రఘువరన్ బి.టెక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘువరన్ బి.టెక్
దర్శకత్వంవేల్‌రాజ్‌
నిర్మాతస్రవంతి రవికిశోర్
తారాగణంధనుష్ , అమలా పాల్, సురభి
ఛాయాగ్రహణంఆర్. వేల్‌రాజ్
కూర్పుఎం.వి.రాజేష్ కుమార్
సంగీతంఅనిరుధ్ రవి చందర్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
పంపిణీదార్లు1 జనవరి 2015
విడుదల తేదీ
1 జనవరి 2015 (2015-01-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

రఘువరన్ బి.టెక్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమాకు వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించాడు. ధనుష్ , అమలా పాల్, సురభి, శరణ్య పొనవన్నన్, వివేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 18 జులై 2014న తమిళంలో ‘వేలై ఇళ్ళ పట్టదారి’ పేరుతో , తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో 1 జనవరి 2015న విడుదలైంది.[1]

సివిల్‌ ఇంజినీర్‌ అయిన రఘువరన్‌ (ధనుష్‌) చాలా తెలివైన వాడు అయినా కానీ తాను కోరుకున్న ఉద్యోగం తప్ప ఇంకోటి చేయనని ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా జాలీగా లైఫ్ ను లీడ్ చే్సుకుంటూ వస్తుంటాడు. పక్కింట్లో ఉండే శాలిని (అమలాపాల్) మొదట్లో రఘు పనికిరాని వాడుగా భావించినా అతడి గురించి తెలుసుకుని ప్రేమలో పడుతుంది. తండ్రి (సముద్రఖని) చేత చీవాట్లు తింటూ తల్లి (శరణ్య) చనిపోవడానికి పరోక్షంగా కారణమవుతాడు. ఆ తర్వాత అతనికి ఓ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం వస్తుంది. తనకి పెద్ద ప్రాజెక్ట్‌ దక్కితే ఆ కాంట్రాక్ట్‌ దక్కించుకోలేకపోయిన అరుణ్‌ (అమితాష్‌) అనే బిల్డర్‌ రఘువరన్‌ లక్ష్యానికి అడుగడుగునా అడ్డు పడతాడు. బుద్ధి బలం, కండ బలంతో తాను అనుకున్నది రఘువరన్‌ ఎలా సాధిస్తాడు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
  • నిర్మాత: స్రవంతి రవికిశోర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేల్‌రాజ్‌
  • సంగీతం: అనిరుధ్ రవి చందర్
  • సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌
  • ఎడిటర్: ఎం.వి.రాజేష్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "Raghuvaran B.Tech Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  2. Sakshi (3 January 2015). "'బి.టెక్' పాసైన 'రఘువరన్'". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
  3. The Hans India (1 January 2015). "Dhanush Raghuvaran B.Tech review" (in ఇంగ్లీష్). Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.