Jump to content

సికిందర్ జా

వికీపీడియా నుండి
సికిందర్ జా, నిజాం III - سکندر جاہ ، نظام سوم
హైదరాబాద్ స్టేట్ యొక్క III వ నిజాం
పరిపాలన18031829
జననం11 నవంబర్ , 1768
జన్మస్థలంచౌ మహల్లా భవనం (ఖిల్వత్)
మరణం21 మే, 1829
మరణస్థలంహైదరాబాదు
సమాధిమక్కా మసీదు
ఇంతకు ముందున్నవారుఆలీ ఖాన్ అసఫ్ జా II
తరువాతి వారుమీర్ ఫర్క్వున్‌దా ఆలీ ఖాన్
సంతానము8 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు
రాజకుటుంబముపురానా హవేలీ
తండ్రిఆలీ ఖాన్ అసఫ్ జా
తల్లితహ్నియత్ ఉన్నీసా బేగమ్

సికిందర్ జా - (ఉర్దూ - سکندر جاہ نظام سوم ) (జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాంగా హైదరాబాదును 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.

ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.

ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.[1]

సా.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలంను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడింది. సా.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.

సా.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన హెన్రీ రస్సెల్ శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళమును తయారుచేశాడు. ఈ దళమే తరువాతి కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం సా.శ. 1817లో జరిగిన పిండారీ యుద్ధం లోనూ, సా.శ. 1818 లో జరిగిన మహారాష్ట్ర యుద్ధం లోనూ పాల్గొన్నది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Asaf Jahis. "Asaf Jahis". www.ap.gov.in. Retrieved 21 March 2021.[permanent dead link]