సెప్టెంబర్ 30
స్వరూపం
సెప్టెంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1667 - గోల్కొండ ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.
- 1947: పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి.
- 1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
- 1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
- 1993: మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు.
- 2001 - మధ్యప్రదేశ్, మెయిన్పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు.
- 2007 - మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.
- 2008: రాజస్థాన్ లోని జోధ్పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
- 2010: అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది.
- 2012: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
- 2020: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది
జననాలు
[మార్చు]- 1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273)
- 1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895)
- 1864 - స్వామి అకందానంద, స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 )
- 1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
- 1900: ఎం. సి. చగ్లా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (మ. 1981 )
- 1913: ఆర్. రామనాథన్ చెట్టియార్, తమిళనాడు రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త (మ. 1995 )
- 1922: హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006)
- 1934: అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015)
- 1941: కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్
- 1951: రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి.
- 1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1966 - శంకర్ బాలసుబ్రమణియన్, భారతీయ-బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త
- 1967: దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత .
- 1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
- 1970:దీపా మాలిక్, భారత క్రీడాకారిణి.
- 1972: శాంతను ముఖర్జీ (షాన్), పేరుగాంచిన భారత గాయకుడు.
- 1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.
- 1993: అకీరా పీటర్స్, వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారిణి.
మరణాలు
[మార్చు]- 1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
- 1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954).
- 2001: మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945).
- 2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923).
- 2014: మౌల్వి ఇఫ్తిఖర్ హుస్సేన్ అన్సారీ, భారత మతగురువు, రాజకీయ నాయకుడు. (జ.1940).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ అనువాద దినోత్సవం.
- అంతర్జాతీయ పొడ్కాస్ట్ (వలపఱపం/వలప్రసారం) దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2009-10-01 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
- https://www.tribuneindia.com/news/lifestyle/time-to-listen-436796
- https://youthistaan.com/from-aurangzebs-capture-of-golconda-to-the-release-of-the-accused-of-babri-demolition-see-todays-history-here/ Archived 2022-09-30 at the Wayback Machine
- Noorani, Abdul Gafoor Abdul Majeed (1970). India's Constitution and Politics. Jaico books. Jaico Publishing House. p. 174.
సెప్టెంబర్ 29 - అక్టోబర్ 1 - ఆగష్టు 30 - అక్టోబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |