Jump to content

ఎం.డి.నఫీజుద్దీన్

వికీపీడియా నుండి

ఎం.డి.నఫీజుద్దీన్ తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. అతను 'యం.డి. సౌజన్య' కలంపేరుతో సుపరిచితుడు. ఆంధ్రపత్రిక ఎడిటర్‌ వీరాజీ 1982లో ఈ కలం పేరును ఎంపికచేశాడు. ఉత్తమ దర్శకులు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచయితగా బహుమతులు అందుకున్న ఆయన హస్య నటుడిగా, మంచి చిత్రకారులుగా గుర్తింపు పొందాడు. [1] అతను రాసిన 30కు పైగా నవలలు వివిధ వారపత్రికల్లో, నూటికి పైగా బాలల కథలు చందమామ వంటి పుస్తకాల్లో ప్రచురితమయ్యాయి. ఆయన సామాజిక అంశాలపై రాసిన రేడియా నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను గుంటూరు జిల్లా తెనాలిలో 1940 మే 25న మహమ్మద్ ఇస్మాయిల్, హజరా బీబీ దంపతులకు జన్మించాడు. అతను ఎం.ఏ (ఇంగ్లీష్‌) చదివాడు. ఎం.ఫిల్ చేసాడు. అధ్యాపకునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. ఐదు దశాబ్దాలుగా రాసిన నవలలు, నాటికలు-నాటకాల మీద రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయలలోని విద్యార్థులు పరిశోధనలు జరిపి ఎం.ఫిల్‌., పి.హెచ్‌డి పట్టాలను పొందాడు. తెనాలి వీఎస్‌అర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాల ఆంగ్ల శాఖాధిపతిగా, వైస్‌ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

అతను 1965లో "పాపం బిచ్చగత్తె" కథ ప్రచురితం అవుతుండంతో రచనా వ్యాసంగం ఆరంభించి అదే సంవత్సరం జ్ఞానోదయం, తమమసోమా జ్యోతిర్గమయ, ధర్మ సంరక్షణార్థం, దేముడూ నీకు దిక్కెవరు నాటికలు రాసి విద్యార్థుల ద్వారా అంతర ‌కళాశాలల నాటక పోటీలకు పంపి పలు బహుమతులు గెలుచుకోవడంతో విస్తృతంగా రచనలు చేయడం ఆరంభించాడు. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య, సమీక్షా వ్యాసాలు, పలు నవలలు ధారవాహికంగా ప్రచురితం అయ్యాయి. అతను ప్రత్యేకంగా రాసిన రేడియో నాటికలన్నీ ఆకాశవాణి ద్వారా ప్రసారం కావడం మాత్రమే కాక ఆయన రూపొందించిన స్టేజి నాటకాలు ఈనాటికి కూడా రాష్ట్రంలోనే కాకుండ ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు అధికంగా గల ప్రాంతాలలో ప్రదర్శించ బడుతున్నాయి.[3]

నవలలు

[మార్చు]
  1. విముక్తి
  2. విధివిన్యాసాలు
  3. కలల అలలు
  4. ఈ చరిత్ర ఎవరు రాస్తారో
  5. ఆపదలో అనురాధా
  6. జాదూ నగర్‌
  7. మృత్యు లోయ
  8. ఈ నేరం ఎవరిది?
  9. మాయా బజార్‌
  10. మృత్యువుతో ముఖాముఖి
  11. ఓ నటి కథ
  12. మరో ధారిత్రి
  13. త్రికాల్‌
  14. బలికోరిన ప్రేమ

నాటికలు

[మార్చు]
  1. జ్ఞానోదయం
  2. తమసోమా జ్యోతిర్గమయ
  3. ధర్మ సంరక్షణార్థం
  4. దేముడూ నీకు దిక్కెవరు
  5. కనకపు సింహాసనమున

రేడియో నాటికలు

[మార్చు]
  1. కోటి విద్యలు
  2. తాతయ్య పరీక్ష
  3. తనదాకా వస్తే
  4. పరిహారం
  5. ఇది దారి కాదు
  6. ఐడియాల అప్పారావు

హాస్యరస గ్రంథాలు

[మార్చు]
  1. ప్రముఖుల హస్యాలు
  2. మహనీయుల జీవితాల్లో మధుర ఘట్టాలు
  3. హాస్యవల్లరి
  4. నవరసాల తెలుగు హస్యం
  5. నవ్వుతూ బ్రతకాలిరా (2010)

విద్యార్థులకు ఉపయుక్త గ్రంథాలు

[మార్చు]
  1. వ్యాససుధ
  2. నమ్మలేని నిజాలు
  3. చరిత్ర పురుషులు, చారిత్రక ఘట్టాలు
  4. ప్రపంచ అద్బుతాలు
  5. రాబిన్‌సన్‌ క్రూసో

సాహిత్యవిమర్శనా గ్రంథాలు

[మార్చు]
  1. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ ఘట్టాలు
  2. షేక్స్‌పియర్‌ నాటకాలు, కథలు-విమర్శ
  3. విశ్వ సాహిత్యంలో విశిష్టతలు-వింతలు

ఆంగ్ల గ్రంథాలు

[మార్చు]
  1. వరల్డ్‌ ఫేమస్‌ స్టోరీస్
  2. సోషల్‌ షార్ట్‌ స్టోరీస్‌ ఫర్‌ చిల్డ్రన్

అతని కథలు, నవలలు, నాటికలు పలు ఇతర భాషలలో అనువాదమై పుస్తకాలు వెలువడ్డాయి. రేడియో నాటికలు జాతీయ స్థాయిలో ప్రసారానికి నోచుకున్నాయి.

అవార్డులు-పురస్కారాలు -బిరుదులు

[మార్చు]
  1. చక్రపాణి అవార్డు (హైదారాబాద్‌)
  2. కొలసాని-చక్రపాణి అవార్డు (చిలువూరు)
  3. జాషువా స్మారక అవార్డు (తెనాలి)
  4. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ అవార్డు (హైదారాబాద్‌)
  5. షార్జా తెలుగు అసోసియేషన్‌ అవార్డు (షార్జా)
  6. రసమయి-లిటరరీ అవార్డు(దుబాయ్‌)
  7. కొలసాని వెంకట సుబ్బయ్య అవార్డు
  8. బాలజ్యోతి అవార్డు
  9. బొల్లిముంత శిరామకృష్యయ్య అవార్డు
  10. ఠాగూర్‌ సెంటినరీ అవార్డు (గుంటూరు)
  11. హస్యచక్రవర్తి (దుబాయి)
  12. నవలా చక్రవర్తి (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు)

సాహిత్య-సాంస్కృతిక సంస్థలద్వారా పలు సన్మానాలు అందుకున్నారు.

మరణం

[మార్చు]

కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతను 2020 జూలై 23న రాత్రి తెనాలి లోని కొత్తపేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. అతనికి భార్య, కుమారుడు, ఇరువురు కుమార్తెలున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "పుట:అక్షరశిల్పులు.pdf/116 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-23.
  2. "ప్రముఖ రచయిత ఎం.డి.సౌజన్య కన్నుమూత". m.eenadu.net. Retrieved 2020-07-23.[permanent dead link]
  3. "పుట:అక్షరశిల్పులు.pdf/117 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-23.

బాహ్య లంకెలు

[మార్చు]