అనురాగ దేవత
| అనురాగ దేవత (1982 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| నిర్మాణం | నందమూరి హరికృష్ణ |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జయసుధ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | రామకృష్ణ సినీ స్టుడియోస్ |
| విడుదల తేదీ | జులై 1, 1982 |
| భాష | తెలుగు |
ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ఆర్ సొంతంగా నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా) రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్నది . ఈ చిత్రంలో నందమూరితారక రామారావు , శ్రీదేవి, జయసుధ ,నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. విజయవంతంగా ప్రదర్శించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
చిత్ర కథ
[మార్చు]ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. డ్రైవరు పట్ల ఆశ పెంచు కున్న శ్రీదేవి చివరలో రామారావు, జయసుధ కలవడంతో వంటరిగా మిగిలిపోతుంది.
నటవర్గం
[మార్చు]- ఎన్.టి.రామారావు_రాము
- జయసుధ_తులసి
- శ్రీదేవి_దేవి
- బాలకృష్ణ_ప్రకాష్
- నూతన్ ప్రసాద్_గోపాల్
- అల్లు రామలింగయ్య_పాపారావు
- ఋష్యేంద్రమణి_పెద్దమ్మ
- కవిత_ధనలక్ష్మి
- గుమ్మడి_పూజారి
- అన్నపూర్ణ_రాము తల్లి
- అనురాధ శ్రీరామ్ (బాల నటి)_రామతులసి
- డబ్బింగ్ జానకి_డాక్టర్
- ముక్కామల_డాక్టర్
- మిక్కిలినేని_ శివయ్య
- చిట్టిబాబు_వయొలినిస్ట్
- చిడతల అప్పారావు_మ్యూజిసియన్.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాతినేని రామారావు
- కథ: పరుచూరి బ్రదర్స్
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- నిర్మాత:నందమూరి హరికృష్ణ
- నిర్మాణ సంస్థ: రామకృష్ణా సినీ స్టూడియోస్
- కెమెరా:నందమూరి మోహనకృష్ణ
- ఎడిటింగ్: రవి
- విడుదల:09:01:1982.
పాటలు
[మార్చు]- చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా ( షీశా హో యా దిల్ హో ఆఖిర్ టూట్ జాతా హై) రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. పి సుశీల
- నీ ఆట నాపాట పదిమంది చూడాలీపూట , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- అందాల హృదయమా రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఆడవే గోపికా , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- ముగ్గురమ్మల రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
- ముగ్గురమ్మల కన్న , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.పి సుశీల.
