చంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంటి
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
రచనపి.వాసు (కథ), జి. సత్యమూర్తి (మాటలు)
నిర్మాతకె.ఎస్.రామారావు
తారాగణంవెంకటేష్,
మీనా
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుకృష్ణమూర్తి - శివ
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992 జనవరి 10 (1992-01-10)
సినిమా నిడివి
139 ని
భాషతెలుగు

చంటి 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు చిన్నతంబి అనే తమిళ సినిమా మాతృక. ఈ సినిమా కన్నడలో రామాచారి అనే పేరుతో, హిందీలో అనారీ అనే పేరుతో పునర్నిర్మితమైంది. హిందీ రీమేక్ లో వెంకటేష్ Downloading నటించాడు.[1]

కథ[మార్చు]

నందిని ఒక జమీందారు కుటుంబంలో పుడుతుంది. వారి వంశంలో లేకలేక కలిగిన ఆడపిల్ల ఆమె. కానీ ఆమె పుట్టగానే తల్లిదండ్రులకు కోల్పోవడంతో ఆమె ముగ్గురు అన్నయ్యలు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఆమె జాతకం ప్రకారం అన్నయ్యలు నచ్చిన వ్యక్తితోకాక వేరే వ్యక్తితో పెళ్ళి అవుతుందని ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. దాంతో ఆమెకు ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా అంగరక్షకులను ఏర్పాటు చేసి పెంచుతుంటారు. అదే ఊళ్ళో పుట్టిన చంటి, ఒక అమాయకుడు. అతనికి తన తల్లి, పాటలే లోకం. ఒకసారి నందిని అంగరక్షకులతో గొడవపడ్డ చంటి వారిని కొడతాడు. దాంతో నందిని అన్నయ్యలు అతన్నే ఆమెకు అంగరక్షకుడిగా నియమిస్తారు. నందిని నెమ్మదిగా అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న తంబి సినిమా మాతృక. చిన్న తంబి సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో తీయాలని భావించారు, అయితే అప్పటికే కె. ఎస్. రామారావు సినిమా హక్కుల్ని కొనేశారు. ఆయన వెంకటేష్తో తీద్దామని నిర్ణయించుకున్నారు.[2] తమిళంలో నటించిన ఖుష్బూ మళ్ళీ తెలుగులో వెంకటేష్ సరసన నటించడానికి అంగీకరించకపోవడంతో మీనాను కథానాయికగా తీసుకున్నారు.

విడుదల[మార్చు]

జనవరి 10, 1992 న విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయం సాధించింది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

పాటలు[మార్చు]

సంగీతం ఇళయరాజా

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'చంటి' ఆ హీరోతో తీద్దామనుకున్నారు.. కానీ..! - venkatesh chanti complete 29 years". www.eenadu.net. Retrieved 2021-04-06.
  2. పరుచూరి, గోపాలకృష్ణ. "11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్". నందమూరి ఫ్యాన్స్.కాం. Retrieved 17 August 2015. లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి
"https://te.wikipedia.org/w/index.php?title=చంటి&oldid=4034466" నుండి వెలికితీశారు