ఆదేశ్వరరావు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
సమకాలీన హిందీ రచయితలలో ఆచార్య పీ.ఆదేశ్వరరావు గారి స్థానం ఏంతో విశిష్టమయినది . బహుముఖ ప్రతిభాసంపంనులయిన ఆదెశ్వరావు గారు కావ్యకరునిగా, నిభందకారునిగా, సమీక్షకునిగా, అనువాదకునిగా హిందీ సాహిత్య జగతిలో ఎనలేని కీర్తి పొందెను. ఆధునిక హిందీ కవిత యొక్క అనుభూతి, వైచారిక విధానాలకు ఈయన కవితలు గొప్ప నిదర్శనం.భారతీయ సంస్కృతి, సభ్యతా, మానవజీవితంలోని విభిన్న పరిస్థితులను తన కవితల ద్వారా వ్యక్తం చేయడానికి రావ్ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిరి.
జననం
[మార్చు]ఆచార్య పి.ఆదేశ్వరరావు గారు డిశెంబర్ 23 1936లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించెను. ఈయన తల్లిగారుజ్యోతమ్మ, తండ్రిగారు వెంకటప్పయ్య ఇద్దరూ అధ్యాపకుగా పనిచేసిరి. అంతేకాక విద్యార్థులకు ఇంటివద్దనే ఆశ్రయమిచ్చి చదువు చెప్పేవారు. అందువల్ల వీరి కుటుంబాన్ని గ్రామంలో అందరు ఎంతో గౌరవించేవరు. ఇటువంటి సుసంపన్నమైన, ఉదారభావాలు కలిగిన కుటుంబ నేపథ్యంలో పెరగటంవలన రావుగారు తల్లితండ్రుల ఆదర్శాలను చిన్నతనం నుండే అలవరచుకొనెను.
బాల్యం , విద్యాభ్యాసం
[మార్చు]ఆదేశ్వరరావు గారు తన మాతామహులు, తల్లితండ్రుల సభ్యత, సంస్కారాలను వారసత్వంగా పొందిరి. ఆదేశ్వరరావు గారి బాల్యం ప్రత్తిపాడులోని మల్లయపాలెం గ్రామంలో గడిచింది . అన్ని తరగతులలో ముందుండే రావుగారు హిందీ పై మక్కువచూపేవారుకాదు. ఆసమయంలో సీనియర్ హిందీ అధ్యాపకులు, హిందీ, తెలుగు భాషల్లో గొప్ప కవి శ్రీ ఆలురిబైరగివుదరిగారి ప్రోత్సాహంతో దక్షిణభారత్ హిందీ ప్రచారసభ నుండి నిర్వహించబడే హిందీ పరీక్షలలో ఉతిర్నులైరి . ఆలురిబైరగిగారు తెలుగు, హిందీ, ఆంగ్లం, బంగ్లా, ఉర్దూ భాషలలో గోప్పపండితుడు . ఈయన తరగతి గదులలో విద్యార్థులకు ఇంగ్లీష్, ప్రెంచ్, జర్మన్, స్పానిష్, రూసీ భాషలలో గల సాహితివెత్తల రచనల గురించి వర్ణించేవారు . ఈవిధంగా హిందీ సాహిత్యం ఫై మక్కువ పెంచుకున్న రావుగారు 1959 లో కాశీవిశ్వవిద్యాయలంలో ఎమ్. ఎ హిందీ, 1961 లో తిరుపతి వెంకటేశ్వరా విశ్వవిద్యాలంలో పిహెచ్. డి (హిందీ) చేసి " హిందీ అవుర్ తెలుగు కి స్వఛందతావాది కావ్యధారాఓం కా తులనత్మక్ అధ్యయన్" అను పరిశోధనా గ్రంథాన్ని సమర్పించిరి . అనేక ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన పత్రికలలో ఆదేశ్వరరావు గారి కవితలు ప్రచురింపబడెను. దక్షిణభారత్, ధర్మయుగ్, ఆజ్కల్, భాషా, నఈధార మొదలైన పత్రికలు ముఖ్య మైనవి .
ప్రేరణ
[మార్చు]యుగీన తత్వవేత్తలు, ఆలోచకులు, రాజనితజ్ఞుల ప్రభావంతో మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా సామజిక, సాహిత్య ధోరణులను అర్ధంచేసుకోగల అద్భుతశక్తి రావుగారికి లభించెను. ఒకవైపు విశ్వసాహిత్యానికి చెందిన కవుల ప్రభావం, మరోవైపు ప్రకృతి, శ్రీ సౌదర్యం ఈయన కవిగా మారడాని ఎంతగానో దోహదపడెను . హిందీ సాహిత్యానికి చెందిన సూరదాస్, తులసీదాస్, జయశంకర్ ప్రసాద్, సూర్యకాంత్ త్రిపటినిరాల, పంత్, ఆలురిబైరాగిగారు, బచ్చన్ వంటి గొప్ప కవులను స్ఫూర్తిప్రదాతలుగా భావించిరి. అదేవిధంగా సంస్కృత మహాకవులైన కాళిదాసు, జయదేవ్, తెలుగు కవులైన పోతన వేమనలను ప్రేరణగా భావించిరి. ఆంగ్లంలో షేక్స్పియర్, మిల్టన్, జాన్ కిట్స్ అత్యంత ప్రియమైన కవులు .
వివాహం
[మార్చు]ఆదేశ్వరావుగారి వివాహం కంకణాల వీరయ్య, వెంకటసుబ్బమ్మ గారి కుమార్తె నాగరత్నం గారితో జరిగెను. వీరికి ముగ్గురు సంతానం .
ఉద్యోగం
[మార్చు]1964-1996 వరకూ ఆదేశ్వరరావు గారు తన ఉద్యోగ పర్వాన్ని కొనసాగించిరి. 1964 లో దక్షిణభారత్ హిందీ ప్రచారసభ మద్రాస్ కు విశ్వవిద్యాలయ హొదా లభించెను. ఆసమయంలో రావుగారు అక్కడ ఎమ్.ఎ, పిహెచ్. డి నిర్దేసకులుగా వ్యవహరించసాగిరి. 'ఊర్వశీ ', 'కురుక్షేత్ర ' వంటి గోప్పకృతులలోని చాలాభాగలను