జూలై 4
స్వరూపం
(జులై 4 నుండి దారిమార్పు చెందింది)
జూలై 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 185వ రోజు (లీపు సంవత్సరములో 186వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 180 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండుసార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.
- 1946: ఫిలిప్పైన్స్కు అమెరికా నుండి స్వతంత్రం.
- 1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.
- 1976: పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.
జననాలు
[మార్చు]- 1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ.1866)
- 1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (మ.1882)
- 1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (మ.1950)
- 1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924)
- 1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)
- 1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970)
- 1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
- 1921: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
- 1927: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)
- 1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)
- 1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.
- 1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)
- 1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.
- 1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017)
- 1954: మంజుల , భారతీయ సినీనటి (మ.2013)
- 1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
- 1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.
మరణాలు
[మార్చు]- 1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)
- 1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863)
- 1910: జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు.
- 1934: మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)
- 1936: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (జ.1856)
- 1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)
- 1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
- 1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (జ.1892)
- 1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.
- 2011: వి.ఆర్.ప్రతాప్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
- 2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ సహకార దినోత్సవం (జూలై మొదటి శనివారం)
- యు. ఎస్ . ఎ . స్వాతంత్ర దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు :జూలై 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 3 - జూలై 5 - జూన్ 4 - ఆగష్టు 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |