Jump to content

ముదిగొండ శివప్రసాద్

వికీపీడియా నుండి
ముదిగొండ శివప్రసాద్

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ప్రముఖ రచయిత. చారిత్రక నవలా చక్రవర్తిగా పేరు [2] Archived 2020-04-11 at the Wayback Machine. వీరు జన్మించింది ప్రకాశం జిల్లా ఆకులల్లూరు. వీరి తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, మల్లికార్జునరావు. ఇతడు 1940వ సంవత్సరం డిసెంబరు 23వ తేదీన జన్మించారు.[1] ఎం.వి.ఎస్.శర్మ, రామనాథశాస్త్రి, మార్కాండేయశర్మల వద్ద విద్యాభ్యాసం గావించారు. ఎం.ఎ., పి.హెచ్.డి. చేశారు. శివప్రసాద్ రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. తండ్రి గారి ఊరు తాడికొండ. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరు భరద్వాజ ఊరు కూడా అదే. 1959లో కొంతకాలం సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూలులో టీచర్‌గా పనిచేసారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేసారు.

భావాలు,అనుభవాలు

[మార్చు]
  • పద్యం పుట్టిన చోట పునాదులు కదిలిపోతున్న ప్రక్రియకు మరో చోట ఎక్కడో నీరాజనాలు లభించడం చూస్తే ఆశ్చర్యం వేసింది. మనసు ఆర్ద్రమైపోయింది. స్వదేశంలో పద్యం అనగానే పెదవి విరిచే పరిస్థితుల్లో ఉంటే దేశం కాని దేశంలో పద్యానికి అంత స్పందన రావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కడో ఏ దేశంలోనో మన పద్యానికి ఆదరణ ఉందని తెలిస్తే గానీ, మనమేమిటో మనకు తెలిసిరాదా? ఆలోచిస్తే ఒక్కోసారి మనల్ని మనం ఎక్కడో జారవిడుచుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. మన పునాదుల్ని మనమే పాతాళంలోకి వదిలేసి ఆ తర్వాతెప్పుడో నెత్తీ నోరు కొట్టుకుంటే ఒరిగేదేమీ ఉండదు.
  • కల్పన కన్నా వాస్తవికతే ఎక్కువ బలమైనది. చారిత్రక నవల అన్నది ట్రూత్‌నే ఫిక్షన్‌గా రాసే ప్రక్రియ. చారిత్రక నవలలు చదివితే ఏమొస్తుంది? అంటూ కొందరు అడుగుతూ ఉంటారు. చారిత్రక నవలలు చదవడం అంటే వేల సంవత్సరాల నాటి కాలమాన పరిస్థితుల్లోకి మనం పయనించడమే. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే.

రచనలు

[మార్చు]

వీరు రచించిన 83 పుస్తకాల్లో 20కు పైగా చారిత్రక నవలలు ఉన్నాయి.

  • శ్రీపదార్చన
  • ఆవాహన
  • పట్టాభి
  • రెసిడెన్సీ
  • శ్రీలేఖ
  • శ్రావణి
  • వంశధార
  • తంజావూరు విజయం
  • మహాసర్గ
  • బసవగీత
  • సమ్రాట్ పుష్యమిత్ర
  • సగం విరిగిన చంద్రుడు

మూలాలు

[మార్చు]
  1. [1]Archived 2020-09-25 at the Wayback Machine | ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకులు- నాగభైరవ కోటేశ్వరరావు - జూన్ 1971- పుట 108]

బయటి లంకెలు

[మార్చు]