ఉపేంద్ర (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపేంద్ర
1996 లో ఉపేంద్ర
జననం
ఉపేంద్ర రావ్

ఇతర పేర్లుఉప్పి[1]
వృత్తినటుడు,
సినీ దర్శకుడు,
సినీ నిర్మాత,
స్క్రీన్ ప్లే రచయిత,
సాహిత్యకారుడు,
నేపధ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1989–ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిప్రియాంక త్రివేది (m. 2003)
పిల్లలుఐశ్వర్య ఉపేంద్ర,
ఆయుష్ ఉపేంద్ర

ఉపేంద్ర ఒక భారతీయ సినీ దర్శకుడు, నటుడు. కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు.

నేపధ్యము

[మార్చు]

ఇతని పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని తెక్కెట్టెలో మంజునాధరావు, అనసూయమ్మ లకు జన్మించాడు. ఇతని అన్న సుధీందర్ రావు తర్వాత ఇతను వీరి తల్లిదండ్రులకు రెండవ సంతానం. వీరి కుటుంబం మిక్కిలి పేదరికంలో ఉండేది. కుటుంబ పోషణకోసం వీరి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. చిన్నతనంలోనే ఇతనికి కంటికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డాడు. దీని ఫలితంగా ఇప్పటికీ ఇతని కనుగుడ్లు త్రిప్పడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. దీనిని మనం ఇతడు నటించిన చిత్రాలలో కూడా గమనించవచ్చు. బెంగుళూరు లోని ఎ.పి.ఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బికాం పట్టాను అందుకున్నాడు. కళాశాలలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నాటక ప్రదర్శనలు చేసేవాడు. అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాధ్ దృష్టిలో పడ్డాడు.[2] ఇది ఇతని నట జీవితంలో మేటి మైలురాయిగా నిలిచి ఆ తర్వాత అతని నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది.

వ్యక్తిగత జీవితము

[మార్చు]

2003, డిసెంబరు 14న ఇతను తన సహనటి, మిస్ కోల్‌కతాగా ఎన్నికైన ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నాడు. వీరి కుటుంబం బెంగుళూరు లోని బనశంకరి మూడవ స్టేజిలో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు.[3][4]

సినిమాలు

[మార్చు]

ఉపేంద్రకు సినీరంగంలోని దాదాపు అన్ని విభాగాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంది. దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం చిత్రం ప్రధాన నటులు పురస్కారాలు ఇతర వివరాలు
1992 తర్లే నన్‌ మగ జగ్గేష్ వ్యాఖ్యాత, కథా రచయిత, గీత రచయిత, దర్శకుడిగా తొలి చిత్రం
1993 ష్! కుమార్ గోవింద్ అతిథి పాత్ర, రచయిత, పాటల రచయిత
1995 ఓమ్ శివరాజ్ కుమార్ ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు
కర్ణాటక ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు
నేపథ్య వ్యాఖ్యాత, రచయిత
1995 ఆపరేషన్ అంత అంబరీష్ అతిథి పాత్ర, రచయిత, పాటల రచయిత
1997 ఓంకారం (సినిమా) డాక్టర్ రాజశేఖర్ తెలుగు చిత్రం, కన్నడ ఓమ్ చిత్రం ఆధారంగా
1998 A స్వీయ పాత్ర ఉదయ సినీ పురస్కారం - ఉత్తమ నటుడు రచయిత, పాటల రచయిత
1999 స్వస్తిక్ రాఘవేంద్ర రాజ్‌కుమార్ కథా రచయిత, పాటల రచయిత
1999 ఉపేంద్ర స్వీయ పాత్ర ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు - కన్నడ (1999)
ఫిలింఫేర్ ఉత్తమ కన్నడ చిత్రం
కథా రచయిత, పాటల రచయిత
2010 సూపర్ స్వీయ పాత్ర కర్ణాటక ప్రభుత్వ ఉత్తమ చిత్రం
కర్ణాటక ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు
ఉదయ ఉత్తమ స్క్రీన్ ప్లే
సువర్ణ సినీ పురస్కారాలు- 2011 – అభిమాన సినీ పురస్కారం
సువర్ణ సినీ పురస్కారాలు- 2011 – ఉత్తమ సినీ దర్శకుడు.[5]
కథా రచయిత, పాటల రచయిత
2015 ఉప్పి 2 \ ఉపేంద్ర 2 - తెలుగు ఉపేంద్ర
2019 ఐ లవ్ యు కన్నడ \ తెలుగు సంతోష్ నారాయణ్

