Jump to content

పవిత్ర

వికీపీడియా నుండి
పవిత్ర
(1986 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వినయ్
నిర్మాణం బి.ఆర్.మోహన్
కె.కె.విశ్వనాథం
కథ పి. కళైమణి
చిత్రానువాదం వినయ్
తారాగణం చంద్రమోహన్ ,
భానుప్రియ ,
రాజేంద్ర ప్రసాద్
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం శరత్
కూర్పు నందమూరి బెనర్జీ
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

పవిత్ర 1986 లో వచ్చిన సినిమా. దీనిని విజయ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బిఆర్ మోహన్, కెకె విశ్వనాథం నిర్మించారు. వినయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, భానుప్రియ నటించారు. కృష్ణ-చక్ర సంగీతం సమకూర్చాడు.[1] ఇది తమిళ చిత్రం ఇంగేయం ఒరు గంగై (1984) కి రీమేక్ [2]

పవిత్ర (భానుప్రియ) నిస్సహాయురాలు. తాగుబోతు తండ్రి నరసింహం (గొల్లపూడి మారుతీరావు), ముగ్గురు తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో కష్టాళు పడుతోంది. ఆమె కిష్టయ్య (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కాని వారు ఆమె సంబంధాన్ని ముందుకు వెళ్ళనివ్వలేరు. ఎందుకంటే పవిత్రను వివాహం చేసుకోవాలంటే నరసింహానికి ఎదురు కట్నం ఇవ్వాలి. కిష్టయ్య అందుకు అంగీకరించి డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు. పరిస్థితుల కారణంగా, పవిత్ర జీవనోపాధి అధ్వాన్నంగా మారుతుంది. కుటుంబాన్ని పోషించుకోలేకపోతుంది. పేదరికం ఆమెను కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ధనవంతుడు, వికలాంగుడు, అమాయకుడూ, సహృదయుడూ అయిన చంద్రయ్య (చంద్ర మోహన్) ను పెళ్ళి చేసుకుంటుంది. కానీ అతని సవతి తల్లి దుర్గ (అన్నపూర్ణ), గయ్యాళి సోదరి ఊర్మిళ (కె. విజయ), అతని బావమరిది గోపాలం (నూతన్ ప్రసాద్) పవిత్రపై కన్ను వేసాడు - వీళ్ళంతా పవిత్రను వేధిస్తారు. ఇంతలో, కిష్టయ్య తిరిగి వచ్చి పవిత్ర పెళ్ళి గురించి తెలుసుకుని, పిచ్చివాడైపోయి గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు.

ఒకసారి చంద్రయ్యపై కొంతమంది గూండాలు దాడి చేసినపుడు, కిష్టయ్య అతడి రక్షణకు వచ్చి తాను గాయపడతాడు. చంద్రయ్య కిష్టయ్యను తన ఇంటికి తీసుకువెళతాడు. చంద్రయ్య వాళ్ళ ప్రేమ సంగతి గ్రహించి, వారిని తిరిగి కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు గాను అతను పవిత్రను ఆమె పవిత్రతను శంకించి ఇంటి నుండి గెంటేస్తాడు. కిష్టయ్య, పవిత్ర వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు, వారు చంద్రయ్య గొప్పతనాన్ని మెచ్చుకుంటారు. కిష్టయ్య పవిత్రను తిరిగి చంద్రయ్య వద్దకు పంపుతాడు. చివరగా, పవిత్ర తన భర్తకు చేరుకోవడం, కిష్టయ్య గ్రామం నుండి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది.

భానుప్రియ

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "ఇది ఓడినా" ఎస్పీ బాలు, పి.సుశీల 3:32
2 "మనువు మనకు" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 3:45
3 "ఇత్తడి బిందే" ఎస్పీ బాలు 3:15
4 "ఒక సుక్క" మాధవపెద్ది రమేష్, ఎస్పీ శైలజ 3:43
5 "ఏదీ ఆ వెన్నెల" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 4:03

మూలాలు

[మార్చు]
  1. "Pavitra (Cast & Crew)". Telugu Cinema Prapancham.
  2. "Pavitra (Review)". The Cine Bay. Archived from the original on 2018-07-20. Retrieved 2020-08-25.
"https://te.wikipedia.org/w/index.php?title=పవిత్ర&oldid=4209106" నుండి వెలికితీశారు