్ని కార్యకలాపాలూ ఇక్కడి నుండే జరిగేవి. ఆ కాలంలో అధికారులు ఇక్కడకు వచ్చినపుడు తుమ్మలబైలు విడిది కేంద్రంగా ఉండేది. గతంలో ఇక్కడ చేనేతలూ, ఇతర వర్గాల ధనికులూ ఉండటంతో ఈ ఊరు తాలూకాకేద్రంగా ఉండేది. అప్పట్లో ఒకసారి ఇక్కడకు వచ్చిన ఒక అధికారి గుర్రానికి గుగ్గిళ్ళు దొరకలేదని ఆగ్రహించిన ఆ అధికారి వెంటనే తాలూకా ఆఫీసును పుల్లంపెట నుండి రాజంపేటకు మార్చరని ఇక్కడి పెద్దలు చెపుతారు. 1944 లో పూలంగేరు నేడు పుల్లంగేరుగా మారటంతో ఈ గడ్డ నే ఉన్న గ్రామానికి "పుల్లంపేట" అని పేరు వచ్చినదని కొందరు అంటున్నారు. కానీ 1830ల్లో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ గ్రామంలో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని పుల్లంపేట అనే ప్రస్తావించారు. అప్పటికే ఇది అన్ని వసతులు లభించి, అన్ని వస్తువులు దొరకగల పేట గ్రామమన్నారు. కనుక 1830 నాటికే దీనికి పుల్లంపేట అనే పేరుందని చెప్పవచ్చు[2]. ఐతే ఈ మరొక కథ ప్రకారం పుల్లమ్మ అను ఒకామె తొలుత ఈ గ్రామాన్ని నిర్మించినందున ఆమె పేరు మీదుగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఆ రోజులలో సభాసంస్థ అధినేత వస్థున్నారంటే రైలు బండి గూడా గంట సేపు ఆగేదట. ఇప్పుడున్న సబ్ రిజిస్ట్ర్రార్ కార్యాలయం, తాలూకా కార్యాలయం, పోలీస్ స్టేషను వగయిరాలు అప్పటి కాలం నాటివే.ఒకప్పటి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి గారికి, ఇక్కడి చేనేత వర్గానికి చెందిన నరసింహులు మిత్రుడని గ్రామస్థుల మాట. చేనేత వర్గాల విద్యాభివృద్ధికి బ్రిటిష్ వారి సహకారంతో సభాసంస్థను ఏర్పాటు చేసి దీనికి ఉపశఖలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఈ ఊరు విద్యాభివృద్ధి చెందుతోంది. ఎందరో ప్రముఖులు ఇక్కడనే పుట్టి గొప్పవారయినారు. క్రీడలకు పుట్టినిల్లు ఈ పుల్లంపేట. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  1. పుల్లంపేటలో వెలసిన శ్రీ భద్రావతీ సమేత భావనారాయణస్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణం, ప్రతి సంవత్సరం, వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. మొదట స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపెదరు. అనంతరం అర్చకుల వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేసెదరు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించెదరు. [2]
  2. శ్రీ పర్వతవర్ధనీ శాంతిలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా, 2014,మే-31, శనివారం నాడు, ఆలయంలో అంగప్రదక్షిణ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 108 మంది భక్తులు, తడిగుడ్డలతో, 108 సార్లు ప్రదక్షిణలు చేసారు. వేదపండితులు చండీపారాయణం నిర్వహించారు. ప్రధాన పండితులు వరుణునికోసం, జలంలో జపాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమానికి మండలం నలుమూలలనుండి భక్తులు విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరిచారు. ఆదివారం నాడు ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూడవరోజుగూడా జలంలో జపం కార్యక్రమంలో చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 1108 మట్టికుండలతో ఘటాభిషేకం నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు మండలం నలుమూలలనుండి విచ్చేసారు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2014,జూన్-9, సోమవారం నుండి పది రోజులపాటు నిర్వహించెదరు. [4], [5] & [6]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 

`

[1] ఈనాడు కడప జూలై 27, 2013. 5వ పేజీ. [2] ఈనాడు కడప; 2014,మే-15; 6వ పేజీ. [3] ఈనాడు కడప; 2014,మే-25;5వపేజీ. [4] ఈనాడు కడప; 2014,జూన్-1; 15వ పేజీ. [5] ఈనాడు కడప; 2014,జూన్-2; 5వ పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=పుల్లంపేట&oldid=2244033" నుండి వెలికితీశారు