నందలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నందలూరు
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో నందలూరు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో నందలూరు మండలం యొక్క స్థానము
నందలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
నందలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో నందలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°15′00″N 79°07′00″E / 14.2500°N 79.1167°E / 14.2500; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము నందలూరు
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,280
 - పురుషులు 19,113
 - స్త్రీలు 19,167
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.84%
 - పురుషులు 77.03%
 - స్త్రీలు 52.72%
పిన్ కోడ్ {{{pincode}}}

నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. [1]

కడప - తిరుపతి మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు చెయ్యేటి (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది. నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్ఠించాడంటారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగచోళుడు ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని పాండ్యులు, విజయనగర రాజులు, పొత్తపి పాలకులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. ఆదికవి నన్నయ ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన తాళ్ళపాక ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా చొక్కనాథుడిని సేవించాడు.

కాకతీయ ప్రతాపరుద్రుడు మన్నూరు, హస్తవరం, నందలూరు, అడపూరు, మందరం గ్రామాలను ఈ ఆలయానికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. నందలూరును నిరందనూరు, నిరంతనూరు, నిరంతాపురం, నెలందలూరు అని కూడా పిలిచేవారు. ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట మీద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.

గ్రామచరిత్ర[మార్చు]

నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు.[2].

సౌమ్యనాధ స్వామివారి ఆలయం[మార్చు]

11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వా ర్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సౌమ్యనాథున్ని చొక్కానాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగుశాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.

ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.

బ్రహ్మోత్సవాలు:- ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, 2014 లో జూలై-5 నుండి 14 వరకు నిర్వహించెదరు. ఏడవ తేదీన ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, రాత్రికి హంసవాహనం, 8వ తేదీన గ్రామోత్సవం, రాత్రికి సింహవాహనం, 9వ తేదీన పల్లకీ సేవ, రాత్రికి హనుమంతసేవ, 10వ తేదీన ఉదయం శేషవాహనం, రాత్రికి గరుడసేవ, 11వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ సౌమ్యనాధస్వామివారి కల్యాణ మహోత్సవం, 13వ తేదీ ఉదయం రథోత్సవంం రాత్రికి అశ్వవాహన సేవ, 14వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]

2.శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ప్రముఖులు[మార్చు]

ప్రముఖ సంఘ సేవకురాలు వేదాంతం కమలాదేవి ఈ గ్రామంలో జన్మించింది.[3]

నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ బౌద్ధారామం

విశేషాలు[మార్చు]

ప్రముఖ చారిత్రిక గ్రామమైన "పొత్తపి" ఈ మండలంలోనే ఉంది.

గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 38,280 - పురుషులు 19,113 - స్త్రీలు 19,167;

మూలాలు, వనరులు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
  3. కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.

[2] ఈనాడు కడప; 2014,జూన్-30; 11వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నందలూరు&oldid=2055732" నుండి వెలికితీశారు