Jump to content

శ్రీమన్నారాయణ

వికీపీడియా నుండి
శ్రీమన్నారాయణ
దర్శకత్వంరవి చావలి
రచనరవి చావలి
స్క్రీన్ ప్లేరవి చావలి
నిర్మాతరమేశ్ పుప్పాల
తారాగణంనందమూరి బాలకృష్ణ
పార్వతి మెల్టన్
ఇషా చావ్లా
ఛాయాగ్రహణంటి. సురేందర్ రెడ్డి[1]
కూర్పుగౌతంరాజు
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థలు
ఎల్లో ఫ్లవర్స్
ఆర్. ఆర్. మూవీ మేకర్స్ (presents)[2]
పంపిణీదార్లుహరి వెంకటేశ్వర పిక్చర్స్(overseas)
విడుదల తేదీ
ఆగస్టు 30, 2012 (2012-08-30)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు8.65 crore (US$1.1 million)(మొదటిరోజు)[3]

శ్రీమన్నారాయణ రమేష్ పుప్పాల నిర్మాతగా, రవి చావలి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం. సినిమాకు కథ, మాటలు ఘటికాచలం, సంగీతం చక్రి అందించారు. కోట శ్రీనివాసరావు, సురేష్, నాగినీడు, ఆహుతి ప్రసాద్, వినోద్ కుమార్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

5వేల కోట్ల భారీ మొత్తంలో విరాళాలు సేకరించి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్తను చంపి, డబ్బు దొంగిలించి, జర్నలిస్టు అయిన అతని కొడుకు మీదే నేరం మోపిన నేరస్తులను జైలు నుంచే కథానాయకుడు ఎలా అంతం చేసి, డబ్బును పేదరైతులకు అందేలా చేశాడన్నది సినిమా కథాంశం. సినిమా సమీక్షల్లో యావరేజ్ గా అంచనా వేయగా, ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందనే లభించింది.

శ్రీమన్నారాయణ (నందమూరి బాలకృష్ణ) ధైర్యవంతుడు, ఆవేశపరుడు అయిన జర్నలిస్టు. అతను ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతూంటాడు. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టి, వారి అవినీతి డబ్బు నష్టపోవడానికి కారణమవుతాడు. కల్కి నారాయణమూర్తి (విజయకుమార్) శ్రీమన్నారాయణ తండ్రి, జైకిసాన్ ట్రస్టు ఏర్పాటుచేసి రైతుల సంక్షేమం కోసం పోరాడుతూండే వ్యక్తి. రైతుల సంక్షేమం కోరుతూ నారాయణమూర్తి చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి భారీ విరాళాలు ఇవ్వగా, ఆ మొత్తం రూ.5వేల కోట్లు అవుతుంది. కానీ విరాళం ఉపయోగించే సమయం వచ్చేసరికి నారాయణమూర్తి బ్యాంకులో అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాడు. 5వేల కోట్ల సొమ్ము మాయమవుతుంది. అదే సమయంలో శ్రీమన్నారాయణ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న నింద పడుతుంది. శ్రీమన్నారాయణను ఈ పరిణామాలన్నిటికి కారకుడిగా అనుమానించి అరెస్టు చేస్తారు. జైలు నుంచే శ్రీమన్నారాయణ తన అమాయకత్వం నిరూపించుకుని, పోయిన సొమ్ము కనిపెట్టాల్సి వస్తుంది.

ఛానెల్ రిపోర్టర్ అయిన స్వాప్నిక (పార్వతి మెల్టన్) శ్రీమన్నారాయణ నిర్దోషిగా నిరూపించుకునేందుకు సహాయం చేస్తూంటుంది. వాళ్ళిద్దరూ అవినీతిపరుడైన మంత్రి బయల్ రెడ్డి, అతని బావమరిది బ్యాంకు జనరల్ మేనేజర్ రాజన్, డాక్టర్ శ్రీకర్, ఐజీ మార్తాండ్, మలేషియాకు చెందిన హవాలా డీలర్ హర్షద్ భాయ్ ఈ కుట్ర వెనుక ఉన్నారని కనిపెడతారు. ఈ ఆరుగురు అవినీతిపరుల వద్ద ఒక్కో అంకె ఉండేలా ఆరు అంకెల పాస్ వర్డు ఏర్పాటుచేసి దాంతో తన తండ్రి అక్కౌంట్ లాక్ చేశారన్న విషయం తెలుసుకుంటాడు శ్రీమన్నారాయణ. తన తెలివితోనూ, జైలర్ శంకర రెడ్డి (ఆహుతి ప్రసాద్) సహకారంతోనూ వారిలో ఒక్కొక్కరినీ చంపుకుంటూ పోతూ వారి వద్ద వారి పాస్ వర్డ్ అంకె తీసుకుంటూంటాడు. విలన్లు జైలు సెల్ లో సీసీటీవీ కెమెరా పెట్టి తమను తాము కాపాడుకునేందుకు, శ్రీమన్నారాయణ కార్యకలాపాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ జైలర్ తప్పుడు ఫుటేజీ పంపి మోసం చేస్తాడు. సీబీఐ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ (వినోద్ కుమార్) కేసును పరిష్కరించడానికి నియమితుడవుతాడు.

