అన్నదమ్ముల అనుబంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నదమ్ముల అనుబంధం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం యస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
మురళీమోహన్,
నందమూరి బాలకృష్ణ,
చలపతిరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ గజలక్ష్మి చిత్ర
విడుదల తేదీ జులై 4, 1975
భాష తెలుగు

ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో అత్యంత ప్రజాధరణ కలిగిన చిత్రంగా గుర్తింప బడిన 'యాదోంకి బారాత్' (నాజిర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోర, తారిక్ అన్నదమ్ములుగా నటించారు) ను తెలుగులో పునర్మించారు.[1]

నటీనటులు[మార్చు]

చిత్రకథ[మార్చు]

ఎన్.టి.ఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములు. ఆర్టిస్టు ఐన తండ్రిని, తల్లిని వీరి చిన్నప్పుడే విలన్లు చంపేస్తారు. ముగ్గురు పిల్లలూ తప్పిపోయి వేరు వేరు చోట్ల పెరుగుతారు. వారికి తల్లి చిన్నప్పుడు పాడిన 'ఆనాటి హృదయాల ఆనందగీతం" పాట గుర్తు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్.టి.ఆర్ , తప్పనిసరై నేరస్తుడౌతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తుంటాడు. మూడొ అతను బాలకృష్ణ సింగరు. ముగ్గురూ ఒకే హోటల్లో తారసిల్లుతారు కానీ గుర్తుపట్టుకోరు. వారి కలయిక మిగతా చిత్ర కథ.

చిత్ర విశేషాలు[మార్చు]

  • హిందీ లో మ్యూజికల్ హిట్ ఐనట్టె తెలుగులోకూడా అదేబాణీలోసాగి పాటలన్నీ హిట్ అయ్యాయి.
  • ఆనాటి హృదయాల ఆనందగీతం, కౌగిలిలో ఉయ్యాల, గులబిపూవై నవ్వాలి, అందమైన పిల్ల ఒకటి మొదలైనవి).
  • బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్ తో నటించారు.
  • (జయమాలిని నీతూ సింగ్ పాత్ర ధరించారు).
  • మురళీమోహన్ కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది.
  • ఈ చిత్ర ప్రత్యేకత -ఎన్.టి.ఆర్ కు ఒక్క పాట కూడా లేకపోవటం

(హిందీ లో కూడా ధర్మెంద్ర కు పాట లేదు).

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఈనాటి నయనాల విరిసే వసంతం ఇదేలే ఆపాట అధరాలపైన పలికేను ఏనాటికైనా సి.నారాయణరెడ్డి చక్రవర్తి పి.సుశీల బృందం
కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా దాశరథి చక్రవర్తి పి.సుశీల, బాలసుబ్రహ్మణ్యం, బృందం
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది సందెవేళ మల్లెపూలు తెమ్మన్నది దాశరథి చక్రవర్తి పి.సుశీల, బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బృందం
గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే దాశరథి చక్రవర్తి పి.సుశీల, బాలసుబ్రహ్మణ్యం
ఆనాడు తొలిసారి నినుచూసి మురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను దాశరథి చక్రవర్తి పి.సుశీల, బాలసుబ్రహ్మణ్యం
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఈనాటి నయనాల విరిసే వసంతం ఇదేలే ఆపాట అధరాలపైన పలికేను ఏనాటికైనా సి.నారాయణరెడ్డి చక్రవర్తి రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి. "నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'అన్నదమ్ముల అనుబంధం'". Retrieved 3 July 2017.[permanent dead link]