Jump to content

పంచి బోరా

వికీపీడియా నుండి
పంచి బోరా
3వ బోరోప్లస్ గోల్డ్ అవార్డుల నుండి పంచి బోరా ఫోటో
జననం
గౌహతి, అస్సాం, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిటివి, సినిమా నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

పంచి బోరా, అస్సాం రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి, మోడల్.[1] తెలుగు సినిమాలలో కూడా నటించింది.

జననం

[మార్చు]

పంచి బోరా అస్సాం రాష్ట్రం, గౌహతిలో జన్మించింది. తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి, పదవీ విరమణ చేసిన తరువాత పూణేలో స్థిరపడ్డాడు.[2] లాయర్ కావాలనుకున్న పంచి బోరా, పూణేలోని ఐఎల్ఎస్ న్యాయ కళాశాలలో చేరింది.

మోడలింగ్

[మార్చు]

పంచి బోరా కళాశాలలో మొదటి సంవత్సరంలోనే వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ ప్రకటనలలో నటించింది. తన తల్లితో కలిసి టాటా ఇండికామ్ వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది.[3] క్యాడ్‌బరీ ప్రకటనలో కూడా అవకాశం కూడా వచ్చింది.[4]

టివిరంగం

[మార్చు]

బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తా కపూర్, ఆ ప్రకటనను చూసి, ఎంటివిలో ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ కిత్నీ మస్త్ హై జిందగీ[4] కోసం ఆడిషన్‌కు పిలిచింది.[2] రేడియో జాకీ, అనన్య పూరి, సిరీస్‌లో ప్రధాన కథానాయికలలో ఒకరిగా నటించింది. కిత్నీ మస్త్ హై జిందగీ తర్వాత, ఆమె కొంత విరామం తీసుకొని, తరువాత తన న్యాయ విద్యను వదిలేసి, పూణేలోని ఫెర్గూసన్ కళాశాలో చేరి[2] బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తిచేసింది.[5] ఆ తరువాత ఏక్తా కపూర్ తీసిన కయామత్‌ సీరియల్ లో నటించింది.[5][2] 2010లో, రష్యాలో ఉన్నప్పుడు, ది హిందూ – ది ఇండియన్ అనే ఆంగ్ల-భాష రష్యన్ టివి ప్రొడక్షన్‌లో కథానాయికగా ఎంపికై, మాయ అనే భారతీయ అమ్మాయిగా నటించింది.[6] 2012లో, గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్‌లో డిజైనర్‌ కావాలనుకునే అమ్మాయి నీలంగా నటించింది.[7]

2011లో ఆకాశమే హద్దు అనే తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.[8] తరువాత ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించింది.[9] ఢమరుకం, యామిని చంద్రశేఖర్‌, ప్రభంజనం వంటి సినిమాలలో నటించింది.[10]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
2011 ఆకాశమే హద్దు కీర్తి తెలుగు
2012 ఊ కొడతారా ఉలిక్కిపడతారా విశాలాక్షి తెలుగు
2012 ఢమరుకం కవిత తెలుగు
2014 యామిని చంద్రశేఖర్ యామిని తెలుగు
2014 ప్రభంజనం ప్రణిత తెలుగు
2019 22 యార్డ్స్ షోనాలి హిందీ
2013 ఇట్స్ మై లైఫ్ కాజల్ హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు
2004–2005 కిత్నీ మస్త్ హై జిందగీ అనన్య పూరి
2007 కహిన్ తో హోగా అతిథి (ప్రాచీ) అతిథి పాత్ర
కహానీ ఘర్ ఘర్ కియీ
కసౌతి జిందగీ కే
2007–2009 కాయమత్ ప్రాచీ మిలింద్ మిశ్రా
2008 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ అతిథి (ప్రాచీ) అతిథి పాత్ర
కరమ్ అప్నా అప్నా
కస్తూరి
సిఐడి నీలిమ
కౌన్ జీతేగా బాలీవుడ్ కా టికెట్ పోటీదారు
2009 బిగ్ బాస్ 3 అతిథి 3 రోజులు
2010 ది హిందూ మాయ రష్యన్ సిరీస్
మోంటే-కార్లో టెలివిజన్ ఫెస్టివల్[11] లో డ్రామా సిరీస్
ఉత్తమ నటిగా నామినేట్ చేయబడింది
కేశవ్ పండిట్ సోను జునేజా
2012 గుమ్రా: అమాయకత్వం ముగింపు నీలం ఎపిసోడిక్ ప్రదర్శన
2015–2016 గంగ జాన్వీ సాగర్ చతుర్వేది

మూలాలు

[మార్చు]
  1. Nishant (8 August 2007). "Panchi, no time for love". The Times of India. Retrieved 28 August 2013.
  2. 2.0 2.1 2.2 2.3 "Metro Plus Visakhapatnam / Television : Twice lucky!". The Hindu. 17 February 2007. Archived from the original on 22 February 2007. Retrieved 18 April 2014.
  3. "Panchi Bora is on cloud nine – Oneindia Entertainment". Entertainment.oneindia.in. 25 November 2008. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 18 April 2014.
  4. 4.0 4.1 "rediff.com: When Ekta Kapoor tracked down Panchi Bora!". Rediff.com. Retrieved 18 April 2014.
  5. 5.0 5.1 "rediff.com: When Ekta Kapoor tracked down Panchi Bora!". Rediff.com. Retrieved 18 April 2014.
  6. "Panchi flies to Moscow". Hindustan Times. 12 January 2010. Archived from the original on 19 April 2014. Retrieved 18 April 2014.
  7. "Panchi Bora back with Gumrah". The Times of India. 28 May 2012. Retrieved 18 April 2014.
  8. Y. Sunita Chowdhary (10 September 2011). "Aakasame Haddu – Love guru weaves the magic". The Hindu. Retrieved 18 April 2014.
  9. "Actress Panchi Bora | Lakshmi Manchu". CineGoer.com. 4 December 2011. Archived from the original on 19 April 2014. Retrieved 18 April 2014.
  10. M. L. Narasimham (8 February 2014). "Yamini Chandrasekhar: The mystery deepens". The Hindu. Retrieved 18 April 2014.
  11. "Russian World Studios". Rwstudio.com. Archived from the original on 18 ఏప్రిల్ 2014. Retrieved 18 April 2014.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పంచి_బోరా&oldid=3979818" నుండి వెలికితీశారు