ఆక్లాండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆక్లాండ్ న్యూజీలాండ్ దేశంలోని అత్యంత జనసమ్మర్దం గల నగరం. ఓషియానియా భౌగోళిక ప్రాంతంలో ఐదవ అతిపెద్ద నగరం. జూన్ 2023 నాటికి దీని జనాభా 1,478,800. ఇది గ్రేటర్ ఆక్లాండ్ రీజియన్ ప్రాంతం కిందకి వస్తుంది. ఆక్లాండ్ చుట్టుపక్కల గ్రామాలు, హౌరాకి గల్ఫ్ దీవులు మొదలైనవి ఈ గ్రేటర్ ప్రాంతంలో భాగం. ఆక్లాండ్ కౌన్సిల్ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తుంది. జూన్ 2023 నాటికి గ్రేటర్ ప్రాంతపు జనాభా 1,739,300. ఇక్కడి జనాభాలో ఐరోపా వాసులే అధికంగా ఉన్నా 20వ శతాబ్దపు చివరలో ఇది బహుళ సాంస్కృతిక, కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. 2018 నాటికి ఆసియా వాసుల జనాభా మొత్తం జనాభాలో 31 శాతంగా ఉంది.[1] ఆక్లాండ్ జనాభాలో 39 శాతం మంది విదేశాల్లో జన్మించిన వారే.[2] విదేశాల్లో జన్మించిన జనసంఖ్య విషయంలో ఇది ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. న్యూజీలాండ్ దేశీయ భాషయైన మావోరీ భాషలో దీనిని తమాకి మకౌరౌ అంటారు. అందరూ కోరుకునే ప్రాంతం అని దీని అర్థం. ఇక్కడి సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు అలా ఉంటాయి.[3]

ఆక్లాండ్ ఇస్త్‌మస్ లో సుమారు 1350 నుంచి స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతం సారవంతమైన, సమృద్ధివంతమైన నేలకు పేరు గాంచింది. ఐరాపా వాసులు రాక మునుపు ఈ ప్రాంతంలోని మావోరి జనాభా సుమారు 20000 దాకా వెళ్ళింది.[4]

1883 లో ప్రారంభించిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ న్యూజీలాండ్ లోని అతిపెద్ద విశ్వవిద్యాలయం. జాతీయ చారిత్రక ప్రదేశాలు, పండగలు, ప్రదర్శించే కళలు, క్రీడా కార్యకలాపాలు, వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "New Zealand's population reflects growing diversity | Stats NZ". www.stats.govt.nz. Archived from the original on 11 August 2023. Retrieved 17 November 2021.
  2. Peacock, Alice (17 January 2016). "Auckland a melting pot - ranked world's fourth most cosmopolitan city". Stuff (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2022. Retrieved 31 July 2023.
  3. "About Auckland". The Auckland Plan 2050. Archived from the original on 17 January 2019. Retrieved 3 January 2019.
  4. Ferdinand von Hochstetter (1867). New Zealand. p. 243. Archived from the original on 12 January 2009. Retrieved 19 June 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్లాండ్&oldid=4032753" నుండి వెలికితీశారు