Jump to content

టి.కె.మహాలింగం పిళ్ళై

వికీపీడియా నుండి
టి.కె.మహాలింగం పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
జననం(1917-11-01)1917 నవంబరు 1
తిరువిదైమరుదూర్ , బ్రిటీషు ఇండియా
మరణం2002 డిసెంబరు 6(2002-12-06) (వయసు 85)
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం గురువు

తిరువిదైమరుదూర్ కె.మహాలింగం భరతనాట్య గురువు.

విశేషాలు

[మార్చు]

ఇతడు నట్టువనార్ (నాట్యాచార్యుల) కుటుంబానికి చెందిన వాడు. ఇతని వంశీకులు ఇతనికి పూర్వం నాలుగు తరాలుగా తంజావూర్ జిల్లా, తిరువిదైమరుదూర్ పట్టణానికి చెందిన నాట్యాచార్యులు. ఇతడు 1917, నవంబర్ 1వ తేదీన టి.పి.కుప్పయ్య పిళ్ళైకు పెద్ద కుమారునిగా జన్మించాడు. ఇతడు నృత్యం, సంగీతంతో పాటు సంస్కృతం, తెలుగు, తమిళ భాషలు అభ్యసించాడు.[1]

ఇతడు చిన్నవయసులోనే నట్టువాంగంలోనికి ప్రవేశించాడు. ఆలయాలలో, వివాహం మొదలైన సందర్భాలలో నాట్యప్రదర్శలకు నట్టువాంగం సలిపినాడు. ఏడు సంవత్సరాల వయసులోనే తంజావూరులోని కొంకణీశ్వర దేవాలయంలో "పరివట్టము"తో సత్కరించబడ్డాడు. ఇతడు నాట్యాచార్యునిగా తిరువిదైమరుదూరులోను, మద్రాసులోను కొత్త తరం నాట్యకారులకు శిక్షణ ఇచ్చాడు. ఇతని మొదటి శిష్యులలో ట్రావెంకోర్ సిస్టర్స్ - లలిత, పద్మిని, రాగిణి ఉన్నారు.

ఇతడు బొంబాయిలో స్థిరపడి అనేక మంది తమిళులకు, మహారాష్ట్రులకు, గుజరాతీలకు, పంజాబీలకు భరతనాట్యం నేర్పించాడు. ఇతని వద్ద నాట్యం నేర్చుకున్న వారిలో కామినీ కౌశల్, నళినీ జయవంత్, వహీదా రెహమాన్, గోపీకృష్ణ, సితారా దేవి, దమయంతీ జోషి, రోషన్ కుమారి మొదలైన వారున్నారు.

1985లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి భరత నాట్యంలో అవార్డును ప్రదానం చేసింది.

ఇతడు 2002, డిసెంబర్ 6వ తేదీన మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. web master. "T.K. Mahalingam Pillai". SRUTI MAGAZINE. THE SRUTI FOUNDATION. Retrieved 14 April 2021.