నటుడిగా

[మార్చు]
Key
Films that have not yet been released Denotes films that have not yet been released
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
1989 అనంతన అవాంతర కన్నడ కామదేవగా ఒక గీతంలో అతిథి పాత్ర
1991 అజగజాంతర కన్నడ అతిథి పాత్ర
1993 ష్! కన్నడ అతిధి పాత్ర
1995 ఆపరేషన్ అంత కన్నడ అతిధి పాత్ర
1998 A సూర్య కన్నడ
1998 కన్యాదానం తెలుగు
1999 ఉపేంద్ర నాను కన్నడ
2000 ప్రీత్సె చంద్రు కన్నడ
2000 ఒక్క మాట సూర్యం తెలుగు
2001 రా శ్రీధర్ తెలుగు
2002 H2O ఉదయశంకర్ కన్నడ
తమిళం
2002 నీతోనే ఉన్నాను రవి తెలుగు
2002 సూపర్ స్టార్ ప్రవి / దీపేంద్ర కన్నడ
2002 నాగరహావు అజయ్ కన్నడ
2002 నాను నానె రాజ కన్నడ
2002 హాలీవుడ్ ఉపేంద్ర / సురేంద్ర / రాబోట్ US47 కన్నడ
2003 కుటుంబ విజయ్ కన్నడ
2003 రక్త కన్నీరు మోహన్ కన్నడ
2003 గోకర్ణ సిద్ద కన్నడ
2004 ఓంకార సత్య కన్నడ
2005 గౌరమ్మ వెంకటస్వామి కన్నడ తెలుగు చిత్రం నువ్వు నాకు నచ్చావ్ రీమేక్
2005 న్యూస్ గురు కన్నడ
2005 ఆటో శంకర్ శంకర్ కన్నడ
2006 ఉప్పిదాదా ఎం.బి.బి.ఎస్. రావు బహద్దూర్ ఉపేంద్ర కన్నడ
2006 తందెగె తక్క మగ సత్య కన్నడ
2006 ఐశ్వర్య అభిషేక్ హెగ్డే కన్నడ
2007 పరోడి విజయ్ కన్నడ
2007 మస్తి సిద్దప్పజి కన్నడ
2007 టాస్ నీలకంఠ తెలుగు
2007 అనాధరు రుద్ర కన్నడ తమిళా చిత్రం శివపుత్రుడు రీమేక్
2007 లవకుశ చక్ర్రి కన్నడ
2008 సత్యం మాణిక్‌వేల్ తమిళం
2008 బుద్దివంత జోసెఫ్ ఫెర్నాండెజ్/ పంచామృత / జాకీర్ హుస్సేన్ / విజయ్ మిత్తల్ / సమరసింహారెడ్డి / రజనీష్ స్వామి / శ్యాం ప్రసాద్ కన్నడ 7 పాత్రలు పోషించాడు
2008 మస్తు మజా మాడి స్వీయ పాత్ర కన్నడ ప్రత్యేక పాత్ర
2009 దుబాయ్ బాబు బాబు కన్నడ తెలుగు చిత్రం దుబాయ్ శీను రీమేక్
2009 రజని రజని కన్నడ
2010 సూపర్ సుభాష్ చంద్ర గాంధీ కన్నడ
2011 శ్రీమతి రాజ్ కుమార్ కన్నడ
2012 ఆరక్షక అరుణ్/ విష్ణు కన్నడ
2012 కఠారి వీర సుర సుందరాంగి ఉపేంద్ర/ మోహన్ కన్నడ SIIMA ఉత్తమ నటుడు పురస్కారం (విమర్శకుల చేత)
2012 గాడ్‌ఫాదర్ శివ/ అజయ్/ విజయ్ కన్నడ ప్రతిపాదన —బెంగులూరు టైమ్స్ ఉత్తమ ప్రతినాయక పాత్ర పురస్కారం
2012 కల్పన రాఘవేంద్ర కన్నడ ఉదయ ఉత్తమ నటుని పురస్కారం
2013 టోపీవాలా బసక్ కన్నడ ప్రతిపాదన—SIIMA ఉత్తమ నటుని పురస్కారం
2014 బ్రహ్మ బ్రహ్మ కన్నడ
తెలుగు
2014 సూపర్ రంగ శ్రీరంగ కన్నడ
2015 శివం బసవన్న / అలెగ్జాండర్ కన్నడ
2015 సన్నాఫ్ సత్యమూర్తి దేవరాజ్ తెలుగు
2015 ఉప్పి2 కన్నడ నిర్మాణంలో ఉన్నది[6]

మూలాలు

[మార్చు]
  1. "Ruppis Resort Official Page". Archived from the original on 2015-04-23.
  2. Rao, Upendra (20 September 2014). Weekend With Ramesh - Episode 15 - September 20, 2014. India: Zee Kannada.
  3. "The 'Super' man in your neighborhood – Upendra". The Hindu. Archived from the original on 2011-04-30.
  4. "Upendra & Priyanka – When two cultures merge". Deccan Herald.
  5. "Upendra's 'Super' tops State Awards". Deccan Herald.
  6. "Uppi2 Songs Recording". Archived from the original on 2015-06-26.

బయటి లంకెలు

[మార్చు]