లైలా (నటి)
లైలా | |
---|---|
జననం | 1980 అక్టోబరు 24 |
వృత్తి | భారతీయ చలనచిత్ర నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1996 - 2006 2022 - ప్రస్తుతం |
మతం | క్రైస్తవ మతం |
భార్య / భర్త | మెహదీన్ |
పిల్లలు | 2 |
లైలా ఒక భారతీయ సినిమా నటి. ఈమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటించింది[1].
2022 మార్చి25న ఈ టీవీలో ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా, ఆమనిలతో పాటు జడ్జ్ గా లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.[2]
సినిమా రంగం
[మార్చు]ముంబయిలో నివసిస్తున్న లైలా మాడల్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మెహమూద్ కంటిలో పడి దుష్మన్ దునియాకా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తరువాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రంలో పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించింది. ఈమెకు 2001, 2003 సంవత్సరాలలో వరుసగా ఉత్తమ తమిళనటిగా ఫిలిం పేర్ అవార్డులు లభించాయి.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె గోవాకు చెందిన క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఈమె 1980 అక్టోబర్ 24న జన్మించింది. ఈమె 2006లో ఇరానీ వ్యాపారవేత్త మెహదిన్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | వివరాలు |
---|---|---|---|---|
1996 | దుష్మన్ దునియాకా | లత | హిందీ | |
1997 | ఎగిరే పావురమా | తెలుగు | ||
ఉగాది | తెలుగు | |||
పెళ్ళి చేసుకుందాం[3] | లైలా | తెలుగు | ||
కెలొనా | ఉర్దూ | |||
ఈత ఒరు స్నేహగత | హేమ | మలయాళం | ||
1998 | ఖైదీగారు | తెలుగు | ||
పవిత్రప్రేమ | డా.శకుంతలా దేవి | తెలుగు | ||
శుభలేఖలు | తెలుగు | |||
లవ్ స్టోరీ 1999 | మీనా | తెలుగు | ||
1999 | కలంగర్ | ఆండాళ్ | తమిళం | |
ముదల్వన్ | శుభ | తమిళం | ||
నా హృదయంలో నిదురించే చెలీ | తెలుగు | |||
రోజావనం | రోజా | తమిళం | ||
2000 | పార్తెన్ రసితెన్ | సారిక | తమిళం | |
నువ్వే కావాలి | తెలుగు | అతిథి పాత్ర | ||
దేవర మగ | కన్నడ | |||
2001 | దీన | చిత్ర | తమిళం | |
దిల్ | ఆశ | తమిళం | ||
అల్లి తంద వానం | Divya | తమిళం | ||
నందా | కల్యాణి | తమిళం | ఉత్తమ తమిళనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ | |
కామరసు | వాసంతి | తమిళం | ||
మూసా ఖాన్ | ఉర్దూ | |||
2002 | ఉన్నై నినైతు | నిర్మల | తమిళం | |
మౌనం పెసియదె | తమిళం | |||
2003 | త్రీ రోజెస్ | నందూ | తమిళం | |
పితామగన్ | మంజూ | తమిళం | ఉత్తమ తమిళనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అవార్డ్ ITFA ఉత్తమ నటి అవార్డ్ | |
వార్ అండ్ లవ్ | సెరీనా | మలయాళం | ||
స్వప్నకూడు | మలయాళం | అతిథి పాత్ర | ||
2004 | గంభీరం | విజయలక్ష్మి | తమిళం | |
జయసూర్య | బేబి | తమిళం | ||
రామకృష్ణ | లక్ష్మీ విశ్వనాథ్ | కన్నడ | ||
మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి | శైలజ | తెలుగు | ||
2005 | ఉల్లమ్ కెట్కుమాయి | పూజ | తమిళం | |
కందనాళ్ మూదల్ | రమ్య | తమిళం | ||
ఇన్సాన్ | ఇందూ | హిందీ | ||
2006 | పరమ శివన్ | మలర్ | తమిళం | |
తందెగె తక్క మగ | పంచరంగి | కన్నడ | ||
తిరుపతి | తమిళం | అతిథి పాత్ర | ||
మహాసముద్రం | దేవి | మలయాళం |
మూలాలు
[మార్చు]- ↑ ఎస్., సత్యబాబు (19 February 2012). "మాఘమాసం ఎప్పుడొస్తుందో! నిన్ను చూసి ఎన్నినాళ్లో..." సాక్షి ఫన్‌డే. Retrieved 19 March 2017.[permanent dead link]
- ↑ Namasthe Telangana (13 November 2022). "గ్రాండ్ రీఎంట్రీ.. పండుగ చేసుకుంటున్న పాతతరం అభిమానులు". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లైలా పేజీ