ఫిబ్రవరి 18
స్వరూపం
ఫిబ్రవరి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 49వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 316 రోజులు (లీపు సంవత్సరములో 317 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
- 1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
- 2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్సభ ఆమోదించింది.
జననాలు
[మార్చు]- 1486: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
- 1745: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
- 1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
- 1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్.
- 1966: సజిద్ నడియాద్వాల, భారతీయ చలన చిత్ర నిర్మాత.
- 1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు.
- 1996: అనుపమ పరమేశ్వరన్ భారతీయ నటి. శతమానం భవతి ఫేమ్
మరణాలు
[మార్చు]- 1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475)
- 1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
- 1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
- 1995: మిలన్ గుప్తా, భారతీయ హార్మోనికా వాద్యకారుడు. (జ.1930))
- 2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
- 2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)
- 2020: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.
- 2023: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (జ. 1983)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-23 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 18
ఫిబ్రవరి 17 - ఫిబ్రవరి 19 - జనవరి 18 - మార్చి 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |