డిసెంబర్ 23
స్వరూపం
డిసెంబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 357వ రోజు (లీపు సంవత్సరములో 358వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 8 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1912: రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది
- 1920: 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
జననాలు
[మార్చు]- 1725: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (మ.1775)
- 1881: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953)
- 1889: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967)
- 1891: వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988)
- 1902: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987)
- 1922: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012)
- 1933: శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు.
- 1936: ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత.
- 1936: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006)
- 1940: ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
- 1966: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. (మ.2012)
- 1987: ఆది: తెలుగు నటుడు, క్రికెట్ ఆటగాడు.
మరణాలు
[మార్చు]- 1987: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922)
- 1997: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913)
- 2004: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)
- 2011: త్రిపురనేని మహారధి, సినీ మాటల రచయిత (జ.1930)
- 2014: కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (జ.1930)
- 2020: బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939)
- 2022: కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ రైతు దినోత్సవం
- ఈజిప్టు విజయోత్సవ దినం. ( సూయజ్ కెనాల్ వివాదానికి తెరపడింది.)
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 22 - డిసెంబర్ 24 - నవంబర్ 23 - జనవరి 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |