వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరబ్రంహేంద్రస్వామి వారి మఠం[మార్చు]

బ్రహ్మంగారిమఠం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.ఆంధ్ర ప్రదేశ్ లో పేరెన్నిక గల అతి ప్రాచీన పుణ్య క్షేత్రం. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం విరచించిన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన, జగద్గురువు శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, జీవసమాధి గావించిన మహా కేష్ట్రం బ్రహ్మం గారి మఠం.కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం. కందిమల్లయ్య గ్రామంలో శ్రీమాతా గోవిందమాంబా సమేత విరాట్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠం వెలిసింది. బ్రహ్మంగారి వంశపారంపర్యలో ఏడవతరానికి చెందిన శ్రీ వీరభోగ వసంత వేంకటాఏస్స్వర స్వాముల వారు ప్రస్తుతం ఈ మఠానికి అధిపతులై ఉన్నారు. ఈ కందిమల్లయ్య గ్రామాన ఆనాడు బ్రహం గారు నివసించిన గృహము, వాడిన వస్తువులు కూడా ఉన్నాయి.

ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ దశమిన శ్రీవీరబ్రహ్మంగారి ఆరాదన జరుగుతుంది. అదేవిదంగా.... ప్రతి ఏడు మార్గశిర బహుళ నవమిన శ్రీ మాతా ఈశ్వరాంబ ఆరాధన మహోత్సవం కూడా జరుగుతుంది. బ్రహ్మంగారి మఠానికి ఐదు మైళ్ళ దూరంలో ముడుమాల గ్రామాన బ్రహ్మ్మంగారి ప్రథమ శిష్యుడైన సిద్దయ్య గారికి కూడా మఠం వెలసింది. వారి సంతతి వారు దీనిని నిర్వహిస్తుంటారు.

వర్గం "వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.