వీనస్ విలియమ్స్
![]() | |
దేశము | ![]() |
---|---|
నివాసము | Palm Beach Gardens, Florida |
జననం | Lynwood, California | 1980 జూన్ 17
ఎత్తు | 6 అ. 1 అం. (1.85 మీ.) |
బరువు | 72.5 kg (159.8 lbs) |
ప్రారంభం | October 31, 1994 |
ఆడే విధానం | Right-handed (two-handed backhand) |
బహుమతి సొమ్ము | $28,961,235 (2nd in overall earnings) |
Singles | |
సాధించిన రికార్డులు | 632–160 (80.3%) |
సాధించిన విజయాలు | 44 (7th in overall rankings) |
అత్యుత్తమ స్థానము | No. 1 ( February 25, 2002) |
ప్రస్తుత స్థానము | No. 38 (January 6, 2014) |
Grand Slam Singles results | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | F (2003) |
French Open | F (2002) |
వింబుల్డన్ | W (2000, 2001, 2005, 2007, 2008) |
యు.ఎస్. ఓపెన్ | W (2000, 2001) |
Other tournaments | |
Championships | W (2008) |
Olympic Games | ![]() |
Doubles | |
Career record | 166–25 |
Career titles | 21 WTA, 1 ITF |
Highest ranking | No. 1 (June 7, 2010) |
Current ranking | No. 64 (September 23, 2013) |
Grand Slam Doubles results | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2001, 2003, 2009, 2010) |
French Open | W (1999, 2010) |
వింబుల్డన్ | W (2000, 2002, 2008, 2009, 2012) |
US Open | W (1999, 2009) |
Other Doubles tournaments | |
Championships | SF (2009) |
Olympic Games | ![]() |
Mixed Doubles | |
Career record | 25–6 (80.6%) |
Career titles | 2 |
Grand Slam Mixed Doubles results | |
Australian Open | W (1998) |
French Open | W (1998) |
వింబుల్డన్ | F (2006) |
US Open | QF (1998) |
Team Competitions | |
Fed Cup | W (1999) |
Hopman Cup | RR (2013) |
Last updated on: July 20, 2013. |
Olympic medal record | |||
Women's tennis | |||
---|---|---|---|
ప్రాతినిధ్యం వహించిన దేశము the ![]() | |||
స్వర్ణము | 2000 Sydney | Singles | |
స్వర్ణము | 2000 Sydney | Doubles | |
స్వర్ణము | 2008 Beijing | Doubles | |
స్వర్ణము | 2012 London | Doubles |
అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి అయిన వీనస్ విలయమ్స్ (Venus Ebony Starr Williams) 1980, జూన్ 17న జన్మించింది. తాజాగా 2008 వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ 7 సింగిల్స్ టైటిళ్ళతో పాటు గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. రెండు ఒలింపిక్ స్వర్ణపతకాలను కూడా స్వంతం చేసుకున్న ఈ క్రీడాకారిణి మాజీ నెంబర్ 1 గా కూడా చెలామణి అయింది. అమెరికాకే చెందిన మరో అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలయమ్స్ ఈమె సోదరి.
క్రీడాజీవితం[మార్చు]
1994లో 14 సంవత్సరాల ప్రాయంలోనే వీనస్ ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది. ఆక్లాండ్ లో ఆడిన తొలి ప్రొఫెషనల్ టైటిల్ వేటలో రెండో రౌండ్‌లో ఓడిపోయినప్పటికీ ఆ టోర్నెమెంట్ టాప్‌సీడ్ క్రీడాకారిణి అరంటా సాంఛెజ్ వికారియో తో ఆడుతూ సర్వీస్ బ్రేక్ చేసి సెట్ సాధించడం విశేషం. 1995లో 3 టోర్నమెంట్లలో పాల్గొన్నప్పటికీ చెప్పుకోదగిన విజయాలు సాధించలేదు. 1996లో కూడా 5 టోర్నమెంట్లలో పాల్గొని టైటిల్ అభించలేదు.
- 1997
1997లో తొలిసారిగా గ్రాండ్‌స్లాం ఆడే భాగ్యం లభించింది. తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటులో పాల్గొని రెండో రౌండ్ వరకు వెళ్ళగలిగింది. ఆ తరువాత జరిగిన వింబుల్డన్ టోర్నమెంటులో తొలి రౌండ్ లోనే వెనుతిరిగినా సంవత్సరం చివరలో స్వంతదేశంలో జరిగిన అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో తొలిసారిగా ఆడుతూ ఏకంగా ఫైన వరకు దూసుకెళ్ళింది. మార్టినా హింగిస్ చేతిలో ఓడినప్పటికీ తొలి గ్రాండ్‌స్లాం ఫైనల్ ఆడిన అనుభవం లభించింది.
