మార్టినా హింగిస్
Martina Hingis playing in 2011.jpg | ||
ప్రఖ్యాతిగాంచిన పేరు | Swiss Miss | |
దేశం | Switzerland | |
నివాసం | Trübbach, స్విట్జర్‌లాండ్ | |
పుట్టిన రోజు | 1980 సెప్టెంబరు 30 | |
జన్మ స్థలం | Košice, Slovakia then CSSR | |
ఎత్తు | 170 cm (5 ft 7 in) | |
బరువు | 59 kg (130 lb) | |
Turned Pro | 1994 | |
Retired | 2002; Comeback in 2006; again November 1, 2007 | |
Plays | Right; Two-handed backhand | |
Career Prize Money | $20,130,657 (4th in all-time rankings) | |
Singles | ||
కరియర్ రికార్డ్: | 548-133 | |
Career titles: | 43 WTA, 2 ITF | |
అత్యున్నత ర్యాంకింగ్: | No. 1 (March 31, 1997) | |
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు | ||
Australian Open | W (1997, 1998, 1999) | |
French Open | F (1997, 1999) | |
Wimbledon | W (1997) | |
U.S. Open | W (1997) | |
Doubles | ||
Career record: | 286-54 | |
Career titles: | 37 WTA, 1 ITF | |
Highest ranking: | No. 1 (June 8, 1998) | |
1980, సెప్టెంబర్ 30 న స్లోవేకియాలో జన్మించిన మార్టినా హింగిస్ (Martina Hingis) మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. 2007, నవంబర్ 1న రిటైర్ కావడానికి ముందు ఆమె 5 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ను 3 సార్లు గెల్వగా, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్ లను ఒక్కోసారి విజయం సాధించింది. డబుల్స్‌లో 8 సాల్రు విజయం సాధించగా, మిక్స్‌డ్ డబుల్స్ లో ఒక సారి టైటిల్ పొందింది. ఒక దశలో 209 వారాల పాటు ప్రపంచ నెంబర్ 1 గా ర్యాంకును నిలబెట్టుకుంది. 2007 వింబుల్డన్ సమయంలో మాదకద్రవ్యాలను సేవించినట్లు పాజిటివ్ ఫలితం రావడంతో, అస్వస్థత పొందటంతో టెన్నిస్ నుంచి రెండో సారి నిష్క్రమించింది.[1][2] ఇంతకు ముందు 2005, నవంబర్ 25న కూడా గాయాల వల్ల కొద్దికాలం టెన్నిస్ కు దూరమైంది.
బాల్యం
[మార్చు]మార్టినా చెక్ తల్లికి, హంగేరియ-స్లోవక్ తండ్రికి జన్మించింది. ఇద్దరూ టెన్నిస్ క్రీడాకారులే. మార్టినా నవ్రతిలోవా పేరు మీద తండ్రి మార్టినా అనే పేరుపెట్టాడు. తల్లి మాలిటోరొవా చెకొస్లోవేకియాలో టాప్ టెన్ ర్యాంకు సాధించింది. తండ్రి కరోల్ హింగిస్ 19 వ ర్యాంకు సాధించాడు.[3] ప్రస్తుతం ఆమె తండ్రి టెన్నిస్ శిక్షకుడు.
క్రీడా జీవితం
[మార్చు]1996లో 15 సంవత్సరాల 9 నెలల ప్రాయంలోనే హెలీనా సుకోవాతో కల్సి వింబుల్డన్ డబుల్స్ ను గెల్చి పిన్న వయస్సులో వింబుల్డన్ టైటిల్ గెల్చిన రికార్డు స్థాపించింది. 1996 లోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లోను, అమెరికన్ ఓపెన్ సెమీఫైనల్స్ లోనూ ప్రవేశించింది. 1997 హింగిస్ కు కల్సి వచ్చిన సంవత్సరం. ఆ సమయంలోనే ఆమె నెంబర్ 1 స్థానం పొందింది. ఆ సంవత్సరం ప్రారంభంలోనే సిడ్నీలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెల్చింది. కేవలం 16 సం.ల 9 నెలల ప్రాయంలోనే పైనల్స్ లో క్రితపు విజేత మేరీ పియర్స్ ఉ ఓడించి ఆ టైటిల్ గెల్చి పిన్న వయస్సులో గ్రాండ్‌స్లాం టైటిల్ గెల్చిన రికార్డు సృష్టించింది. అదే ఏడాడి మార్చి నాటికి నెంబర్ 1 స్థానం పొంది ఇందులోనూ ఈ హోదా పొందిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 1997 జూలైలో వింబుల్డన్ లో జానా నొవొత్నాను ఓడించి టైటిల్ గెల్చి 1887 తర్వార టైటిల్ గెల్చిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అమెరిక ఓపెన్ లో ఫైనల్ లో వీనస్ విలియమ్స్ను ఓడించింది. 1997 లో హింగిస్ గెల్వని ఏకైక గ్రాండ్‌స్లాం టైటిల్ ఫెంచ్ ఓపెన్ మాత్రమే. ఇందులోనూ ఫైనల్ వరకు వెళ్ళి ఇవా మజోలీ చేతిలో ఓడింది.
1998లో హింగిస్ డబుల్స్‌లో మొత్తం 4 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత వహించిన 4 వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.[4] అంతేకాకుండా సింగిల్స్ లోనూ డబుల్స్ లోనూ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న మూడో క్రీడాకారిణిగా చరిత్రలో స్థానం సంపాదించింది. కొంచిత మార్టినేజ్ పై గెల్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా విజయం సాధించింది. కాని లిండ్సే డావన్‌పోర్ట్ చేతిలో అమెరికన్ ఓపెన్ ఫైనల్ లో పరాజయం పొందింది. 1999లో హింగిస్ వరుసగా మూడో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించింది. డబుల్స్ లోనూ అన్నా కోర్నికోవాతో జతకల్సి టైటిల్ పొందింది.
గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళు
[మార్చు]విజయాలు :
సంవత్సరం | చాంపియన్‌షిప్ | ఫైనల్ లో ప్రత్యర్థి | స్కోరు |
1997 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | మేరీ పియర్స్ | 6-2, 6-2 |
1997 | వింబుల్డన్ చాంపియన్‌షిప్ | జానా నొవాత్నా | 2-6, 6-3, 6-3 |
1997 | అమెరికన్ ఓపెన్ | వీనస్ విలియమ్స్ | 6-0, 6-4 |
1998 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | కొంచితా మార్టినేజ్ | 6-3, 6-3 |
1999 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | అమెలీ మారెస్మో | 6-2, 6-3 |
మూలాలు
[మార్చు]- ↑ http://edition.cnn.com/2007/SPORT/11/01/hingis.drugs/index.html
- ↑ Associated Press. Hingis claims innocence after being accused of positive test for cocaine. ESPN.com. Retrieved on 2007-11-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-15. Retrieved 2007-12-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-18. Retrieved 2007-12-20.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1980 జననాలు
- టెన్నిస్ క్రీడాకారులు
- క్రీడాకారిణులు
- మహిళా టెన్నిస్ క్రీడాకారులు
- గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ విజేతలు
- స్విట్జర్‌లాండ్ క్రీడాకారులు
- స్విట్జర్‌లాండ్ టెన్నిస్ క్రీడాకారులు
- వింబుల్డన్ విజేతలు
- ఆస్ట్రేలియన్ ఓపెన్ (టెన్నిస్) విజేతలు
- అమెరికన్ ఓపెన్ టెన్నిస్ విజేతలు
- జీవిస్తున్న ప్రజలు
- వింబుల్డన్ క్రీడాకారులు