తాతమ్మకల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాతమ్మకల
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి,
మాష్టర్ నందమూరి బాలకృష్ణ
రాజబాబు
చలపతిరావు
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ రామకృష్ణ ఆర్ట్స్
విడుదల తేదీ ఆగస్టు 29, 1974
భాష తెలుగు

తాతమ్మకల నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1974, ఆగస్టు 30న విడుదలైన కళాకండం.[1] ఈ చిత్రం ఆనాటి పల్లేటూరి అమాయకత్వానికి పట్టణం పొకడకి మధ్య గల తేడాను చూపిన చిత్రం. నందమూరి బాలకృష్ణ మొదటి సినిమా బాల నటుడిగా.

నటీనటులు

[మార్చు]

రావమ్మ (భానుమతి) ఊరి కోసం ఎదేనా చేయ్యలి అని తాపత్రయం పడుతుంది. కొడుకు కొడలు చనిపొతారు వారికి పుట్టిన బిడ్డను రావమ్మ మనుమడు (నందమూరి తారక రామారావు) ను పెంచి పెద్దచేస్తుంది. పెళ్ళి చేస్తుంది మనుమడికి ఐదుగురు సంతానం కుటుంబ కర్చులు పెరగడంతొ కొంత భూమిని అమ్మి అప్పులు తీరుస్తాడు. డబ్బు సంపాదన కోసం అని పట్నం చేరతాడు. ఒక వ్యాపారిని కాపాడి అతని వద్ద గుమస్తాగా పనికి కుదురుతాడూ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. ఇక్కడ దర్శకుడు ఆ రోజులలో గల ఒక ఐదు సమస్యలను కథలోకి చొప్పించారు.

  1. బార్య మాట విని తల్లితండ్రులను వదిలి వెళ్ళి పొతాడు.
  2. మంచిబుద్ధి కలవాడు కాని చెడు స్నేహల కారణంగా వ్యసనపరుడిగా మారుతాడు. నందమూరి హరికృష్ణ
  3. వ్యసన పరుడు దొంగ అన్ని అవలక్షణములు కలవాడు.
  4. అమయకురాలు పట్నంలో కాలేజి విద్యార్దుల వల్ల మొసగింప్పబడి ఆత్మహ్యత్య చేసుకుంటుంది.
  5. మనవడి ఆకరి కొడుకు మంచి నాయకత్వ లక్షణాలు కలిగినవాడు తాతమ్మ కల తీరుస్తాడు. నందమూరి బాలకృష్ణ

ఉరి పెద్దలు వ్యతిరేకిస్తున్న యువకులతొ కలసి నీటి వసతి లేని ఆ గ్రామానికి రిగ్గింగుతో బొరు బావిని వేసి అత్యంత అదునిక పద్ధతిలో వ్యవసాయం చెసి నేలలో బంగారం పండిస్తాడు. రాష్ట్రపతి బహుమతి సాదించి ఆ ఊరికి మంచి పేరు తిసుకువస్తాడు.

థీమ్స్, ప్రభావాలు

[మార్చు]

సినిమా తీసేనాటికి కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముద్దు, ఆపై వద్దు అంటూ సాగుతున్న ఈ ప్రచారానికి వ్యతిరేకమైన సందేశంతో ఈ సినిమాను తీశారు.[2][3]

పంపిణి దారులు

[మార్చు]
  1. విజయ పిక్చర్స్
  2. జయలక్ష్మి పిక్చర్స్
  3. శ్రీ నేషనల్ అర్ట్ పిక్చర్స్

పాటలు

[మార్చు]
  1. తారురోడ్లపై గింజలు పండవురా ఓరయ్యా కబుర్లతో కడుపులు - ఎం. రమేష్ బృందం
  2. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్య - పి. భానుమతి - రచన: కొసరాజు
  3. ఇదా నా దేశం ఇదేనా నా దేశం - పి.సుశీల - రచన: డా. సినారె
  4. ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు - పి. భానుమతి - రచన: కొసరాజు
  5. ఏ మనిషి ఏహే మనిషి మరచిపో నువ్వు ఒక మనిషి - ఎస్.పి. బాలు బృందం - రచన: డా.సినారె
  6. ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  7. కోరమీసం కుర్రాడా .. చూడ కళ్ళు చాలవయ్య - పి.భానుమతి, ఘంటసాల - రచన: కొసరాజు
  8. నీకెందుకు ఈ తొందర సుందర తారా నీముందే నేనున్నానురా - పి.సుశీల, తిలకం బృందం
  9. పాండవులు పాండవులు - కోవెల శాంత, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
  10. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా ఆడే నీవాలకం పసిగట్టేనే - ఘంటసాల - రచన: కొసరాజు
  11. సై అన్నానురా మనసై అన్నానురా నీవని నావాడివి నీవేనని - పి. సుశీల

ఇతర లంకెలు

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. సరసభారతి ఉయ్యూరు. "తాతమ్మ కలకు యాభై ఏళ్ళు". sarasabharati-vuyyuru.com. Retrieved 28 August 2017.
  2. ఆంధ్రజ్యోతి. "అసెంబ్లీలో దుమారం రేపిన ఎన్టీఆర్ 'తాతమ్మకల'". Archived from the original on 27 అక్టోబరు 2016. Retrieved 28 August 2017.
  3. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 August 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
"https://te.wikipedia.org/w/index.php?title=తాతమ్మకల&oldid=3848302" నుండి వెలికితీశారు