ఐదుగురు దుర్మార్గులను చంపాకా, శ్రీమన్నారాయణ హర్షద్ ని చంపడానికి ప్రణాళిక వేస్తాడు, తనను తాను కాపాడుకోవడానికి శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యుల్ని హర్షద్ బంధిస్తాడు. శ్రీమన్నారాయణ కుటుంబాన్ని చంపకుండా వదిలిపెట్టాలంటే పాస్ వర్డ్ టైప్ చేయాలని హర్షద్ బెదిరిస్తాడు. దాంతో అతను పాస్ వర్డులో తనకు తెలిసిన 4, కె, ఐ, ఎ, ఎన్ అక్షరాలు టైప్ చేస్తూంటాడు. ఐకి, ఎకి మధ్య ఉన్న అక్షరం హర్షద్ వద్ద ఉంటుంది. హర్షద్ పాస్ వర్డ్ తెలియడంతో సొమ్ము అంతటినీ ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉండగానే జ్ఞానేశ్వర్ శ్రీమన్నారాయణ కుటుంబాన్ని కాపాడతాడు. హర్షద్ వద్ద ఉన్న అక్షరం కూడా తెలిసిపోవడంతో 4 KISAN (ఫర్ కిసాన్) అన్నది పాస్ వర్డ్ అని శ్రీమన్నారాయణ ప్రకటిస్తాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మీదికి విసిరి హర్షద్ ను చంపుతాడు. రైతుల డబ్బు రైతులకు ఖర్చుపెట్టడంతో కథ ముగుస్తుంది.

సినిమా బృందం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

సినిమాలో నటులు వారు పోషించిన పాత్రలు ఇలా ఉన్నాయి:

సాంకేతిక వర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం వివరాలు:

  • కథ, మాటలు - ఘటికాచలం
  • సంగీతం - చక్రి
  • కూర్పు - గౌతంరాజు
  • ఛాయాగ్రహణం - సురేందర్ రెడ్డి
  • నిర్మాత - సురేష్ పుప్పాల
  • దర్శకత్వం - రవికుమార్ చావలి

పాటలు

[మార్చు]
  1. ఆరడుగుల అబ్బాయి హ్యాండసం నువ్వోయి ఏడడుగులు నాతో వేసేయి , రచన: చంద్రబోస్, గానం. మనో, కౌసల్య, శ్రావణ భార్గవి.
  2. చలాకి చూపులతో ఛూ మంతరమేసావే , రచన: ప్రవీణ్ లక్మా, గానం. డాలర్ మెహిందీ, ఆదర్శిని
  3. క్యా బే ఆజా చిక్కావు చేతుల్లో, రచన: బాలాజీ, గానం. వినోద్ యాజమాన్య, విజయ
  4. హే తకతై రచన: కందికొండ, గానం. ఉదిత్ నారాయణ, కౌసల్య
  5. ఒత్తేదుననే చుట్టేదున , రచన: ప్రవీణ లక్మ, గానం. సుక్విందార్ సింగ్, గీతామాధురి.

స్పందన

[మార్చు]

సినిమా రివ్యూల్లో తటస్థమైన యావరేజ్ రివ్యూలు పొందినా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.[4] టైమ్స్ ఆఫ్ ఇండియా సమీక్షిస్తూ 3/5 రేటింగ్ ఇచ్చి "బాలకృష్ణ అభిమానులకు సినిమాపై ఫిర్యాదులు ఏమీ ఉండవు. సినిమా ముందేం జరుగుతుందో తెలిసిపోతూనే ఉన్నా, ఆసక్తికరంగానే ఉంద"ని రాశారు.[5] ,ఎన్డీటీవీకి చెందిన చాందినీ ప్రశార్ తన సమీక్షలో సినిమాను ఏ అంచనాలు లేకుండా చూస్తే నిరాశపరచదన్నారు.[6] రెడిఫ్.కాం 2/5 రేటింగ్ ఇస్తూ - శ్రీమన్నారాయణ సినిమాలోని అంశం మంచిదే కానీ దర్శకుడు రవికుమార్ చావలి దాన్ని తెరకెక్కించడంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్నారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "'Srimannarayana' Audio on August 6th". Supergoodmovies.com. Archived from the original on 2012-07-22. Retrieved 2012-08-04.
  2. "Srimannarayana audio on August 6th". 123telugu.com. 1998-01-01. Retrieved 2012-08-04.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-03. Retrieved 2012-09-12.
  4. "Box office report". 123telugu.com. Archived from the original on 12 అక్టోబరు 2013. Retrieved 25 April 2013.
  5. "Srimannarayana". timesofindia.indiatimes.com. 30 August 2012. Retrieved 25 April 2013.
  6. "Movie Review: Telugu film Srimannarayana". movies.ndtv.com. 30 August 2012. Archived from the original on 12 అక్టోబరు 2013. Retrieved 25 April 2013.
  7. "Review: Srimannarayana fails in execution". rediff.com. 30 August 2012. Retrieved 25 April 2013.