శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
(1984 తెలుగు సినిమా)
TeluguFilm SMVPVBS charitra.jpg
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి హరికృష్ణ
కథ నందమూరి తారక రామారావు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన కొసరాజు,
సి. నారాయణరెడ్డి
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్
విడుదల తేదీ నవంబర్ 29, 1984
భాష తెలుగు

ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు. ఎన్టీయార్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోను, కొన్ని వివాదాలతోను, రాజకీయ దుమారంతోను విడుదలైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమై, 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం 1984 నవంబర్‌ 29న విడుదలై ఘనవిజయం సాధించింది.[1]

నేపథ్యం[మార్చు]

ఎన్టీఆర్‌ కడపజిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లినప్పుడు... తెరమీది బొమ్మలు... ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయి అని వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలో చెప్పిన విషయం ఆయనను ఆకర్షించింది. భగవంతుడు బహుశ ఇలాగే ఉండునేమో అన్నట్టు ఎన్టీ.ఆర్ గారు బ్రహ్మము గారి పాత్రలో అలా జీవించారు. వీరబ్రహ్మం జీవించివుండగా ధరించిన చెక్క చెప్పులు తనకు అతికినట్లు సరిపోవడం ఎన్టీఆర్‌ను ఆశ్చర్యపరిచింది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో తెరమీద బొమ్మలు... రాష్ట్రాలేలతాయి అన్న దానికి ఉదాహరణగా తాను గౌరవించే ఎం.జి.రామచంద్రన్‌ను చూపించారు. అందులో ఎన్టీఆర్‌ కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందన్న వాదనను కొందరు నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చెవినవేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాదిపాటు మద్రాసులో ఉన్న సెన్సార్‌ బోర్డువారు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. చివరికి ఆ సినిమా విడుదలయ్యేనాటికి... ఎన్టీఆర్‌ నిజంగానే సీఎంగా ఉన్నారు.

పాటలు, తత్వాలు[మార్చు]

 • కుల భేద, మత భేదములు
 • యోగానందకరీ
 • అసతోమా
 • కాదు కాదు గురులు
 • భూలోక కల్పతరువు
 • పవిత్రం చరిత్రం
 • మాయదారి మారాల బండిరా
 • అన్నమయ్యా
 • చెప్పలేదని
 • మతం నీదిరా
 • పంచముడని నిన్ను
 • సహనాభవతు
 • శివగోవింద గోవింద
 • నీవు ఎవరో
 • నందామయా గురుడ నందామయా
 • వినరా వినరా ఓ నరుడా
 • ఏమండీ పండితులారా
 • నరుడా నా మాట నమ్మరా
 • చిలకమ్మ పలుకవే పలుకు

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి (28 November 2014). "'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' విడుదలై నేటికి 30 ఏళ్లు". Retrieved 22 November 2017. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]