ధనుష్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ధనుష్ | |
---|---|
![]() | |
జననం | వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా జులై 28, 1983 |
వృత్తి | నటుడు, నేపధ్య గాయకుడు, గీత రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2000–present |
జీవిత భాగస్వాములు | ఐశ్వర్య రజనీకాంత్ (2004–present) |
వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా, రంగస్థలనామం ధనుష్ గా సుపరిచితుడైన భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. 2011 లో, ఇతడు నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు, ఇది యూట్యూబులో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా నమోదు అయ్యింది. 2014 వరకూ ఇతడు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఇతడు తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.