గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపీకృష్ణ
జననంఆగష్టు 22, 1933
కలకత్తా, బ్రిటిష్ ఇండియా
మరణం1994 ఫిబ్రవరి 18(1994-02-18) (వయసు 60)
వృత్తినృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు
బిరుదునటరాజు, నృత్య సామ్రాట్

గోపీకృష్ణ (ఆగష్టు 22, 1933ఫిబ్రవరి 18, 1994) భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

గోపీకృష్ణ కథక్ నృత్య కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తాతగారు పండిట్ సుఖ్‌దేవ్ మహారాజ్ కథక్ నృత్య గురువు, ఆమె పినతల్లి సితార దేవి కూడా కథ నృత్య కళాకారిణి. ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చింది. గోపీకృష్ణ తన 11 యేండ్ల ప్రాయంలో తన తాతగారి వద్ద నృత్యం నేర్చుకొనుట ప్రారంభించారు. "శంభు మహరాజ్" అనే గురువు వద్ద కూడా నృత్య కళను అభ్యసించారు. గోపీకృష్ణ కథక్ నృత్యంతో పాటు భరతనాట్యం నృత్యాన్ని మహాలింగం పిళ్ళై మరియూ గోవిందరాజ్ పిళ్ళై ల వద్ద నేర్చుకున్నారు.[1] ఆయన దీర్ఘకాలిక ఆస్మా వ్యాధితో బాధపడుతున్నప్పటికీ తన నాట్య కచేరీలను విస్తరించారు.[2] ఆయన తన 15 సంవత్సరాల వయస్సులో ఆల్ బెంగాల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ వద్ద "నటరాజు" బిరుదుతో సత్కరింపబడ్డారు[1]

1992 లో తన 17 సంతత్సరాల ప్రాయంలో బాలీవుడ్లో ప్రవేశించి అతి పిన్న వయస్కుడైన నృత్య దర్శకునిగా "సఖి" చిత్రంలో 'మధుబాల" కు నృత్య సహకారం అందించారు[2] 1955 లో "జనక్ జనక్ పాయల్ బాజే" చిత్రంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించారు. ఆ చిత్రంలో ఆయన గిరిధర్ పాత్రలో చాలా ప్రతిభావంతుడైన నర్తకునిగా నటించారు. ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడి క్లాసికల్ నృత్యం ప్రజాదరణ పొందడానికి తోడ్పడింది[1]. ఆయన "దస్తాన్" (1972), "మెహ్‌బూబా", "ఉమ్రఓ జాన్", "ద పెర్‌ఫెక్ట్ మర్డర్" వంటి చిత్రాలకు నృత్య దర్శకత్వం చేశారు.[3] 1960, 1970 లలో ఆయన భారత దేశ సరిహద్దు ప్రాంతాలలో "సునీల్ దత్" అజంతా ఆర్ట్స్ ట్రూప్ తో వెళ్ళి సైనికులకు వినోదం కల్పించారు.[2] ఆ తర్వాత ఆయన నటేశ్వర్ భవన్ డాన్స్ అకాడమీ, నటేశ్వర్ కళా మందిర్ లను ప్రారంభించారు.[2] 1975 లో భారత ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారమైన "పద్మశ్రీ"ను అందజేసింది. ఆయన నిరంతరయంగా 9 గంటల 20 నిముషాలు కథక్ నృత్యం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.[2][4]

మరణం

[మార్చు]

1994 ఫిబ్రవరి 18 న బొంబాయి లోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.[2][5]

శైలి

[మార్చు]

గోపీకృష్ణ కథక్ నృత్యం లోని బెనారస్ ఘరానా శైలి లోని నిష్ణాతులు.[1] ఆయన కథాకళి నృత్యంలో అనేక అంశాలను ప్రవేశపెట్టారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గోపీకృష్ణ 1954 లో కథ నృత్యకళాకారిణి అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు.[2] 1981 లో ఆ దంపతులకు "షంపా సోథాలియా" అనే కుమార్తె జన్మించింది. ఆమె కూడా నృత్య దర్శకురాలిగా కీర్తింపబడ్డారు. ఆమె "ఝలక్ కిఖాలా జా" యొక్క ఐదవ సీజన్ లో విజేతగా నిలిచారు. ఆమె ఇందులో "గుమీత్ చౌదరి" అనే నటునితో ప్రదర్శననిచ్చారు.[6]

తెలుగు సినీ రంగంలో సేవలు

[మార్చు]

గోపీకృష్ణ సేవలు తెలుగు చిత్రసీమ కూడా వినియోగించుకొని తనను తాను గౌరవించుకున్నది. ముఖ్యంగా భక్త జయదేవ చిత్రంలో రాధా కృష్ణుల నాట్య ఘట్టంలో కృష్ణునిగా గోపీ నటించి, అలనాటి ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భూకైలాస్ చిత్రంలో నృత్యం చేసి నభూతో నభవిష్యతి అనిపించాడు. కె.విశ్వనాథ్ చిత్రీకరించిన సాగర సంగమం చిత్రంలోని "నాదవినోదమం నాట్య విలాసం..." అనే పాటకు నృత్యకర్త గోపీ. "నాచే మయూరి" హీరోయిన్ సుధా చంద్రన్కు నాట్య శిక్షణను నేర్పి అమోఘంగా తీర్చిదిద్ది, ఆ చిత్ర విజయానికి ప్రధానకారకుడయ్యాడు. స్వర్ణకమలం సినిమాలో ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళు పాటకు అమరత్వం కల్పించారు. బొంబాయి లోని ఖార్ లో మరణించిన గోపీ ఈ తరం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

800 చిత్రాలకు పైగా నాట్య ప్రయోక్తగా ఘన కీర్తినార్జించిన గోపీ సినిమా బాటలో అడుగిడక పోతే భారతీయ కళ, అందునా కథక్ నృత్యాన్ని ఎంతటి సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళగలిగేవారో కదా! అని భావించటం కద్దు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Banerji, Projesh (1986). Dance in thumri. Abhinav Publications. p. 91. ISBN 81-7017-212-8.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Film industry has lost its Kohinoor". Times of India. 18 February 1994. Archived from the original on 22 మార్చి 2012. Retrieved 15 జనవరి 2014.
  3. Long, Robert Emmet (1991). The films of Merchant Ivory. H.N. Abrams. p. 262. ISBN 0-8109-3618-6.
  4. Limca Book of Records. Bisleri Beverages Ltd. 2001.
  5. "Obituaries". Sruti (112). 1994.
  6. Aastha Atray Banan (4 June 2011). "Goodbye Sheila, Munni and the deadly jhatkas". Tehelka Magazine. 8 (22). Archived from the original on 24 ఆగస్టు 2011. Retrieved 25 July 2011.

7. ^ Biography of the Gopi Krishna Archived 2013-04-11 at Archive.today.

ఇతర లింకులు

[మార్చు]