రాఖీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఖ్రియ a పంజాబీ: ਰੱਖੜੀਆ
రఖ్రియ a పంజాబీ: ਰੱਖੜੀਆ
రఖ్రియ పండగకు ఉదాహరణలు
అధికారిక పేరురఖ్రియ
యితర పేర్లురఖర్ పుణ్య
జరుపుకొనేవారుహిందువులు, సిక్కులు, క్రైస్తవులు,
జరుపుకొనే రోజుశ్రావణ మాసంలోని పౌర్ణమి రోజు ਸਾਵਨ ਪੁੰਨਿਆ

రాఖీ శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ మణులు సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరులకు కట్టే ఒక రకపు దారపు పట్టీ. ఈ అచారం హిందువులు, సిక్కులలో కనిపిస్తుంది[1][2][3]. పంజాబ్ ప్రాంతంలో రక్షా బంధన్ పండుగను రఖ్రియ గా జరుపుకుంటారు. [4] ఈ పండుగను కూడా శ్రావణ మాసంలో అదే రోజు జరుపుతారు. రక్షాబంధన్ అనే పండుగ సోదరీ, సోదరుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుతారు. "రఖ్రి" అనగా "రక్షించడం" అని అర్థం. ఈ పండలలో సోదరి సోదరుని శ్రేయస్సును కోరుతూ రాఖీ కడితే, సోదరుడు సోదరిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఫెడొరేక్ (2006) ప్రకారం రాఖీ పండుగ "సోదరులు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని" తెలియజేసే పండుగ.[5] వివాహితులైన స్త్రీలు కూడా ఈ పండగ రోజున తన పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీలు కడతారు.[6]

ఒక రాఖ్రిని ఎవరైనా బంధువు లేదా సంబంధం లేని వ్యక్తులకు కూడా సోదరులుగా భావించి కట్టవచ్చు. ఎవరైనా స్త్రీ సంబంధం లేని వ్యక్తి చేతికి రాఖీ ని కడితే వారిమధ్య సోదరీ, సోదరుల అనుబంధం ఉన్నట్లు భావించబడుతుంది. ఈ పండుగ తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, తాతల దినోత్సవం వలె తోబుట్టువుల దినోత్సవంగా భావించవచ్చు.[7]

వేడుక

[మార్చు]

ఈ పండగ రోజు సోదరి సోదరుని చేతికి రాఖీ కడితే సాంప్రదాయకంగా సోదరుడు ఏదైనా బహుమతిని సోదరికి అందజేస్తాడు. వేడుకల మరొక లక్షణం స్వీట్లు తీసుకోవడం.[8] ప్రత్యేకమైన వేడుక లేదు, కానీ కొందరు సోదరీమణులు జానపద పాటలు పాడతారు[9].

మూలాలు

[మార్చు]
  1. Eleanor Nesbitt (2016) Sikhism: A Very Short Introduction. Oxford University Press[1]
  2. Marian de Souza, Gloria Durka, Kathleen Engebretson, Robert Jackson, Andrew McGrad (2007) International Handbook of the Religious, Moral and Spiritual Dimensions in Education. Springer [2]
  3. People of India: A - G., Volume 4 (1998) Oxford Univ. Press[3]
  4. "Raksha bandhan is here!". The Hindu (in Indian English). 2014-08-08. ISSN 0971-751X. Retrieved 2016-08-17.
  5. Fedorak, Shirley (2006) Windows on the World: Case Studies in Anthropology. Nelson. [4]
  6. Hess, Linda (2015) Bodies of Song: Kabir Oral Traditions and Performative Worlds in North India. Oxford University Press[5]
  7. "Articles - Siblings Day Foundation". Archived from the original on 2016-06-17. Retrieved 2016-08-17.
  8. Kristen Haar, Sewa Singh Kalsi (2009) Sikhism
  9. Pande, Alka (1999) Folk Music & Musical Instruments of Punjab: From Mustard Fields to Disco Lights, Volume 1 [6]
"https://te.wikipedia.org/w/index.php?title=రాఖీ&oldid=3249003" నుండి వెలికితీశారు