జేమ్స్ డీన్
జేమ్స్ డీన్ | |
---|---|
జననం | జేమ్స్ బైరాన్ డీన్ 1931 ఫిబ్రవరి 8 మారియన్, ఇండియానా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 1955 సెప్టెంబరు 30 చోలమే, కాలిఫోర్నియా | (వయసు 24)
మరణ కారణం | కారు ప్రమాదం |
సమాధి స్థలం | పార్క్ సిమెట్రీ, ఫెయిర్‌మౌంట్, ఇండియానా, |
విద్య | శాంటా మోనికా కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1950–1955 |
సంతకం | |
జేమ్స్ బైరాన్ డీన్ (1931 ఫిబ్రవరి 8 – 1955 సెప్టెంబరు 30) అమెరికాకు చెందిన ఒక నటుడు.[1] రెబెల్ వితౌట్ ఎ కాజ్ అనే చిత్రంలో అతని పాత్రకు మంచి పేరు వచ్చింది. అతను నటించిన ఈస్ట్ ఆఫ్ ఈడెన్, జెయింట్ అనే రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇతను మరణానంతరం అకాడమీ అవార్డు (ఆస్కార్) నామినేషన్ పొందాడు. మరణానంతరం ఈ నామినేషన్ పొందిన మొదటి వ్యక్తి ఆయన.
బాల్య జీవితం
[మార్చు]జేమ్స్ డీన్ 1931, ఫిబ్రవరి 8 నాడు మారియన్, ఇండియానా లోని సెవెన్ గబ్లేస్ అపార్ట్మెంట్ ఇంటిలో వింటన్ డీన్, మిల్డ్రెడ్ విల్సన్ కు జన్మించాడు. ఆరు స౦వత్సరాల తర్వాత, ఆ కుటు౦బ౦ కాలిఫోర్నియాకు వెళ్లి౦ది. జేమ్స్ లాస్ ఏంజిలెస్ లోని పాఠశాలకు వెళ్ళాడు. డీన్ తొమ్మిది సంవత్సరాల వయస్సులో అతని తల్లి క్యాన్సర్‌తో మరణించింది. డీన్ తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేశాడు. తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అతని తండ్రి అతనిని ఇండియానాలోని క్వేకర్ ఇంటిలో తన అత్త, మామతో కలిసి నివసించడానికి పంపించాడు. ఉన్నత పాఠశాలలో ఉండగా అతను నాటకాలు, కారు రేసింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు. అతను గ్రాడ్యుయేట్ అయిన తరువాత, అతను తన తండ్రి, సవతి తల్లితో నివసించడానికి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లాడు. అతను శాంటా మోనికా కళాశాల, యు.సి.ఎల్.ఎ.లకు హాజరయ్యాడు. కానీ పూర్తి స్థాయి నటుడుగా మారడం కోసం 1951లో కళాశాలను విడిచిపెట్టాడు.
నటనా జీవితం
[మార్చు]డీన్ తొలి టెలివిజన్ పాత్ర ఒక పెప్సి కోలా టెలివిజన్ వ్యాపార ప్రకటన. ఆస్కార్-విజేత దర్శకుడు ఎలియా కజాన్ డీన్‌కు ప్రధాన పాత్రను ఇచ్చాడు. అతను జాన్ స్టెయిన్‌బెక్ రచించిన 1952 నవలకు అనుసరణ అయిన ఈస్ట్ ఆఫ్ ఈడెన్‌లో బెంగతో బాధపడుతున్న సోదరుడు కాల్‌గా నటించాడు. అనుభవం లేని యువ నటుడిని సినిమాలో నటింపజేయడం కజాన్‌కు పెద్ద రిస్క్ అయినప్పటికీ అది ఫలించింది. ఈ పాత్ర అతన్ని రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చింది. అతనికి ఆస్కార్ నామినేషన్ సంపాదించింది. అతను నటించినవాటిలోనే అత్యధిక ప్రబలమైన రెబెల్ వితౌట్ ఎ కాస్ అనే చిత్ర శీర్షిక మాదిరిగానే అతని జీవితం ఉండేది. ఆ చిత్రంలో, లాస్ ఏంజిలెస్ కు చెందిన జిమ్ స్టార్క్ అనే ఒక మనశ్శాంతి లేని యువకుడి వేషం వేశాడు. అతను పోషించిన మరో రెండు ప్రముఖ వేషాలు: ఈస్ట్ అఫ్ ఈడెన్ చిత్రములో ఒంటరివాడి వేషం, జయంట్ చిత్రములో కోపిష్టి రైతు వేషం. డీన్ కీర్తి ఈ మూడు చిత్రాలు మీదే ఆధారపడింది.[2] 1999లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ తన అమెరికన్ ఫిల్మ్ హిస్టరీలోని గొప్ప తారల జాబితాలో 18వ స్థానంలో నిలిచాడు.[3]
మరణం
[మార్చు]1955, సెప్టెంబరు 30 న, డీన్ తన స్పోర్ట్స్ కారును రేసుకు నడుపుతున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని భౌతిక కాయాన్ని ఇండియానాలోని ఫెయిర్ మౌంట్ లో ఖననం చేశారు. చనిపోయేనాటికి అతని వయసు 24 సంవత్సరాలు.
మూలాలు
[మార్చు]- ↑ "James Dean | Biography, Movies, Death, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ Welle (www.dw.com), Deutsche. "Why the world still remembers James Dean | DW | 08.02.2021". DW.COM (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "AFI's 100 YEARS…100 STARS". American Film Institute (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.