సీతారాంపేట (పుల్లంపేట)
Jump to navigation
Jump to search
సీతారాంపేట | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°07′24″N 79°12′34″E / 14.12322786089282°N 79.20946797714161°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పుల్లంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516107 |
ఎస్.టి.డి కోడ్ |
సీతారాంపేట, అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది గారాలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
విశేషాలు
[మార్చు]సీతారాంపేట గ్రామవాసులైన చేనేత కార్మిక కుటుంబానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతుల కుమార్తె పద్మావతి, క్రికెట్టులో, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించుచున్నది. 2010-11 లో హైదరాబాదులో జాతీయస్థాయిలో క్రికెట్టు ఆడుతుండగా ఈమె గాయపడింది. ఆ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఈమె తరువాత కఠోరశ్రమకోర్చి, తిరిగి, బి.సి.సి.ఐ.ఆంధ్రా జట్టులో స్థానం సంపాదించుకొని, తిరిగి, ఆటలో రాణించుచున్నది.
దేవాలయాలు
[మార్చు]- శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-16, శుక్రవారం నాడు, స్వామివారి మహా నైవేద్యాలను ఘనంగా నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
- శ్రీ నడివీధి గంగమ్మ ఆలయం:- నడివీధి గంగమ్మ పొంగళ్ళను, 2014,జూన్-5, గురువారం నాడు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.