Jump to content

మే 21

వికీపీడియా నుండి

మే 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 141వ రోజు (లీపు సంవత్సరములో 142వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 224 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 0143: అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిపురాతనమైన సంవత్సరం. ఈ రోజున 'మాయా నాగరికత' కన్నా ముందు పాలించిన రాజు 'కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్' సింహాసనం ఎక్కిన సంవత్సరం.
  • 1502: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.
  • 1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.
  • 1829: సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.
  • 1851: దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేసారు.
  • 1871: యూరప్లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు).
  • 1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు.
  • 1894: ఇంగ్లాండ్లో 'మాంచెస్టర్ షిప్ కెనాల్' ని విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి, ఆ కాలువను డిజైన్ చేసిన 'సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్' కి 'నైట్‌హుడ్' బిరుదు ఇచ్చింది.
  • 1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.
  • 1916: 'సమ్మర్ టైమ్' (డేలైట్ సేవింగ్ టైమ్) ని బ్రిటన్ అమలులో పెట్టింది.
  • 1929: మొట్ట మొదటి సారి, న్యూయార్క్ లోని 'స్టాక్ ఎక్స్‌చేంజి' లో 'ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్' ఏర్పాటు చేసారు.
  • 1934: తన మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించిన మొట్టమొదటి అమెరికన్ మునిసిపాలిటి 'ఒస్కాలూసా (అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉంది).
  • 1937: ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
  • 1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).
  • 1958: బ్రిస్టల్ ప్రాంతంలో 'సబ్‌స్క్రైబర్ డయలింగ్ సిస్టం (ఎస్.టి.డి)' ని 1958 డిసెంబరు నుంచి ప్రవేశపెడుతున్నట్లు, యునైటెడ్ కింగ్‍డం పోస్ట్ మాస్టర్ జనరల్ ఎర్నెస్ట్ మార్‌ప్లెస్ ప్రకటించాడు.
  • 1990: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్గా కలిసి పోవటానికి రెండు దేశాలు 'డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్', 'నార్త్ యెమెన్' లు అంగీకరించాయి.
  • 1990: డౌ జోన్స్ (అమెరికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ - మన నిఫ్టీ, సెన్సెక్స్ లాగ) 2844.68 స్థాయిని తాకింది.
  • 1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.
  • 1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది.
  • 1996: టాంజానియాకి దగ్గరలో ఉన్న విక్టోరియా సరస్సు లోఎమ్.వి. బుకొబ ములిగి పోయింది. 1000 మంది మరణించారు.
  • 2003: ఉత్తర అల్జీరయాలో భూకంపం వచ్చి 2000 మందికి పైగా ప్రజలు మరణించారు.
  • 2007: కడప జిల్లాలో కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది
  • 2009: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.

జననాలు

[మార్చు]
  • 0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)
  • 1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)
  • 1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
  • 1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.
  • 1960: మోహన్ లాల్, మలయాళ చిత్రరంగంలో అగ్రఘన్యుడు, భారతీయ సినీ నటుడు.
  • 1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015)
  • 1975: అబ్బాస్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు.
  • 1976; అతిథి గోవి త్రికర్, నటి, మోడల్, ప్రపంచ సుందరి
  • 1983: కావేరి ఝా, తెలుగు, హిందీ చిత్రాల నటి, మోడల్ .
  • 1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు

మరణాలు

[మార్చు]
Rajiv Gandhi (1987)
  • 1786: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)
  • 1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)
  • 1975: జీ.అశ్వద్ధామ, సంగీత దర్శకుడు (జ.1927)
  • 1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)
  • 1998: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1925)
  • 1998: త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు, తొలితరం గాయకుడు (జ.1914).
  • 2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925)
  • 2023: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (జ. 1954)

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]
  • చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).
  • సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)
  • ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)
  • జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.
  • ప్రపంచ టీ దినోత్సవం

బయటి లింకులు

[మార్చు]

మే 20 - మే 22 - ఏప్రిల్ 21 - జూన్ 21 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_21&oldid=4309010" నుండి వెలికితీశారు