- 1998
1998లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్ ఆడగలిగింది. ఇదే సంవత్సరంలో తొలిసారిగా WTA త్రీ టయర్ టోర్నమెంటులో టైటిల్ సాధించింది.
- 1999
1999లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లో పరాజయం పొందినది. వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ఆడగలిగింది. చివరన జరిగిన అమెరిక ఓపెన్‌లో సెమీఫైనల్‌లో ఇంటిముఖం పట్టింది. ఇదే సంవత్సరంలో 3 WTA టోర్నమెంట్లలో టైటిల్ సాధించింది.
- 2000
2000లో వీనస్ విలయమ్స్ తొలిసారిగా గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోగా ఆ తరువాత జరిగిన వింబుల్డన్, అమెరికన్ ఓపెన్‌లలో టైటిల్ సాధించింది. రెండింటిలోనే ఫైనల్‌లో లిండ్సే డావన్‌ఫోర్ట్ పై విజయం సాధించింది. ఇదే ఏడాది ఒలింపిక్ క్రీడలలో కూడా టెన్నిస్ స్వర్ణం వీనస్ విలయమ్స్‌కే వరించింది.
- 2001
2001లో కూడా 2000లో సాధించినట్లు మళ్ళీ అవే రెండు గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైన వరకు వెళ్ళగలిగినా, ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది.
- 2002
2002లో వీనస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పొందగా మిగితా మూడు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో ఫైన వరకు వెళ్ళగలిగినా టైటిల్ దక్కలేదు. ఈ మూడింటిలోనే సోదరి సెరెనా విలయమ్స్ చేతిలో వరుస సెట్లలో భంగపడటం జరిగింది.
- 2003
2003లో ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు వెళ్ళగా ఆస్ట్రేలియన్, వింబుల్డన్‌లలో ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. ఈ సారి కూడా రెండింటిలోనూ సోదరి సెరెనా విలయమ్స్ చేతిలో ప్రతిఘటన చేసి ఓడిపోయింది. ఈ ఏడాది ఒక్క WTA టైటిల్ కూడా లభించలేదు.
- 2004
2004లో ఒక్క WTA టైట్ల్ మినహా చెప్పుకోదగ్గ విజయాలు లభించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 4వ రౌండ్ లో పరాజయం పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 3వ రౌండ్ లోనే నిష్క్రమించింది.
- 2005
2005లో మధ్యలో మూడేళ్ళ విరామం అనంతరం గ్రాండ్‌స్లాం టైటిల్ లభించింది. హోరాహోరీగా జరిగిన వింబుల్డన్ టైటిల్ పోరులో లిండ్సే డాబన్‌పోర్ట్ పై 4–6, 7–6(4), 9–7 స్కోరుతో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనూ, ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ లోనూ నిష్క్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైన వరకు ఆడగలిగింది. ఈ ఏడాది ఒక్క WTA టైటిల్ కూడా లభించలేదు.
- 2006
2006లో వీనస్‌కు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా, వింబుల్డన్‌లో మూడో రౌండ్ వరకు ఆడగలిగింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. WTA టోర్నమెంట్లలో సెమీఫైన దశ దాటి ముందుకు వెళ్ళలేదు.
- 2007
2007లో మళ్ళీ రెండేళ్ళ తరువాత వింబుల్డన్ టైటిల్ ను మరియన్ బార్తోలిని ఓడించి కైవసం చేసుకుంది. అమెరిక ఓపెన్‌లో సెమీస్ వరకు వెళ్ళగలిగినా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ లోనే నిష్క్రమించింది. ఈ సారి కూడా ఎలాంటి WTA టైటిళ్ళు లభించలేదు.
- 2008
2008లో మళ్ళీ వింబుల్డన్ టైటిల్ సాధించింది. ఇది ఆమెకు 5వ వింబుల్డన్ టైటిల్ కాగా మొత్తంపై 7వ గ్రాండ్‌స్లాం టైటిల్. సోదరి సెరెనా విలయమ్స్‌పై పోరాడి గ్రాండ్‌స్లాం గెలుపొందటం ఇది రెండో పర్యాయం. ఇదే ఏడాది అస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్ళగలిగింది.
