ఆస్ట్రేలియన్ ఓపెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా గ్రాండ్‌స్లామ్గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యు. ఎస్. ఓపెన్ మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయి. అంతే కాకుండా చక్రాల కుర్చీలవారికే పరిమితమైన వారికీ, ఆటలో దిగ్గజాల కోసం, ఎగ్జిబిషన్ ఈవెంట్లు కూడా ఉంటాయి. 1988 కి మునుపు ఈ పోటీలను పచ్చిక కోర్టులపై నిర్వహించేవారు. 1988 నుంచి మెల్‌బోర్న్ పార్కులో రెండు రకాల మైదానాలు వాడారు. 2007 వరకు రీబౌండ్ ఏస్ ఆ తరువాత ప్లెక్సికుషన్ మైదానాలు తయారు చేస్తున్నారు.[1]

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సాధారణంగా చాలా మంది క్రీడాకారులు, సందర్శకులు పాల్గొంటూ ఉంటారు. ఒక్కోసారి యూ. ఎస్. ఓపెన్ కన్నా ఎక్కువ మంది పాల్గొంటూ ఉంటారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అన్నింటికన్నా ఎక్కువమంది అతిథులు హాజరైన పోటీగా ఇది రికార్డు నెలకొల్పింది. వర్షం వచ్చినపుడూ, మరీ ఎక్కువగా ఎండగా ఉన్నపుడు పై కప్పుతో కూడిన మైదానాలు ఈ టోర్నీ ప్రత్యేకత. ఇందులో రాడ్ లీవర్ ఎరీనా, హైసెన్స్ ఎరీనా, మార్గరెట్ ఎరీనా అని మూడు కోర్టులున్నాయి. వీటికి యాంత్రికంగా పనిచేసే పైకప్పులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Paxinos, Stathi (20 November 2007). "Australian Open court surface is speeding up". The Age. Melbourne.