అశోక చక్రవర్తి (1989 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక చక్రవర్తి
(1989 తెలుగు సినిమా)
Ashoka-Chakravarthy.jpg
దర్శకత్వం యస్.యస్.రవిచంద్ర
తారాగణం నందమూరి బాలకృష్ణ,
భానుప్రియ
సంగీతం ఇళయరాజా
కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అశోక చక్రవర్తి 1989 లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కాజా వెంకటరావమ్మ నిర్మించిన తెలుగు యాక్షన్ చిత్రం. ఎస్.ఎస్.రవి చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం ప్రియదర్శన్ యొక్క 1988 మోహన్ లాల్ -స్టారర్ మలయాళం బ్లాక్ బస్టర్ ఆర్యన్ యొక్క అధికారిక రీమేక్.[1]

కథ[మార్చు]

సనాతన సాంప్రదాయ బ్రాహ్మణుడైన వేదం వెంకట అశోక్ ( నందమూరి బాలకృష్ణ ) ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తూంటాడు. ఊర్మిళ ( భానుప్రియ ), అశోక్ ప్రేమలో ఉంటారు. కానీ ఈర్మిళ తండ్రి షణ్ముఖ శాస్త్రి ( గొల్లపూడి మారుతీరావు ) అశోక్ తండ్రి వేదం ( జెవి సోమయజులు ) కు ద్రోహం చేసి, వారి మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారిని దారిద్య్రం లోకి నెట్టాడు. ఆదిశేషయ్య ( నర్రా వెంకటేశ్వర రావు ), షణ్ముఖ శాస్త్రి కలిసి ప్రణాళిక వేసుకుని అశోక్‌ను దొంగగా ప్రకటించి జైలుకు పంపించారు. జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత, అశోక్ తండ్రి అతనిని ఇంట్లోకి రానివ్వడు. అశోక్ ఇప్పుడు ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా అతను తన కుటుంబ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టగలడు. ఈ పరిస్థితిలో, అతను బొంబాయిలోని కరీం సాహబ్ ( సత్యనారాయణ ) ను కలుస్తాడు. నగరంలో అక్రమ, అవినీతి కార్యకలాపాలకు పాల్పడతాడు. ఇవన్నీ చేసి, అశోక్ కాస్తా అశోక చక్రవర్తి అవుతాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు. కానీ, ఎవరి కోసమైతే తాను ఇబ్బందుల్లోకి దూకాడో ఆ తల్లిదండ్రుల ఆదరణను, ప్రేమనూ తిరిగి పొందగలడా అనేది మిగతా చిత్రం. [2]

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "ఎందరో మహానుభావులు"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 5:06
2. "అబ్బా రూపమెంత"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:33
3. "లిమ్మరిపు"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:33
4. "సువ్వి సువ్వి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:35
5. "జనక్ జనక్"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:28
మొత్తం నిడివి:
23:15

మూలాలు[మార్చు]

  1. Ashoka Chakravarthy (Cast & Crew). Chitr.com.
  2. Ashoka Chakravarthy (Story). The Cine Bay.