Jump to content

శ్రీఆంజనేయం

వికీపీడియా నుండి
(శ్రీ ఆంజనేయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీఆంజనేయం
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ
నిర్మాతకృష్ణవంశీ
తారాగణంనితిన్
ఛార్మీ కౌర్
అర్జున్ సర్జా
ప్రకాశ్ రాజ్
రమ్యకృష్ణ
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
జూలై 24, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీఆంజనేయం 2004 జూలై 24 విడుదలైన సోషియో ఫాంటసీ తెలుగు చిత్రం.[1] కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్, ఛార్మి కౌర్ అర్జున్ సర్జా, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రామాపురం అనే గ్రామంలో ఒక సివిల్ ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే ఆనకట్టను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరు బెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి (నితిన్) అనాథ అవుతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తారు. అంజి చిన్నప్పటి నుంచి ఆంజనేయుడికి వీరభక్తుడు.

బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన గుడి అడుగున గ్రానైటు శిలలు ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త దేవాలయం నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి (అర్జున్) మారు వేషంలో అంజి కర్తవ్యాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం మనుషులు అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సంగీతం

[మార్చు]

మణిశర్మ స్వరపరచిన ఈ సినిమా పాటలు మారుతి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."ఊరేగి రావయ్య"వేటూరి సుందరరామమూర్తిశంకర్ మహదేవన్5:48
2."రామ రామ రఘురామ"సిరివెన్నెల సీతారామశాస్త్రిమల్లికార్జున్5:17
3."అవ్వాయి తువ్వాయి"సిరివెన్నెల సీతారామశాస్త్రిటిప్పు, శ్రేయా ఘోషాల్4:09
4."పూల ఘుమ ఘుమ"సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రేయా ఘోషాల్5:04
5."శ్లోకం" కె. ఎస్. చిత్ర, కల్పన రాఘవేంద్ర2:37
6."తిక మక"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:50
7."ఏ యోగమనుకోను"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం3:14
మొత్తం నిడివి:31:00

మూలాలు

[మార్చు]
  1. జీవి. "శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 17 ఫిబ్రవరి 2017. Retrieved 12 December 2016.

బయటి లంకెలు

[మార్చు]