సాధించిన సింగిల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళు[మార్చు]
సంవత్సరం | చాంపియన్‌షిప్ | ఫైనల్‌లో ప్రత్యర్థి | ఫైన్‌లో స్కోరు |
2000 | వింబుల్డన్ టోర్నమెంట్ | ![]() |
6–3, 7–6(3) |
2000 | అమెరిక ఓపెన్ | ![]() |
6–4, 7–5 |
2001 | వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి) | ![]() |
6–1, 3–6, 6–0 |
2001 | అమెరిక ఓపెన్ (2వ సారి) | ![]() |
6–2, 6–4 |
2005 | వింబుల్డన్ టోర్నమెంట్ (3వ సారి) | ![]() |
4–6, 7–6(4), 9–7 |
2007 | వింబుల్డన్ టోర్నమెంట్ (4వ సారి) | ![]() |
6–4, 6–1 |
2008 | వింబుల్డన్ టోర్నమెంట్ (5వ సారి) | ![]() |
7–5, 6–4 |
సాధించిన డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళు[మార్చు]
సంవత్సరం | చాంపియన్‌షిప్ | భాగస్వామి | ఫైనల్‌లో ప్రత్యర్థులు | ఫైనల్‌లో స్కోరు |
1999 | ఫ్రెంచ్ ఓపెన్ | ![]() |
![]() ![]() |
6–3, 6–7, 8–6 |
1999 | అమెరిక ఓపెన్ | ![]() |
![]() ![]() |
4–6, 6–1, 6–4 |
2000 | వింబుల్డన్ టోర్నమెంట్ | ![]() |
![]() ![]() |
6–3, 6–2 |
2001 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | ![]() |
![]() ![]() |
6–3, 4–6, 6–4 |
2002 | వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి) | ![]() |
![]() ![]() |
6–2, 7–5 |
2003 | ఆస్ట్రేలియాన్ ఓపెన్ (2వ సారి) | ![]() |
![]() ![]() |
4–6, 6–4, 6–3 |
సింగిల్స్ టైటిళ్ళ కాలరేఖ[మార్చు]
టోర్నమెంటు | 1994 | 1995 | 1996 | 1997 | 1998 | 1999 | 2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | కెరీర్ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లు | ||||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ | A | A | A | A | QF | QF | A | SF | QF | F | 3R | 4R | 1R | A | QF | 0 / 9 |
ఫ్రెంచ్ ఓపెన్ | A | A | A | 2R | QF | 4R | QF | 1R | F | 4R | QF | 3R | QF | 3R | 3R | 0 / 12 |
వింబుల్డన్ టోర్నమెంట్ | A | A | A | 1R | QF | QF | W | W | F | F | 2R | W | 3R | W | W | 5 / 12 |
అమెరిక ఓపెన్ | A | A | A | F | SF | SF | W | W | F | A | 4R | QF | A | SF | 2 / 9 | |
గ్రాండ్‌స్లాం గెలుపు-ఓటములు | 0–0 | 0–0 | 0–0 | 7–3 | 17–4 | 16–4 | 18–1 | 19–2 | 22–4 | 15–3 | 10–4 | 16–3 | 6–3 | 14–2 | 6–2 | 166–35 |
గ్రాండ్‌స్లాం గెలుపు-ఓటములు | 0 / 0 | 0 / 0 | 0 / 0 | 0 / 3 | 0 / 4 | 0 / 4 | 2 / 3 | 2 / 4 | 0 / 4 | 0 / 3 | 0 / 4 | 1 / 4 | 0 / 3 | 1 / 3 | 1 / 3 | 7 / 42 |
ఒలింపిక్ క్రీడలు | ||||||||||||||||
వేసవి ఒలింపిక్ | NH | NH | A | NH | NH | NH | W | NH | NH | NH | 3R | NH | NH | NH | 1 / 2 |
బయటి లింకులు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Articles containing English-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- 1980 జననాలు
- మహిళా టెన్నిస్ క్రీడాకారులు
- అమెరికా టెన్నిస్ క్రీడాకారులు
- గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ విజేతలు
- జీవిస్తున్న ప్రజలు
- వింబుల్డన్ క్రీడాకారులు
- వింబుల్డన్ విజేతలు