కిషోరి బల్లాళ్
కిషోరి బల్లాళ్ | |
---|---|
జననం | కిషోరి బల్లాళ్ |
మరణం | 2020 ఫిబ్రవరి 18 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1960–2020 |
జీవిత భాగస్వామి | ఎన్. శ్రీపతి బల్లాళ్ |
కిషోరి బల్లాళ్ (మ. ఫిబ్రవరి 18, 2020) కన్నడ, హిందీ చలనచిత్ర నటి.[1] 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష బామ్మగా నటించింది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]కిషోరి బల్లాళ్ కర్నాటక రాష్ట్రంలో జన్మించింది. ఎన్. శ్రీపతి బల్లాళ్ తో కిషోరి బల్లాళ్ వివాహం జరిగింది.
సినిమారంగం
[మార్చు]కిషోరి బల్లాళ్ తన 15 ఏళ్ళ వయసులో 1960లో ఇవలెంత హెందాతీ అనే కన్నడ చిత్రంలో బాలనటిగా సినిమారంగంలోకి ప్రవేశించింది.[3] దాదాపు 72 చిత్రాలలో నటించిన కిషోరి బల్లాళ్ సినిమారంగంలో పేరొందిన దర్శకులు, నటులతో కలిసి పనిచేసింది.[4] కన్నడ చిత్రాలలోపాటు హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె, షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో కేర్ టేకర్ కావేరీ అమ్మ పాత్రలను పోషించింది.[1] 2016లో మహావీర మాచిదేవా, ఆశ్రా చిత్రాలలో నటించింది. కన్నడ టెలివిజన్ రంగంలో మంచి ఆదరణ పొందిన అమృతవర్షిణి ధారావాహికలో ప్రధానపాత్రలో నటించింది.[5]
నటించిన చిత్రాలు
[మార్చు]- 2016 - కహి (అజ్జీ)
- 2016 - ఆశ్రా (రెండవ బిల్లింగ్) [6]
- 2016 - నాని (కిషోరి బాల్లాళ్)
- 2015 - రింగ్ రోడ్ (నానమ్మ)
- 2015 - క్యారీ ఆన్ మరాఠా (కిషోరి బాల్లాళ్)
- 2015 - బాంబే మిట్టై (కిషోరి బాల్లాళ్) ) [7]
- 2014 - ఆక్రమణ
- 2013 - గలాటే (కిషోరి బాల్లాళ్)
- 2012 - అయ్యా (సూర్య తల్లి)
- 2012 - బంగార్డ కురల్[8]
- 2011 - కెంపేగౌడ (కావ్య అమ్మమ్మ)
- 2010 - లాఫంగే పరిండే
- 2009 - క్విక్ గన్ మురుగన్ (శ్రీమతి ఎస్.జి. మురుగన్)
- 2008 - అక్కా తంగి (కిషోరి బాల్లాళ్)
- 2005 - నమ్మణ్ణ (కిషోరి బాల్లాళ్)
- 2004 -స్వదేశ్ (కావేరి అమ్మగా) [9]
- 2003 - II ఖుషి (కిషోరి బాల్లాళ్)
- 2003 - ఏక్ అలగ్ మౌసం
- 2000 - స్పర్శ
- 1989 - గేర్ కానూని (కిషోరి బాల్లాళ్)
పురస్కారాలు
[మార్చు]- కెంపేగౌడ ప్రశస్తి
- కన్నడ అకాడమీ ప్రశస్తి
- ఐఫా ప్రశస్తి
మరణం
[మార్చు]కిషోరి బల్లాళ్ బెంగళూరులోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరి 18న మరణించింది.[10]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Kannada Movie Actress Kishori Ballal - Nettv4u". nettv4u.com. Archived from the original on 30 August 2017. Retrieved 23 February 2020.
- ↑ 10టీవి, సినిమా (19 February 2020). "స్వదేశీ 'కావేరి అమ్మ' కన్నుమూత". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ సాక్షి, సినిమా (19 February 2020). "సీనియర్ కన్నడ నటి మృతి". Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా (19 February 2020). "అనారోగ్యంతో సీనియర్ నటి మృతి". www.ntnews.com. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
- ↑ "Amruthavarshini: 5 years and counting - Times of India". indiatimes.com. Retrieved 23 February 2020.
- ↑ "Aasra Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Retrieved 23 February 2020.
- ↑ "Disha Pandey finishes shooting for Bombay Mittai - Times of India". indiatimes.com. Retrieved 23 February 2020.
- ↑ "Mangalore: Ram Shetty's 'Bangarda Kural' Ready to Bloom". daijiworld.com. Retrieved 23 February 2020.
- ↑ Elley, Derek (18 December 2004). "Review: 'Swades: We, the People'". variety.com. Retrieved 23 February 2020.
- ↑ The Times of India, Entertainment (18 February 2020). "Veteran Kannada actress Kishori Ballal passes away". Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.