లోకల్ బాయ్
లోకల్ బాయ్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ |
కథ | ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ |
దీనిపై ఆధారితం | తమిళ సినిమా ‘పటాస్’ డబ్బింగ్ |
నిర్మాత | సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఓం ప్రకాశ్ |
కూర్పు | ప్రకాశ్ మబ్బు |
సంగీతం | వివేక్-మెర్విన్ |
నిర్మాణ సంస్థ | సత్యజ్యోతి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లోకల్ బాయ్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో విడుదలైన ‘పటాస్’ సినిమాను తెలుగులో లోకల్ బాయ్ పేరుతో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సీహెచ్ సతీష్‌కుమార్ డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.[1] ధనుష్, స్నేహా, మెహరీన్, నవీన్‌చంద్ర, నాజర్, మనోబాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 28 ఫిబ్రవరి 2020న విడుదలైంది.
కథ
[మార్చు]శక్తి (ధనుష్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, ఈ క్రమంలో ఒకరోజు తన స్నేహితుడితో కలిసి బాక్సింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని అయిన నీలకంఠం(నవీన్ చంద్ర) బాక్సింగ్ అకాడమీలో దొంగతనం చేస్తాడు. దీని పై నీలకంఠం పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అలాగే 16ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలైన కన్యాకుమారి (స్నేహ) సైతం నీలకంఠం ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఈ కన్యాకుమారి ? శక్తితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆమె నీలకంఠం ను ఎందుకు చంపాలని అనుకుంటుంది? అనేదే మిగతా సినిమా కథ. [2]
నటీనటులు
[మార్చు]- ధనుష్
- స్నేహా
- మెహ్రీన్ పిర్జాదా
- నవీన్ చంద్ర
- నాజర్
- మనోబాలా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
- నిర్మాత: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్
- సంగీతం: వివేక్-మెర్విన్
- సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్
మూలాలు
[మార్చు]- ↑ The News Minute (19 February 2020). "Dhanush's 'Pattas' to release in Telugu as 'Local Boy'" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-26. Retrieved 30 November 2021.
- ↑ Eenadu (28 February 2021). "రివ్యూ: లోకల్ బాయ్". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.